Saturday, April 19Welcome to Vandebhaarath

Chhatarpur Bulldozer Action | ఛతర్‌పూర్ పోలీసులపై రాళ్లతో దాడి చేసిన ప్రధాన నిందితుడి ఇంటిపై బుల్డోజర్ యాక్షన్

Spread the love

Chhatarpur Bulldozer Action | భోపాల్: మహ్మద్ ప్రవక్త ఇస్లాం గురించి అభ్యంతరకరమైన ప్రకటనలు చేసినందుకు నిర‌స‌న‌గా ఆందోళ‌న‌కారులు మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ ( జిల్లాలో ఒక పోలీసు స్టేషన్‌పై దాడి చేయ‌గా అనేక మంది పోలీసు సిబ్బంది ఒక మహిళా జర్నలిస్ట్ గాయపడ్డారు. దీంతో నిర‌స‌న‌కు నాయ‌క‌త్వం వ‌హించిన నిందితుడి ఇఒంటిని గురువారం అధికారులు బుల్డోజర్ (Bulldozer Action ) చేశారు.

ఛతర్‌పూర్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో హింసకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఛతర్‌పూర్ జిల్లా -పోలీసులకు సూచించిన కొద్ది గంటలకే వారు రంగంలోకి దిగారు. ప్రధాన నిందితులలో ఒకరైన హాజీ షాజాద్ అలీ నిర్మించిన రాజభవన గృహాన్ని బుల్డోజర్ తో కూల్చివేశారు. భోపాల్ నుంచి 342 కిమీ దూరంలో ఉన్న‌ ఛతర్‌పూర్‌లో నిందితుడు అనుమతి లేకుండా భారీ ఇంటిని నిర్మించాడు.

READ MORE  Demolition Drive | రూ.400 కోట్ల విలువైన ఫామ్‌ హౌజ్ ను బుల్డోజర్ తో నేలమట్టం    

అస‌లేం జ‌రిగింది.

ఛతర్‌పూర్ జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ సదర్ (ముస్లిం అగ్రనేత) హాజీ షాజాద్ అలీ బుధవారం మధ్యాహ్నం ఛతర్‌పూర్ కొత్వాలి పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన ఆందోళ‌న‌కారుల‌కు నాయకత్వం వహించిన ముఖ్య వ్యక్తులలో ఉన్నారు. ఛతర్‌పూర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ అగం జైన్ ప్రకారం, భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ల కింద 46 మంది నిందితులు, 100-150 మంది గుర్తుతెలియని నిందితులపై కేసు నమోదు చేశారు.
బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఛతర్‌పూర్‌లోని ముస్లింలు రాళ్లదాడికి పాల్పడ్డారు, కొన్ని వాహనాలను ధ్వంసం చేశారు. ఇద్దరు పోలీసు అధికారులు గాయపడ్డారు. రామగిరి మహరాజ్ గత వారం ప్రవక్త మొహమ్మద్, ఇస్లాంను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ముస్లింల మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు రామగిరి మహారాజ్‌పై పలువురు ఇస్లామిక్ నాయకులు, సంస్థలు కేసులు నమోదు చేశాయి.

READ MORE  మహిళ ఘాతుకం.. నిద్రపోనివ్వకుండా ఏడ్చినందుకు రెండేళ్ల గొంతుకోసి చంపిన అత్త

Chhatarpur Bulldozer Action : మత పెద్దలు సయ్యద్ హాజీ అలీ, జావేద్ అలీ నేతృత్వంలో దాదాపు 300-400 మంది ఆగస్ట్ 21వ తేదీ బుధవారం మెమోరాండం సమర్పించేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చారని ఛతర్‌పూర్ డీఐజీ లలిత్ షాక్యవార్ తెలిపారు. మహారాష్ట్రలో ఇప్పటికే పలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదైన రామగిరి మహారాజ్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు .ఈ క్ర‌మంలోనే గుంపు అకస్మాత్తుగా దూకుడుగా మారి రాళ్లు రువ్వడం ప్రారంభించిందని, ఇది సుమారు పది నిమిషాల పాటు కొనసాగిందని, ఆ తర్వాత ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించాల్సి వచ్చిందని షాక్యవార్ చెప్పారు. రాళ్లదాడి కారణంగా కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అరవింద్ కుజుర్ చేతికి, తలకు తీవ్ర గాయాలయ్యాయని డీఐజీ తెలిపారు. అతను చికిత్స పొందుతున్నాడు. కానిస్టేబుల్ భూపేంద్ర ప్రజాపతికి కూడా గాయాలయ్యాయి.

READ MORE  తెలంగాణ: భువనగిరి ప్రభుత్వాసుపత్రిలో దారుణం.. మృతదేహాన్ని కొరికి తిన్న ఎలుకలు

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *