Friday, September 12Thank you for visiting

CP Radhakrishnan Oath : దేశ 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం చేయించారు.. హాజ‌రైన‌ ధంఖర్

Spread the love

CP Radhakrishnan Oath : దేశ 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ నియమితులయ్యారు. సెప్టెంబర్ 12, శుక్రవారం నాడు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో ఈ కార్యక్రమం అట్ట‌మాసంగా జ‌రిగింది. దేశంలోని అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు.

దేశ 15వ ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో ద్రౌపది ముర్ము ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, హర్దీప్ సింగ్ పూరి, ధర్మేంద్ర ప్రధాన్ సహా పలువురు ప్రముఖ నాయకులు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధంఖర్ హాజరు కావడం ఈ కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. దీనితో పాటు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మహ్మద్ హమీద్ అన్సారీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *