BSNL Bharat Fibre | జియో, ఎయిర్‌టెల్, BSNL భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లలో ఏది బెస్ట్..?
BSNL Bharat Fibre | దేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిపోయింది. నగరాలు, పట్టణాలే కాకుండా మారుమూల గ్రామాలకు కూడా బ్రాడ్‌బ్యాండ్ సేవలు విస్తరించాయి. భారతదేశంలో బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీలో ఎయిర్‌టెల్, జియో ముందున్నాయి. అయితే ఇటీవలి కాలంలో ప్రభుత్వ యాజమాన్యంలోని BSNL కు చెందిన భారత్ ఫైబర్ ఈ ప్రైవేట్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తోంది. వినియోగదారులకు తక్కువ ధరలోనే అనేక బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను అందిస్తోంది.
మీరు కొత్త బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ కోసం వెతుకుతున్నారా? రూ. 500లోపు ఏ కంపెనీ సరసమైన ఇంటర్నెట్ సేవను అందిస్తారో తెలుసుకోవాలనుకుంటున్నారా? మేము మీ డబ్బును ఆదా చేసే ప్లాన్లపై గురించి తెలుసుకునేందుకు Jio Fibre, Airtel Xstream Fibre, BSNL భారత్ ఫైబర్ ప్లాన్లను పోల్చిచూద్దాం..
BSNL భారత్ ఫైబర్ రూ. 399 ప్రీపెయిడ్ ప్లాన్
- ఈ ప్లాన్ ధర రూ.399
- ప్లాన్ ఒక నెల వరకు చెల్లుబాటు అవుతుంది
- ఇది 1400GB వరకు 30Mbps వేగం, ఆ తర్వాత 4Mbps స్పీడ్ ఉంటుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు అపరిమిత కాలింగ్‌ను కూడా పొందవచ్చు.
జియో ఫైబర్ రూ. 399 ప్రీపెయిడ్ ప్లాన్
- ఈ ప్లాన్ ధర రూ.399
- ప్లాన్ ఒక నెల వరకు చెల్లుబాటు అవుతుంది
- ఇది ఉచిత వాయిస్ కాలింగ్‌తో పాటు 30Mbps వేగాన్ని 3300 GB వరకు అందిస్తుంది
ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ రూ. 499 ప్రీపెయిడ్ ప్లాన్
- ఈ ప్లాన్ ధర రూ. 499
- ప్లాన్ ఒక నెల వరకు చెల్లుబాటు అవుతుంది
- ఇది 40Mbps వేగాన్ని అందిస్తుంది
Jio Fibre, Airtel Xtream Fibre, BSNL భారత్ ఫైబర్- రూ. 500లోపు ఉత్తమ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ఏది?
BSNL Bharat Fibre, Jio, Airtel నుంచి రూ. 500 లోపు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను పోల్చినప్పుడు, BSNL భారత్ ఫైబర్, Jio ఫైబర్ ప్లాన్‌లు రెండింటి ధరలు రూ.399 లోపు ఉన్నాయి. అయితే Jio Fiber 3300GB డేటాను అందిస్తుంది. కాబట్టి మీ డబ్బుకు ఉత్తమమైన విలువను ఇది అందిస్తుంది. అలాగే రూ.500లోపు ఎయిర్‌టెల్ గరిష్టంగా 40Mbps వేగాన్ని అందిస్తోంది, Jio ఫైబర్, Airtel Xstream ఫైబర్‌లతో పోలిస్తే దాని ప్లాన్ ధర రూ.100 ఎక్కువగా ఉంది.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..