CAA Rules |పౌరసత్వ సవరణ చట్టం అంటే ఏమిటీ? కేంద్రం గెజిట్‌లో ఏముంది?
What is CAA : ఊహించినట్లుగానే, 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు, పౌరసత్వ (సవరణ) చట్టం ( CAA ) 2019 అమలుకు సంబంధించిన నిబంధనలను కేంద్రం సోమవారం నోటిఫై చేసింది. పౌరసత్వ సవరణ చట్టం (Citizenship (Amendment) Act) మార్చి 11 2024 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్రం సంచలన ప్రకటన చేసింది. సీఏఏ అమలుతో బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం లభించనుంది. డిసెంబర్ 31, 2014 కంటే ముందు భారతదేశానికి వచ్చిన వలసదారులందరికీ ఈ చట్టం వర్తింజేయునున్నారు. .
అయితే, 1955 నాటి చట్టంలో సవరణలు చేసిన మోదీ ప్రభుత్వం.. 2019 డిసెంబర్‌లో పార్లమెంట్‌లో ఈ బిల్లును ప్రవేశపెట్టగా ఆమోదం లభించింది. 2020లోనే దీన్ని అమలు చేయాలని చూసినప్పటికీ పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. మరోవైపు కరోనా మహమ్మారి విజృంభనతో అప్పుడు సాద్యం కాలేదు. అయితే దాదాపు ఐదేళ్ల తరవాత ఈ చట్టం అమల్లోకి తీసుకొస్తున్నట్టు కేంద్ర హోం శాఖ గెజిట్ ను విడుదల చేసింది. మరికొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న కీలక తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.
CAA అంటే ఏమిటి?
పౌరసత్వ సవరణ చట్టం (CAA) మతపరమైన హింస కారణంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతదేశానికి వచ్చి ఆశ్రయం పొందిన ముస్లిమేతర రక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. శరణార్థులకు ఎలాంటి పత్రాలు లేకుండానే పౌరసత్వం మంజూరు చేయడానికి వీలు కలుగుతుంది. CAA నిబంధనలను అనుసరించి, పైన పేర్కొన్న దేశాల నుండి డిసెంబరు 31, 2014 వరకు భారతదేశానికి వచ్చిన ముస్లిమేతర వలసదారులకు ఇప్పుడు మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం భారత పౌరసత్వాన్ని మంజూరు చేయడం ప్రారంభిస్తుంది. వీరిలో క్రైస్తవులు, పార్సీలు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, హిందువులు ఉన్నారు.
CAA Rules ?
CAA Rules : దరఖాస్తుదారులు తప్పనిసరిగా డిసెంబర్ 31, 2014న లేదా అంతకు ముందు భారతదేశంలోకి ప్రవేశించి ఉండాలి. ప్రస్తుతం, భారతదేశంలో జన్మించిన లేదా కనీసం 11 సంవత్సరాలు దేశంలో నివసించిన వారికి భారత పౌరసత్వం మంజూరు చేస్తారు. ప్రతిపాదిత సవరణలో OCI కార్డ్ హోల్డర్ పౌరసత్వ చట్టం లేదా ఏదైనా ఇతర వర్తించే చట్టాన్ని ఉల్లంఘిస్తే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసే నిబంధన కూడా ఉంది.
వలసదారులు పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు?
మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లో ఉంటుంది. కాబట్టి, దరఖాస్తుదారుల సౌలభ్యం కోసం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక పోర్టల్‌ను సిద్ధం చేసింది. సరైన డాక్యుమెంటేషన్ లేకుండా దరఖాస్తుదారులు భారతదేశంలోకి ప్రవేశించిన సంవత్సరాన్ని తప్పనిసరిగా బహిర్గతం చేయాలి.
దీనిపై ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి..
డిసెంబర్ 2019లో ఆమోదించబడిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం (CAA) దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. చాలా ప్రతిపక్షాలు ఈ చట్టం “వివక్షపూరితమైనదని పేర్కొన్నాయి. కేరళలో ముఖ్యమంత్రి విజయన్ రాష్ట్రంలో CAAని అమలు చేయబోమని ప్రకటించారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..