Saturday, March 15Thank you for visiting

ఘజియాబాద్ బాలిక ఆత్మహత్య.. అన్నయ్య డ్రగ్స్ మానేయాలని సుసైడ్ నోట్

Spread the love

ఉత్తరప్రదేవ్ రాష్ట్రం ఘజియాబాద్‌లోని తన ఇంట్లో 16 ఏళ్ల బాలిక సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చనిపోతూ తన అన్నయ్య డ్రగ్స్ తీసుకోవాడం మానేయాలని కోరుతూ సుసైడ్ నోట్ రాసింది.
ఈ హృదయవిదారక ఘటన ఘజియాబాద్ లో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామని అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏసీపీ) ఇందిరాపురం స్వతంత్ర కుమార్‌ సింగ్‌ తెలిపారు.
కాగా తన సూసైడ్ నోట్‌లో బాలిక తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, అయితే “నా సోదరుడు డ్రగ్స్ మానేయడానికి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను” అని రాసి ఉంది.
బాధితురాలి అన్నయ్య పోక్సో చట్టం కింద జైలులో ఉన్నారని పోలీసులు తెలిపారు.
గురువారం ఆమె తల్లి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, ఆమె తలుపు తట్టిందని, గది లోపల నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో, ఆమె ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించిందని పోలీసులు తెలిపారు. ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న బృందం తలుపు గొళ్లెం పగులగొట్టి గదిలోకి ప్రవేశించగా బాలిక ఉరివేసుకుని కనిపించిందని ఏసీపీ తెలిపారు. పోలీసులు ఆమెను ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబీకుల నుంచి ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఏసీపీ తెలిపారు.

READ MORE  వడ్డీ డబ్బుల కోసం దారుణం.. మహిళను వివస్త్రను చేసి..దాడికి పాల్పడి మూత్రం తాగించారు..

Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు,  జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి

అలాగే  న్యూస్  అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి   ట్విట్టర్, ఫేస్ బుక్  లోనూ సంప్రదించవచ్చు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

భూమిపై ఆశ్చర్యం కలిగించే.. అత్యంత భయంకరమైన 10 విష సర్పాలు.. Holi 2025 : రంగుల పండుగ హోలీ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా.. ?