Saturday, August 30Thank you for visiting

Career

Career, Job News, Notificatons, SSC, Railway Jobs Govt Jobs Central Govt Jobs

Job Notifications, Job Alert

Govt Jobs | తెలంగాణలో వైద్యశాఖలో భారీగా పోస్టుల భర్తీ..  త్వరలో దరఖాస్తుల ప్ర‌క్రియ‌

Govt Jobs | తెలంగాణలో వైద్యశాఖలో భారీగా పోస్టుల భర్తీ.. త్వరలో దరఖాస్తుల ప్ర‌క్రియ‌

Career
Talangana Govt Jobs | హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బి) రాష్ట్రవ్యాప్తంగా 2,050 నర్సింగ్ ఉద్యోగాల భ‌ర్తీ కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రకటించింది. తెలంగాణలో నర్సింగ్ ఉద్యోగాల (Nursing Jobs) కోసం సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించ‌నున్నారు. అక్టోబర్ 16 నుంచి 17 వరకు దరఖాస్తులకు స‌వ‌ర‌ణ‌కు అవ‌కాశం ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నవంబర్ 17 న నిర్వ‌హించేలా షెడ్యూల్ చేశారు.పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్, తెలంగాణ వైద్య విధాన పరిషత్, ఆయుష్, MNJ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ, రీజనల్ క్యాన్సర్ సెంటర్‌తో సహా అనేక విభాగాలలో ఖాళీలు ఉన్నాయి. కాగా, తెలంగాణలో నర్సింగ్ ఉద్యోగాలకు వేతన స్కేలు రూ.36,750 నుంచి రూ.1,06,990గా ఉంది.అభ్య‌ర్థులు రాత పరీక్షకు 80 పాయింట్లు, రాష్ట్ర ప్రభ...
Railway jobs : నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. రైల్వేలో 8,113 పోస్టులతో నోటిఫికేష‌న్‌..

Railway jobs : నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. రైల్వేలో 8,113 పోస్టులతో నోటిఫికేష‌న్‌..

Career
Railway Jobs : రైల్వే ఉద్యోగాల కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న యువ‌త‌కు భార‌తీయ రైల్వే తీపిక‌బురు చెప్పింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (Railway Recruitment Board) తాజాగా జాబ్ నోటిఫికేషన్ ను జారీ చేసింది. దేశవ్యాప్తంగా 8,113 పోస్టుల భర్తీకి సంబంధించిన జాబ్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. పోస్టుల వివ‌రాలుగూడ్స్ ట్రైన్ మేనేజర్ 3,144 టికెట్ సూపర్ వైజర్ 1,736 టైపిస్ట్ 1,507 స్టేషన్ మాస్టర్ 994 సీనియర్ క్లర్క్ 732ఈ రైల్వే పోస్టులకు దరఖాస్తు చేసే అభ్య‌ర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 18 నుంచి 36 సంవ‌త్స‌రాల లోపు వయసు వారు దరఖాస్తు చేసుకోవాలి. సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 13 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు రైల్వే బోర్డు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. అలాగే అక్టోబర్ 16 నుంచి 25 వరకు దరఖాస్తుల సవరణకు RRB చాన్స్ ఇచ్చింది. ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాల ...
Model Schools | మోడల్‌ స్కూల్స్‌లో 2,757 మంది టీచర్లకు బ‌దిలీలు

Model Schools | మోడల్‌ స్కూల్స్‌లో 2,757 మంది టీచర్లకు బ‌దిలీలు

Career
Model Schools | తెలంగాణ‌లోని ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న సుమారు మూడు వేల మంది టీచర్ల చిరకాల క‌ల ఎట్ట‌కేల‌కు సాకార‌మైంది. బ‌దిలీల కోసం 11 సంవ‌త్స‌రాలుగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల వాంఛ ఫలించనుంది. మోడల్‌ స్కూళ్లలో ప్రిన్సిపాళ్లు, పీజీటీ, టీజీటీల బదిలీలకు సంబంధించి రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 89 మంది ఆదర్శ ప్రిన్సిపాళ్లు,, 1,923 మంది పీజీటీలు, 745 మంది టీజీటీలు మొత్తం 2,757 మందికి త్వరలో బ‌దిలీలు చేస్తూ మోడల్స్‌ స్కూల్స్‌ అదనపు డైరెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. 2013, 2014లో మోడల్‌ స్కూళ్లలోని ఉపాధ్యాయులు రెండు విడుతల్లో నియామ‌క‌మ‌య్యారు. అప్పటి నుంచి వీరికి ఒక్కసారి కూడా స్థాన‌చ‌ల‌నం క‌ల‌గ‌లేదు. దీంతో గత ట్రాన్స్‌ఫర్‌ చేయాలని చాలా కాలంగా వీరు డిమాండ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో గ‌త సంవత్స‌రం జూలైలో మోడ‌ల్ స్కూళ్ల టీచ‌ర్ల  (Model Schools Teachers )బ‌దిలీల‌కు షెడ్యూల్‌ జా...
Railway Jobs : రైల్వేలో 11,558 పోస్టుల‌కు నోటిఫికేష‌న్.. అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

Railway Jobs : రైల్వేలో 11,558 పోస్టుల‌కు నోటిఫికేష‌న్.. అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

Career
Railway Jobs | భారతీయ రైల్వేలో చేరాలనుకునే యువ‌త‌కు ఇదే సువర్ణావకాశం.. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ఇటీవ‌ల‌ భారీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రకటించింది. మొత్తం 11,558 ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇందులో పోస్ట్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు 8,113, అండర్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు 3,445 ఖాళీలు ఉన్నాయి. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ సంబంధించిన పూర్తి వివ‌రాలు ముఖ్యమైన తేదీలు, అర్హత ప్రమాణాలు మరియు దరఖాస్తు ప్రక్రియను తెలుసుకోండి. RRB NTPC రిక్రూట్‌మెంట్ 2024: ఖాళీల వివరాలు RRB NTPC Recruitment 2024: Vacancy Detailsజూనియర్ క్లర్క్-కమ్-టైపిస్ట్: 990 పోస్టులు అకౌంటెంట్‌ క్లర్క్-కమ్-టైపిస్ట్: 361 పోస్టులు రైలు క్లర్క్: 72 పోస్టులు కమర్షియల్-కమ్-టికెట్ క్లర్క్: 2022 పోస్ట్‌లు గూడ్స్ రైలు మేనేజర్: 3144 పోస్టులు చీఫ్ కమర్షియల్ క్లర్క్: 732 పోస్టులు జూనియర్ అకౌంట్ అసిస్...
SSC GD Constable 2025 Notification :, నిరుద్యోగులకు శుభవార్త.. 40వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

SSC GD Constable 2025 Notification :, నిరుద్యోగులకు శుభవార్త.. 40వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

Career
SSC GD Constable 2025 Notification Released: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ GD కానిస్టేబుల్ పోస్టుల కోసం నోటీసును విడుదల చేసింది. దీంతో లక్షలాది మంది అభ్యర్థుల నిరీక్షణకు తెరపడింది. దరఖాస్తులు కూడా ప్రారంభమయ్యాయి. ఇక దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి ఫారమ్‌ను పూరించవచ్చు. దీని కోసం అధికారిక వెబ్‌సైట్  – ssc.gov.in. ఇక్కడ నుండి మీరు నోటిఫికేషన్ చూడవచ్చు అలాగే ఈ రిక్రూట్‌మెంట్ల వివరాలను కూడా తెలుసుకోవచ్చు. 40వేల పోస్టుల భర్తీ ఈసారి 40 నుంచి 45 వేల పోస్టుల భర్తీకి అవకాశం ఉందని నోటీసులు విడుదల కాకముందే ఊహాగానాలు వెలువడ్డాయి.. అయితే, ఆలా జరగలేదు. ఈసారి SSC GD  ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 39,481 పోస్ట్‌లలో అర్హులైన అభ్యర్థులను నియమించనుంది. ఇదే చివరి తేదీ దరఖాస్తులు నిన్నటి నుండి అంటే సెప్టెంబర్ 5 నుండి ప్రారంభమయ్యాయి. SSC GD కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చ...
RRB NTPC Notification 2024 | నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. 11558 రైల్వే ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌..

RRB NTPC Notification 2024 | నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. 11558 రైల్వే ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌..

Career
RRB NTPC Notification 2024 | నిరుద్యోగుల‌కు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) శుభవార్త చెప్పింది. పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. RRB NTPC రిక్రూట్‌మెంట్ 2024 కోసం అధికారిక నోటిఫికేషన్ సెప్టెంబర్ 2న విడుదలైంది.గ్రాడ్యుయేట్ (లెవల్ 5, 6), అండర్ గ్రాడ్యుయేట్ (లెవల్ 2, 3) పోస్టులకు మొత్తం 11,558 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. గ్రాడ్యుయేట్-స్థాయి పోస్టులకు దరఖాస్తు ప్రక్రియకు గ‌డువు సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 13 వరకు, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20 వరకు ఉంటుంది.జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 990 పోస్టులు, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 361 పోస్టులు, ట్రైన్స్ క్లర్క్: 72 పోస్టులు, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 2022 పోస్టులు, గూడ్స్ ట్రైన్ మేనేజర్: 3144 పోస్టులు, జూనియస్ అకౌంట్ అసిస్టెంట్: 732 చీఫ్ కమర్షియల్ క్లర్క్ పోస్టులు: 1507 పోస...
Telangana | నిరుద్యోగులకు తెలంగాణ స‌ర్కారు గుడ్‌ న్యూస్.. 35 వేల ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన

Telangana | నిరుద్యోగులకు తెలంగాణ స‌ర్కారు గుడ్‌ న్యూస్.. 35 వేల ఉద్యోగాల భర్తీపై కీలక ప్రకటన

Career, Telangana
Rajiv Gandhi Abhaya Hastham : ఉద్యోగాల కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువ‌త‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే 35 వేల ఉద్యోగాలు భర్తీ చేయనున్న‌ట్లు ప్రకటించారు. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణులై.. మెయిన్స్ కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ అభ్యర్థులకు 'రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం' పథకం (Rajiv Gandhi Abhaya Hastham) కింద రూ.లక్ష చొప్పున చెక్కులను సీఎం సోమ‌వారం పంపిణీ చేశారు. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన 135 మందికి చెక్కులు స్వీక‌రించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటైన మూడు నెల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించామని గుర్తుచేశారు. సివిల్స్ ఉత్తీర్ణులై కుటుంబాల‌కు, రాష్ట్ర ప్ర‌భుత్వానికి గౌర‌వం తీసుకురావాల‌ని కోరారు. మెయిన్స్‌లో ఉత్తీర్ణ‌త సాధించి ఇంటర్వ్యూకి ఎంపికైన వారికి కూడా రూ.లక్ష ఆర్థిక సాయం అ...
SSC GD Constable Notification 2025 | నిరుద్యోగులకు అలెర్ట్..  రేపు SSC GD కానిస్టేబుల్ నోటిఫికేషన్‌ విడుదల

SSC GD Constable Notification 2025 | నిరుద్యోగులకు అలెర్ట్.. రేపు SSC GD కానిస్టేబుల్ నోటిఫికేషన్‌ విడుదల

Career
SSC GD Constable Notification 2025 | స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఆగస్ట్ 27, 2024న SSC GD కానిస్టేబుల్ నోటిఫికేషన్‌ను విడుదలచేయనుంది.  అభ్యర్థులు SSC GD కానిస్టేబుల్ దరఖాస్తు ఫారమ్‌ను ssc.gov.inలో నుంచి పొంద‌వ‌చ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), ఇండో టిబెటన్ బోర్డర్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులను ఆహ్వానిస్తుంది. అస్సాం రైఫిల్స్ (AR)లో పోలీస్ (ITBP), సశాస్త్ర సీమా బల్ (SSB), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF), రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ), NCBలో సైనికుల‌ పోస్టులు ఇందులో ఉంటాయి. SSC GD కానిస్టేబుల్ నోటిఫికేషన్‌లో ముఖ్యమైన తేదీలు, ఖాళీలు, దరఖాస్తు ఫారమ్, అర్హత ప్రమాణాలు, ఎంపిక ప్రక్రియ మరియు ఇతర సమాచారం వంటి వివరాలు ఉంటాయి. ...
Indian Railway Recruitment 2024 | 12,000 రైల్వే TTE పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ .. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి

Indian Railway Recruitment 2024 | 12,000 రైల్వే TTE పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ .. ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోండి

Career
Indian Railway Recruitment 2024 | భారతీయ రైల్వేల్లో ట్రావెలింగ్ టిక్కెట్ ఎగ్జామినర్‌లుగా (TTE) పని చేయాలనుకునేవారికి ఇదే సువ‌ర్ణావ‌కాశం. నిరుద్యోగ యువ‌త కోసం ఇండియ‌న్ రైల్వే ఏకంగా 12,000 టిటిఈ పోస్టు(TTE Vacancies) లను భ‌ర్తీ చేసేందుకు నోటిఫికేష‌న్ జారీ చేసంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ఈ సంవత్సరం మూడవ త్రైమాసికంలో అధికారిక రైల్వే TTE రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ ని విడుదల చేస్తుంది. ఇందులో భాగంగా సుమారు 12,000 ఖాళీలను భ‌ర్తీ చేయ‌నుంది. ఇండియన్ రైల్వే రిక్రూట్‌మెంట్ 2024 ముఖ్య వివరాలు:అర్హత ప్రమాణాలు:వయోపరిమితి: జనవరి 1, 2024 నాటికి 18 నుంచి 30 సంవత్సరాలు. విద్యార్హత: అభ్యర్థులు కనీసం 10 లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. డిప్లొమా హోల్డర్లు కూడా అర్హులు. అవసరమైన పత్రాలు:జనన ధ్రువీకరణ పత్రం 12వ తరగతి పాస్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు ఎక్స‌ట్రా క‌రిక్యుల‌ర...
DSC Recruitment 2024 | సెప్టెంబర్‌ నుంచి డీఎస్సీ నియామక ప్రక్రియ

DSC Recruitment 2024 | సెప్టెంబర్‌ నుంచి డీఎస్సీ నియామక ప్రక్రియ

Career
DSC Recruitment 2024 | తెలంగాణ‌లో సెప్టెంబర్‌ ఆఖరి వారం నుంచి ఉపాధ్యాయ నియామక ప్రక్రియను ప్రారంభించాల‌ని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందు కోసం కసరత్తు కూడా మొద‌టుపెట్టింది. ఇప్పటికే ప్రాథమిక కీ విడుదల చేసింది. దీనిపై వచ్చే అభ్యంతరాలను పరిశీలించి ఈ నెలాఖరు వ‌ర‌కు తుది కీ విడుదల చేయ‌నునుంది. మరోవైపు జిల్లాల వారీగా వివిధ కేటగిరీ పోస్టుల విభజన, డీఎస్సీ పరీక్ష రాసిన అభ్య‌ర్థుల వివ‌రాలు, రోస్టర్‌ విధానంపై విశ్లేషిస్తున్నారు. పరీక్ష ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించిన కార‌ణంగా ఫలితాలను వేగంగా వెల్లడించే వీలుందని అధికారులు చెబుతున్నారు.రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఇటీవల పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 3,29,897 మంది దరఖాస్తు చేస్తే, 2,79,957 మంది పరీక్ష రాశారు. త్వ‌ర‌లో ఫైనల్‌ కీ విడుదల చేయ‌నున్నారు. మ‌రుస‌టి రోజు ఫలితాలను వెల్ల‌డించే అవ‌కాశం ఉంది.రోస్టర్‌ విధానం, జిల్లాల వారీగా పో...