Posted in

TGSRTC Special Buses | బతుకమ్మ, దసరా పండుగలకు 6304 ప్రత్యేక బస్సులు :

2025 Sankranti
TGSRTC New Buses
Spread the love

TGSRTC Special Buses | రాష్ట్రంలో సద్దుల బతుకమ్మ, దసరా పండుగల సంద‌ర్బంగా ప్రయాణిల ర‌ద్దీకి అనుగుణంగా పెద్ద సంఖ్య‌లో ప్ర‌త్యేక బ‌స్సుల‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన‌ట్లు టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్ల‌డించారు. మహాలక్ష్మీ పథకం కారణంగా గత ఏడాది దసరాతో పోలిస్తే ఈ సంవత్స‌రం ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో గత ఏడాదితో పోలిస్తే అదనంగా 600 ప్రత్యేక బస్సులను నడప‌నున్న‌ట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 6304 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తాయని తెలిపారు.

దసరా పండుగ ఆపరేషన్స్‌పై హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో పోలీసు, రవాణా శాఖ అధికారులతో టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ భేటీ అయ్యారు. దసరా సందర్భంగా ప్రత్యేక బస్సులు, రద్దీ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఆర్టీసీ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఎల్బీనగర్, ఆరాంఘర్, కూకట్ పల్లి, బోరబండ, గచ్చిబౌలి, జగద్గిరిగుట్ట, బోయిన్ పల్లి, సుచిత్ర, ఐఎస్ సదన్, శంషాబాద్ లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుందని సజ్జనార్ వెల్ల‌డించారు. ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను క‌ల్పిస్తున్నామనితె లిపారు. ప్రతి రద్దీ ప్రాంతాల వద్ద అధికారులను నియ‌మించాని చెప్పారు. ప్రయాణికుల రద్దీని బట్టి వారు అప్ప‌టిక‌ప్పుడు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తార‌ని తెలిపారు. ప్రయాణికులకు సమాచారం అందించేందుకు వ‌లంటీర్లనూ నియ‌మించామని సజ్జ‌నార్‌ తెలిపారు. ఐటీ కారిడార్ ఉద్యోగుల కోసం గ‌చ్చిబౌలి ఓఆర్ఆర్ మీదుగా విజ‌య‌వాడ‌, బెంగ‌ళూరు ప్రాంతాల‌కు ఆర్టీసీ బ‌స్సుల‌ను నడిపేలా ప్ర‌ణాళ‌క‌ల‌ను రూపొందించిన‌ట్లు సజ్జనార్‌ తెలిపారు.

ఈ ప్రాంతాల్లో అద‌న‌పు బ‌స్సులు

  • జేబీఎస్ నుంచి 1602,
  • ఎల్బీన‌గ‌ర్ నుంచి 1193,
  • ఉప్పల్ నుంచి 585,
  • ఆరాంఘ‌ర్ నుంచి 451

తిరుగు ప్రయాణం ర‌ద్దీ ఎక్కువ‌గా ఉండే ఈ నెల 13, 14వ తేదీల్లో కూడా ప్రత్యేక బ‌స్సులను అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని తెలిపారు. బతుకమ్మ, దసరా ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తుగా రిజర్వేషన్ కోసం టీజీఎస్ ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ http://tgsrtcbus.in ను సంప్ర‌దించాల‌ని కోరారు. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం 040-69440000, 040-23450033 టీఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లకు కాల్ చేయాల‌ని సూచించారు. అలాగే బ‌స్సుల ప్ర‌యాణ స్థితినిగుర్తించేందుకు గమ్యం ట్రాకింగ్ యాప్‌ను వినియోగించుకోవాలని చెప్పారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *