Posted in

తిరుపతి-కాట్పాడి డబ్లింగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌.. రూ.1,332 కోట్ల ప్రాజెక్టు ప్రారంభం – Cabinet Decision

Cabinet Decision
Spread the love

Cabinet Decision : కేంద్ర మంత్రివర్గ సమావేశం ప‌లు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న తిరుపతి (ఏపీ)- కాట్పాడి (త‌మిళ‌నాడు) లైన్ డబ్లింగ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. తిరుపతి నుంచి కాట్పాడి వరకు డబ్లింగ్ పనులకు రూ.1,332 కోట్ల వ్యయంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆమోదం పొందిన తిరుపతి (Tirupati)-కాట్పాడి (Tamil Nadu) లైన్ డబ్లింగ్‌ ప్రాజెక్టు ద్వారా చిత్తూరు, తిరుపతి, వెల్లూరు జిల్లాలు ప్రయోజనం పొందుతాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు.

Cabinet Decision :17 భారీ వంతెనలు

ఈ ప్రాజెక్టులో 17 మేజ‌ర్ వంతెనలు, 327 చిన్న వంతెనలు రానున్నాయని పేర్కొన్నారు. అలాగే ఏడు ఫ్లైఓవర్లు (Over Bridges), 30 అండర్ పాస్ వంతెనలు నిర్మించనున్నామని తెలిపారు. 104 కి.మీ రోడ్డు మార్గానికి బదులుగా, ట్రాఫిక్‌ను రైల్వే మార్గానికి మళ్లిస్తామని.. తద్వారా 20 కోట్ల కిలోల కార్బన్‌డయాక్సైడ్‌ విడుదల కావడం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా 4 కోట్ల లీటర్ల డీజిల్‌ ఆదా అవుతుందని తద్వారా గణనీయంగా కాలుష్యం తగ్గుతుందని కేంద్రమంత్రి వెల్లడించారు.

Indian Railways : ఆధ్యాత్మిక పర్యాటకానికి ఊతం

ఈ కొత్త ప్రాజెక్టు ద్వారా తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరికోట క్షేత్రాలకు భారీగా భక్తులు తరలివస్తారని కేంద్ర మంత్రి అశ్వినివైష్ణవ్ తెలిపారు. తిరుపతి, వెల్లూరు (Velluru) ప్రాంతాల్లో వైద్య సంస్థలు ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతానికి లబ్ది చేకూరనుందని తెలిపారు.ఈ ప్రాజెక్ట్ ద్వారా రాయలసీమ రీజియన్‌కు సైతం ఉపయోగపడుతుందని, అలాగే ఎలక్ట్రానిక్స్‌, సిమెంట్‌, స్టీల్‌ తయారీ కంపెనీలకు కూడా భారీగా ప్రయోజనం పొందుతాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *