BSNL Broadband | బీఎస్‌ఎన్‌ఎల్ తన వినియోగదారుల కోసం మరొక చవకైన ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో వినియోగదారులు ఏకంగా 5000 GB డేటా అందుకోవచ్చు. ఈ బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్‌లో 200Mbps వేగంతో ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చు. గత కొన్ని రోజులక్రితం ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ టారీఫ్ ప్లాన్ల ధరలు పెంచడంతో అందరూ ఇప్పుడు బిఎస్ఎస్ఎల్ వైపు మళ్లుతున్నారు. ఇదే సమయంలో బిఎస్ఎన్ఎల్ మొబైల్‌తో పాటు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లకు గట్టి పోటీనిచ్చేలా అతితక్కువ ధరలోనే రీచార్జి ప్లాన్లను తీసుకువస్తోంది.
తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ వినియోగదారుల కోసం చౌకైన ప్లాన్‌ను ప్రారంభించింది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ గురించి తెలుసుకోండి…
BSNL భారత్ ఫైబర్ ప్లాన్:
BSNL Broadband భారత్ ఫైబర్ ప్లాన్ ధర నెలకు రూ. 999. ఈ ప్లాన్‌లో వినియోగదారుకు నెల రోజుల్లో 5000 GB ఇంటర్నెట్ డేటా అందుకోవచ్చు. ఈ ప్లాన్‌లో ఇంటర్నెట్ 200 Mbps వేగంతో వస్తుంది. డేటా అయిపోయిన తర్వాత వినియోగదారులు 10 Mbps స్పీడ్ తో అపరిమితమైన డేటాను పొందుతారు. ఇంకా ఈ ప్లాన్ ప్రత్యేకత ఏమిటంటే, బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ప్లాన్‌తో ఎటువంటి ఇన్‌స్టాలేషన్ ఛార్జీని వసూలు చేయడం లేదు. అంటే, మీరు ఇంట్లో ఉచితంగా ఇంటర్నెట్ వ్యవస్థను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
ఓటీటీ యాప్స్
బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ తో అనేక OTT యాప్‌లకు ఉచిత సభ్యత్వాన్ని కూడా అందిస్తోంది. వినియోగదారులు DisneyPlus Hotstar, Sony LIV, Zee5, Hungama, YuppTV వంటి OTT ప్లాట్‌ఫారమ్‌ల ఉచిత సబ్ స్క్రిప్షన్ అందుకుంటారు. అంతేకాకుండా ఈ ప్లాన్‌లో వినియోగదారులకు దేశవ్యాప్తంగా ఏ నంబర్‌కైనా ఉచితంగా అపరిమిత కాల్స్ కూడా చేసుకోవచ్చు.
ఈ ఆఫర్ ఎలా తీసుకోవాలి ?
బీఎస్‌ఎన్‌ఎల్ తన అధికారిక X హ్యాండిల్ నుండి ఈ ప్లాన్ గురించి సమాచారాన్నివెల్లడించింది. వినియోగదారులు తమ నంబర్ నుండి 18004444లో బీఎస్‌ఎన్‌ఎల్ కు వాట్సప్‌లో హాయ్ అని మెసేజ్ చేయడం ద్వారా ఈ ప్లాన్‌ను తీసుకోవచ్చు. మరో విధంగా వినియోగదారులు X పోస్ట్‌లో ఇచ్చిన QR కోడ్‌ను స్కాన్ చేసి ఈ ప్లాన్‌ను పొందవచ్చు. ఈ ప్లాన్‌ను పొందేందుకు వినియోగదారులు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో లేదా మీ సమీపంలోని టెలిఫోన్ ఎక్స్ఛేంజ్‌ను సంప్రదించాలి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..