Bulldozer action | ఉత్తరప్రదేశ్ విద్యుత్ శాఖ, పోలీసులు సంభాల్ (Sambhal) లో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. పట్టణంలో కొంతమంది నివాసితు రోడ్లను విద్యుత్ స్థంభాలను కూడా ఆక్రమించేసుకున్నారు అని పట్టణ సబ్ డివిజనల్ అధికారి సంతోష్ త్రిపాఠి (SDO) తెలిపారు. “కొందరు విద్యుత్ కనెక్షన్, సరైన మీటర్ లేకుండా విద్యుత్ చౌర్యానికి పాల్పడ్డారు. లోపల ఇంకా పాత మెకానికల్ కరెంట్ మీటర్ ఉంది. పాత మీటర్లను 15 సంవత్సరాల క్రితం నిలిపివేశాం. అందుకే ఆక్రమణను తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నాము” అని బుల్డోజర్ చర్య సందర్భంగా త్రిపాఠి ANIకి తెలిపారు.
“మెకానికల్ మీటర్లను ఇకపై అమర్చకూడదని 15 సంవత్సరాల క్రితం ఆదేశాలు వచ్చాయి. పాత మీటర్లు ఎక్కడ కనిపించినా దానిని అధికారులు వెంటనే తొలగిస్తారని తెలిపారు. సంభల్ లో దాదాపు 2-3 ఇళ్లలో విద్యుత్‌ను దొంగిలించడం కనిపించిందని, అయితే మొత్తం ఇళ్ల సంఖ్య విచారణ తర్వాత తెలుస్తుందని SDO చెప్పారు.
కాగా, మొఘల్ కాలం నాటి మసీదులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) పరిశీలన సందర్భంగా నవంబర్ 24న సంభాల్‌లో హింస చెలరేగింది, దీని ఫలితంగా నలుగురు మృతి చెందారు. పోలీసు సిబ్బంది స్థానికులు అనేక మంది గాయపడ్డారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..