BRS Manifesto | బీఆర్​ఎస్​ మేనిఫెస్టో ప్రకటించిన కేసీఆర్​

BRS Manifesto |  బీఆర్​ఎస్​ మేనిఫెస్టో ప్రకటించిన కేసీఆర్​

BRS Manifesto : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ మేనిఫెస్టో ను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు. హైదరాబాద్‌ లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేసిన అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ… గతంలో మేనిఫెస్టో లో చెప్పని ఎన్నో అంశాలను అమలు చేశామన్నారు.. ఎన్నిలక ప్రణాళిక లో లేనివాటిని అమలు చేసిన ఘనత తమకే దక్కుతుందని తెలిపారు. దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తామని, గిరిజనులకు ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందని.. భవిష్యత్తులో వారి కోసం మరిన్ని పథకాలు తీసుకొచ్చామని చెప్పారు. మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేశామని, బడ్జెట్‌ను పెంచినట్టుగా కేసీఆర్ చెప్పారు. బీసీలకు అమలు చేస్తున్న పథకాలు కొనసాగిస్తామని తెలిపారు.

బీఆర్ఎస్ మేనిఫెస్టో వివరాలు ఇవీ..

రైతుబంధు 16 వేలకు పెంపు

తెలంగాణ వ్యాప్తంగా మొదటి ఏడాది రూ.12వేలకు పెంచుతామని కేసీఆర్ ప్రకటించారు. తర్వాత ప్రతీ సంవత్సరం విడతలవారీగా రూ.16వేలకు పెంచుతామని ప్రకటించారు.

దివ్యాంగుల పెన్షన్లు రూ.6వేలకు పెంపు

రాష్ట్రంలో దివ్యాంగులకు 4016 పెన్షన్‌ ను ఇటీవలే పెంచుకున్నామని, దానిని రూ.6వేలకు తీసుకెళ్తామన్నారు. మార్చి తర్వాత రూ.5వేలు చేసి.. ఆతర్వాత ప్రతి సంవత్సరం రూ.300కి పెంచుతూ చివరకు రూ.6 వేలకు తీసుకెళ్తామన్నారు.

ఆసరా పెన్షన్లు రూ.5వేలకు పెంపు : సీఎం కేసీఆర్‌

పదులు, వందల్లో ఉన్న పింఛన్లు ఉన్న స్కీంను వెయ్యిల్లోకి తీసుకెళ్లిన మొట్టమొదటి ఏకైక ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని సీఎం కేసీఆర్‌ అన్నారు. రూ.1000తో మొదలుపెట్టి.. ఆర్థిక సౌష్టవం పెరిగిన తర్వాత.. రూ.2016 వరకు పెంచుకున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పెరుగుతున్న కొద్దీ పెన్షన్లను కూడా పెంచుకుంటూ పోయాం. ఇప్పుడు రూ.5 వేలకు పెంచాలని నిర్ణయించాం. ఈ రూ. 5వేలను వెంటనే ఇవ్వం. వచ్చే మార్చి తర్వాత పెన్షన్‌ను రూ.3వేలు చేస్తాం. ఇక ప్రతీ సంవత్సరం రూ.500 పెంచుతూ ఐదో సంవత్సరం పూర్తయ్యే నాటికి రూ.5వేలకు తీసుకెళ్తాం. దీనివల్ల ప్రభుత్వంపై ఒక్కసారిగా భారం పడదు.

READ MORE  జూన్ 20న జగన్నాథ రథయాత్ర

తెలంగాణ అన్న‌పూర్ణ ప‌థ‌కం కింద ప్ర‌తి రేష‌న్ కార్డు హోల్డ‌ర్‌కు స‌న్న‌బియ్యం

రాష్ట్రంలో మరో కొత్త స్కీమ్ కు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం హాస్ట‌ల్స్‌లో పిల్ల‌ల‌కు స‌న్న‌బియ్యం, అంగ‌న్‌వాడీలో కూడా అందిస్తున్నామని కేసీఆర్ అన్నారు. ‘అన్న‌పూర్ణ‌గా త‌యారైన తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌తీ కుటుంబానికి కూడా స‌న్న‌బియ్యం ఇవ్వాల‌ని నిర్ణ‌యించాం. ప్రతీ రేష‌న్ కార్డుదారుడికి వ‌చ్చే ఏప్రిల్, మే నుంచి స‌న్న‌బియ్యం ఇస్తాము. ఇక దొడ్డు బియ్యం బాధ ఉండ‌దు. ఈ పథకానికి ‘తెలంగాణ అన్న‌పూర్ణ’ అని పేరు పెడుతున్నాం. ప్ర‌భుత్వంలోకి రాగానే అమలు చేస్తాం.’ అని తెలిపారు.

రైతుబీమా తరహాలో ప్రజలందరికీ ఉచిత బీమా

తెలంగాణ రాష్ట్రంలోని సుమారు 1.10 లక్షల కుటుంబాలకు 93లక్షల పైగా రేషన్‌ కార్డులు ఇచ్చాం. వందకు వంద శాతం ప్రీమియం చెల్లించి రైతుబీమా తరహాలో అన్ని కుటుంబాలు అన్నింటికీ ‘కేసీఆర్‌ బీమా- ప్రతీ ఇంటికీ ధీమా’ అనే పద్ధతిలో బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయించాం. ఎల్‌ఐసీ ద్వారానే ఈ బీమా కల్పించనున్నామని తెలిపారు. 93 లక్షల కుటుంబాలకు ఈ బీమా కల్పించేందుకు ఒక్కో కుటుంబానికి రూ.3600 నుంచి రూ.4వేలు ఖర్చవుతుంది. అయినా సరే దీన్ని అమలుచేయాలని పార్టీ నిర్ణయించింది. ప్రభుత్వం వచ్చిన తెల్లారి నుంచి నాలుగైదు నెలల్లో దీన్ని అమలు చేస్తాం. జూన్‌ నెల నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది.’ అని తెలిపారు.

READ MORE  Lok Sabha Elections: వరంగల్ లోక్ సభ బరిలో కడియం కావ్య..

ఆరోగ్య శ్రీ కవరేజ్ రూ.15 లక్షలకు పెంపు

ఆరోగ్య శ్రీ పరిధిని రూ.15 లక్షలకు పెంచుతాం. జర్నలిస్టులకు రూ.15లక్షల వరకు ఉచిత వైద్య సేవలు. దీనికి కేసీఆర్‌ ఆరోగ్య రక్ష అని పార్టీ వాళ్లు పేరు పెట్టారు.

జర్నలిస్టులకు కూడా రూ.400 కే గ్యాస్‌ సిలిండర్‌

తెలంగాణ జర్నలిస్టులకు కేసీఆర్ వరాలు ప్రకటించారు. వీరి ఆదాయంతో సంబంధం లేకుండా రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌ అందజేస్తామని ప్రకటించారు. అక్రిడేషన్‌ ఉన్న జర్నిలిస్టులు అందరికీ రూ400 కే సిలిండర్‌ అందజేస్తామని చెప్పారు.

పేద మహిళలకు రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌

అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలు, గ్యాస్‌ ధరలు తగ్గినా కేంద్ర ప్రభుత్వాలు ప్రజలపై అడ్డగోలుగా భారం మోపుతుందని కేసీఆర్ విమర్శించారు. తెలంగాణలో చాలా మంది మళ్లీ గ్యాస్‌ స్టవ్‌లు మానేసి కట్టెల పొయ్యిలు సైతం వాడుతున్నారు. ఈ కష్టాలు తొలగిపోవాల్సి ఉంది. అందుకే అర్హులైన మహిళలకు రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌ అందజేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు.

READ MORE  శ్రీశైలానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన టీఎస్‌ఆర్టీసీ

పేద మహిళలకు రూ.3వేల గౌరవ భృతి

హైదరాబాద్‌లో మరో లక్ష డబుల్‌ బెడ్రూం ఇండ్లు

హైదరాబాద్‌ నగరంలో ఇంకా ఖాళీ ప్రదేశాలు ఉన్నాయని, హైదరాబాద్‌లో మరో లక్ష బెడ్రూం ఇళ్లు కట్టాలని నిర్ణయించామన్నారు. ఇళ్లు ఉన్నవారికి గృహలక్ష్మి పథకాన్ని కొనసాగిస్తూనే.. ఇండ్ల స్థలాలు లేనివారికి స్థలాలు కూడా ప్రభుత్వమే సమకూర్చాలని నిర్ణయించుకున్నామని సీఎం తెలిపారు.

అసైన్డ్‌ భూములపై ఆంక్షల ఎత్తివేత

పట్టాదారుడు అయితే భూమి ని అమ్ముకునే అవకాశముందని, కొన్ని చోట్ల రాళ్లు గుట్టలు ఉన్న ప్రాంతాల్లో కూడా రూ.కోట్లల్లో డిమాండ్‌ ఉందని కేసీఆర్ అన్నారు. ‘అటువంటి చోట భూములు అమ్ముకుంటే మరోచోట పదెకరాలు కొనుకుంటున్నారు.. కానీ వీళ్లకు అలాంటి వెసులుబాటు లేదు. దీనిని రిలీవ్‌ చేయాలని దళితసోదరులు కోరుతున్నారు. ఈ అసైన్డ్‌ భూములపై కూడా పార్టీల తో సంబంధం లేకుండా దళిత ప్రజాప్రతినిధులు అందరితో సమావేశమై ఒక పాలసీ రూపొందించి.. అసైన్‌డ్‌ భూములపై ఆంక్షలు ఎత్తివేసి.. మామూలు పట్టాదారుల్లా హక్కులు కల్పించే యత్నం బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తుందని కేసీఆర్ వెల్లడించారు.

అగ్రవర్ణ పేదలకు 119 గురుకులాలు

రాష్ట్రంలో 46 లక్షల మంది స్వశక్తి మహిళా గ్రూపులో సభ్యులుగా ఉన్నారని, పక్కా భవనాలు లేని గ్రూపులకు ప్రభుత్వమే విడతలవారీగా భవనాలు కట్టిస్తామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *