
Dibrugarh Express accident : 13 రైళ్లు దారి మళ్లింపు.. మరికొన్ని రద్దు.. పూర్తి జాబితా ఇదే..
Dibrugarh Express accident | ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో గురువారం దిబ్రూఘర్ ఎక్స్‌ప్రెస్‌లోని 10 నుండి 12 కోచ్‌లు పట్టాలు తప్పడంతో కనీసం 13 రైళ్లు ప్రభావితమయ్యాయి. లక్నో గోండా గోరఖ్‌పూర్ మార్గంలోని అనేక రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నారు. మరికొన్ని రైళ్లను రద్దు చేశారు. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో 20 మంది గాయపడ్డారని ఉత్తరప్రదేశ్ రిలీఫ్ కమిషనర్ జిఎస్ నవీన్ కుమార్ తెలిపారు. 40 మంది సభ్యులతో కూడిన వైద్య బృందం మరియు 15 అంబులెన్స్‌లు సంఘటనా స్థలంలో ఉన్నాయని, మరిన్ని వైద్య బృందాలు అంబులెన్స్‌లను అక్కడికి తరలిస్తున్నట్లు చెప్పారు.
రైల్వే సీనియర్ అధికారులు, స్థానిక పరిపాలన అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్నం 2:35 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు.కాగా రైలుప్రమాదంలో మృతుల కుటుంబాలకు ₹ 10 లక్షల ఎక్స్...