New Beer | మద్యం ప్రియులకు కిక్కు ఇచ్చేందుకు కొత్త ‘బీర్లు’..

New Beer | మద్యం ప్రియులకు కిక్కు ఇచ్చేందుకు కొత్త ‘బీర్లు’..

ప్ర‌భుత్వ అనుమ‌తి పొందిన సోమ్ డిస్టిల‌రీస్

New Beer |  తెలంగాణలో మ‌ద్యం ప్రియుల‌కు కిక్కు ఇచ్చేందుకు కొత్త బీర్లు వచ్చేస్తున్నాయి. త్వరలోనే స‌రికొత్త పేర్లతో బీర్లు మార్కెట్‌లోకి విడుదల కానున్నాయి. తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం సోమ్ డిస్టిల్లరీస్‌కు అనుమతినిచ్చింది. ఈ డిస్టిల్లరీస్ నుంచి పవర్ 1000, బ్లాక్ ఫోర్ట్, హంటర్, వుడ్ పీకర్ పేర్ల‌తో కొత్త‌ బీర్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో త‌మ బీర్ బ్రాండ్‌ల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌డానికి సోమ్ డిస్టిల‌రీస్ ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి పొందింది. ప‌వ‌ర్ 10000, బ్లాక్ ఫోర్ట్, హంట‌ర్, వుడ్ పీక‌ర్ బీర్లు త్వ‌ర‌లో అందుబాటులోకి రానున్నాయి.

READ MORE  lok sabha elections 2024 | అమేథీలో 26 ఏళ్ల తర్వాత గాంధీయేతర వ్యక్తిపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్

కాగా, తెలంగాణలో రూ. 5000 కోట్ల మేర‌ లిక్కర్ స్కామ్‌ జ‌రిగిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. గత రెండు, మూడు నెలలుగా బీర్లు దొరకకపోవడం వెనుక భారీ కుట్ర దాగి ఉంద‌ని ప‌లు మీడియా సంస్థ‌లు కోడై కూస్తున్న‌ సంగ‌తి తెలిసిందే.. కమీషన్ బట్టి తెలంగాణలో కొత్త బ్రాండ్ల (New Beer brands) కు అవ‌కాశం ఇవ్వ‌నున్న‌ట్లు గుస‌గుస‌లు వినిపించాయి. ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని పాత బ్రాండ్ల పోయి కొత్త బ్రాండ్లు వ‌స్తాయ‌ని ఈ వార్త‌ల సారాంశం. రాష్ట్రంలో ఇప్పటికే మద్యం కొర‌త సృష్టించారు.. ఇది సాకుగా చూపుతూ కొత్త బ్రాండ్లను ప్ర‌వేశ‌పెట్టాల‌ని, వాటి ద్వారా భారీగా కమీషన్ పొందాల‌నే ప్లాన్ చేసిన‌ట్లు ప‌లువురు ఆరోపిస్తున్నారు.

READ MORE  Special Trains | ప్ర‌యాణికుల‌కు శుభ‌వార్త‌.. వేస‌వి సెల‌వుల్లో ప్ర‌త్యేక రైళ్లు.. హాల్టింగ్ స్టేషన్లు ఇవే..

బీఆర్ఎస్ ఆరోపణలు..

రాష్ట్రంలో కొత్త మద్యం విక్రయాలపై బీఆర్ఎస్ (BRS) నాయ‌కులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) రాష్ట్రంలో చీప్ లిక్క‌ర్ ను ప్రవేశపెట్టి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంద‌ని బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ఆరోపించారు. తెలంగాణలో మద్యం అమ్మడానికి ఎవరికీ అనుమతులు ఇవ్వలేదని ఎక్సైజ్ శాఖ‌ మంత్రి జూపల్లి ప్రకటించగా.. మరోవైపు సోమ్ డిస్టిల్లరీస్ అనే సంస్థ తెలంగాణలో కార్యకలాపాలు ప్రారంభిస్తున్నామని ప్రకటించిందని తెలిపారు. తెలంగాణను ఆగం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం య‌త్నిస్తోంద‌ని క్రిశాంక్ విమ‌ర్శించారు.

READ MORE  Election Notification | ఏపీ, తెలంగాణ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది.. ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *