
Caste Census Report details | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణనపై హైదరాబాద్‌లోని సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ (Cabinet Sub-Committee) సమావేశం ఆదివారం జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీకి కులగణన నివేదికను ప్లానింగ్ కమిషన్ అధికారులు అందజేశారు. ఈసందర్భంగా మంత్రి ఉత్తమ్ రాష్ట్రంలో జరిగిన కుల గణన వివరాలు మీడియాకు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తగా 96.9 శాతం కులగణన సర్వే జరిగిందని, 3.1 శాతం మంది కులగణన సర్వేలో పాల్గొనలేదని తెలిపారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసమే సర్వే నిర్వహించామన్నారు. ఫిబ్రవరి 4వ తేదీన ఉదయం 10 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అదేరోజు కేబినెట్ ముందుకు కులగణన సర్వే నివేదిక తీసుకువస్తామని తెలిపారు. తెలంగాణలోని ఇంటింటా 96.9 శాతం సర్వే (Caste Census Report ) పూర్తి చేశారు. 3,54,77,554 వ్యక్తులను కలిసినట్లు నివేదికలో పేర్కొన్నారు. 76,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు 36 రోజుల్లోపు సమాచారాన్ని కంప్యూటరీకరించారని చేశారు.
Caste Census Report కులగణన రిపోర్టు ఇదీ..
తెలంగాణలో కులగణన సర్వే చేసిన జనాభా 3,54,77,554
మొత్తం కుటుంబాలు 1,12,15,134
- కుల గణన ప్రకారం ఎస్సీల జనాభా – 61,84,319.. (17.43 శాతం)
- ఎస్టీల జనాభా – 37,05,929.. (10.45 శాతం )
- బీసీల జనాభా – 1,64,09,179 (46.25 శాతం)
- ముస్లింల జనాభా- 44,57,012 (12.56 శాతం)
- బీసీ ముస్లింలు: 35,76,588 (10.08 శాతం)
- ఓసీ ముస్లింలు: 8,80,424 (2.48 శాతం)
- ఓసీల జనాభా- 44,21,115 (13.31 శాతం)
- మొత్తం ఓసీ జనాభా – 15.79 శాతం
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.