Tuesday, April 8Welcome to Vandebhaarath

Mallikarjun Kharge | రాహుల్ గాంధీని బ‌హిష్క‌రిచ‌కుంటే.. ఖర్గే కూడా గాంధీకుటుంబానికి కీలుబొమ్మే.. : బీజేపీ

Spread the love

Mallikarjun Kharge : కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) నేత సి.నారాయణ స్వామి తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. శనివారం (సెప్టెంబర్ 14, 2024) రాహుల్ గాంధీని తక్షణమే పార్టీ నుంచి బహిష్కరించకపోతే గాంధీ కుటుంబానికి ఖ‌ర్గే కాపలాదారు అని రుజువవుతుందని వ్యంగ్యంగా అన్నారు.

కాంగ్రెస్ చీఫ్‌పై సి నారాయణ స్వామి చేసిన ఈ వ్యాఖ్య రాహుల్ గాంధీని కార్నర్ చేసే విధంగా ఉన్నాయి. ఇటీవ‌ల అమెరికాలో రాహుల్‌ చేసిన వివాదాస్పద ప్రకటనలపై బీజెపి నేత‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రిజర్వేషన్లపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఆయ‌న‌ మాట్లాడుతూ, “రాహుల్ గాంధీ ప్రకటనతో మాకు కోపం వచ్చింది. కొన్నిసార్లు అతను భీమ్‌రావ్ అంబేద్కర్‌ను ద్వేషిస్తాడు. కొన్నిసార్లు అతను రాజ్యాంగంతో తిరుగుతాడు. .

READ MORE  Wayanad : వాయనాడ్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ: పార్టీని వీడిన జిల్లా ప్రధాన కార్యదర్శి

రిజర్వేషన్లను ఎలా అంతం చేస్తారు?

“రాహుల్ గాంధీ అప్పుడప్పుడు రిజర్వేషన్‌ను అంతం చేస్తానని చెబుతారు. మీరు రిజర్వేషన్లను ఎలా అంతం చేస్తారు? మీకు అంత అధికారం ఉందా? నేను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) ను డిమాండ్ చేస్తున్నాను, అతను రాహుల్‌పై చర్య తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. లేకుంటే ఖ‌ర్గే గాంధీ కుటుంబానికి కాపలాదారుగా భావించాల్సి వ‌స్తుంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. . కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబానికి చెంద‌ని ఎవరైనా అధ్యక్షుడిగా లేదా సీనియర్ నేత‌లు (మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో సహా), కాంగ్రెస్, గాంధీ కుటుంబానికి కీలుబొమ్మగా వుంటార‌ని ఆరోపించారు. .

READ MORE  Cabinet Meet | తెలంగాణ కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు..

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై దుమారం..

నిజానికి, రాహుల్ గాంధీ అమెరికా పర్యటనపై వివాదం చెలరేగింది, అక్కడ ఆయన చేసిన కొన్ని వ్యాఖ్య‌ల‌పై బిజెపి ఆగ్ర‌హంగా ఉంది. భారత్‌పై దుష్ప్రచారం చేసే కొంతమంది వ్యక్తులను ఆయన అమెరికాలో కలిశారని ఆరోపణలు వచ్చాయి. అమెరికాలో రాహుల్ గాంధీ చేసిన కొన్ని ప్రకటనలపై బీజేపీ నేతలు ఆయ‌న‌ను తీవ్రంగా విమర్శించారు. ముఖ్యంగా రిజర్వేషన్లకు సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కాంగ్రెస్‌, రాహుల్‌ గాంధీలను చాలా ఇరుకున పెట్టింది. భారతదేశంలో సామాజిక వివక్ష అంతమైతే, రిజర్వేషన్‌ను అంతమొందించే అంశాన్ని పరిశీలిస్తామని రాహుల్ గాంధీ అన్నారు. అయితే ఆ తర్వాత ఆయన ప్రకటనపై స్పష్టత వచ్చింది.

READ MORE  వందే భారత్ మెట్రో రైలు ట్రయల్ రన్‌ విజయవంతం

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *