Charlapalli railway station | ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న చర్లపల్లి రైల్వే స్టేషన్ కొత్త శాటిలైట్ టెర్మినల్ ప్రారంభానికి సిద్ధమైంది. రైల్వే శాఖమంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vishnav) శనివారం దీనిని ప్రారంభించనున్నారు. తెలంగాణలో నాలుగో అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా చర్లపల్లిరైల్వేష్టేషన్ అవతరించబోతోంది.
ఈ కొత్త టెర్మినల్ ప్రారంభమయ్యాక హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో రద్దీ తగ్గనుందని రైల్వే శాఖ అధికారులు పేర్కొంటున్నారు. రూ. 428 కోట్లతో ఈ స్టేషన్‌ను హైటెక్ హంగులతో తీర్చిదిద్దారు. ఐదు లిఫ్టులు, ఐదు ఎస్కులేటర్లు ఏర్పాట్లు చేశారు. మొత్తం 19 లైన్ల సామర్థ్యంతో 10 కొత్త లైన్లు ఉన్నాయి. ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా భవనం, అత్యంత ఆకర్షణీయంగా ముఖ్య ద్వారం నిర్మించారు. ఈ స్టేషన్ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ లో ఆరు టికెట్ బుకింగ్ కౌంటర్లు, మహిళలకు, పురుషులకు ప్రత్యేకంగా వెయిటింగ్ హాళ్లు, ఎగువ తరగతి వెయిటింగ్ హాల్, ఎగ్జిక్యూటివ్ లాంజ్, మొదటి అంతస్తులో కెఫెటేరియా, రెస్టారెంట్, స్త్రీలు, పురుషుల కోసం విశ్రాంతి గదులు ఉంటాయి. స్టేషన్ ముఖద్వారానికి అత్యాధునిక లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభానికి సిద్ధమైన నేపథ్యంలో.. రైల్వే బోర్డు పలు అనుమతులిచ్చింది. చర్లపల్లి స్టేషన్ నుంచి 6 ఎక్స్ ప్రెస్ రైళ్లును నడిపేందుకు గ్రీన్ సిగ్నల్ వొచ్చింది. మరో 12 రైళ్లు ఈ స్టేషన్‌లో ఆపేందుకు అనుమతిచ్చారు. దీన్ని ప్రారంభించిన తర్వాత ఇక్కడి నుంచి రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) అధికారులు సిద్ధమవుతున్నారు.
𝐂𝐡𝐚𝐫𝐥𝐚𝐩𝐚𝐥𝐥𝐢 𝐑𝐚𝐢𝐥𝐰𝐚𝐲 𝐒𝐭𝐚𝐭𝐢𝐨𝐧 𝐭𝐨 𝐛𝐞 𝐥𝐚𝐮𝐧𝐜𝐡𝐞𝐝 𝐬𝐨𝐨𝐧!
Being developed with a budget of Rs. 428 crores, the new satellite terminal will have facilities like large circulating area with adequate parking facilities, 5 lifts and 5 Escalators… pic.twitter.com/16Hs3F5jiz
— G Kishan Reddy (@kishanreddybjp) November 29, 2024
Charlapalli railway station అత్యాధునిక హంగులు, సకల వనతులు, రూ.428 కోట్లతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను నవబంర్ 30 న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించనున్నారు. దీంతో రేపటి నుంచే ఇది ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ రైల్వేస్టేషన్ మీదుగా ఇప్పటికే నడున్తున్న ర్లెళ్లకు తోడు.. మరో 25 జతల రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.. వాస్తవానికి ప్రధాని మోదీ దీన్ని ప్రారంభిస్తారని భావించగా.. ఇప్పుడు రైల్వే మంత్రి ప్రారంభిస్తారని అధికారులు చెబుతున్నారు.
చర్లపల్లి నుంచి నడిచే రైళ్ల జాబితా..
- గోరఖ్‌పూర్ – సికింద్రాబాద్ – గోరఖ్ పూర్ ఎక్స్‌ప్రెస్
- షాలిమార్ – హైదరాబాద్ ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్
- హైదరాబాద్ – ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ – హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్
- ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ – హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్
- హైదరాబాద్ – షాలిమార్ ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్‌లు చర్లపల్లి నుంచి రాకపోకలు సాగించనున్నాయి.
ఈ రైళ్లకు హాల్టింగ్..
- విజయవాడ – సికింద్రాబాద్ – విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్
- గుంటూరు – సికింద్రాబాద్ – గుంటూరు ఎక్స్‌ప్రెస్
- హైదరాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ – హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్
- సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ – సికింద్రాబాద్ భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్
- సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్
- గుంటూరు – సికింద్రాబాద్ – గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..