Friday, January 23Thank you for visiting

తాజా వార్తలు

Breaking News, National, State, Trending News Upadate

One Nation One Election | జ‌మిలీ ఎన్నిక‌లకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధం..!

One Nation One Election | జ‌మిలీ ఎన్నిక‌లకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధం..!

తాజా వార్తలు
One Nation One Election | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA Governamet) ప్రభుత్వం 'ఒక దేశం, ఒకే ఎన్నికలను తన ప్రస్తుత పదవీకాలంలోనే అమలు చేసేందుకు సిద్ధమవుతోందని వార్త‌లు వెలువ‌డుతున్నాయి. ఈ ఎన్నికల సంస్కరణకు పార్టీలకు అతీతంగా మద్దతు లభిస్తుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. మూడ‌వ సారి అధికారంలోకి వ‌చ్చిన ఎన్​డీఏ ప్రభుత్వం వంద రోజుల పాల‌న విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది. అయితే జమిలి ఎన్నికల నిర్ణయం ఈ విడతలోనే అమల్లోకి వస్తుందని ప్రభుత్వవర్గాలు తెలిపాయి.స్వాత్యంత్ర దినోత్సవ వేడుకల ప్రసంగంలో ప్రధాని మోదీ (PM MODI ) జమిలి ఎన్నికల ఆవశ్యకత గురించి ప్ర‌స్తావించారు. తరుచుగా జరిగే ఎన్నికలు దేశాభివృద్ధికి ఆటంకంగా మారుతుంద‌ని తెలిపారు. ఈ ముఖ్యమైన విధాన మార్పు భారతదేశం వ్యాప్తంగా జాతీయ, రాష్ట్ర ఎన్నికలను సమకాలీకరించడానికి ఉద్దేశించింది....
Andaman Nicobar | అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లేయ‌ర్ పేరును శ్రీ విజయ పురంగా మార్పు

Andaman Nicobar | అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లేయ‌ర్ పేరును శ్రీ విజయ పురంగా మార్పు

తాజా వార్తలు
Andaman Nicobar | అండమాన్ నికోబార్ దీవుల రాజధాని నగరమైన పోర్ట్ బ్లెయిర్ పేరును కేంద్రం 'శ్రీ విజయ పురం'గా మార్చింది, భార‌త‌దేశంపై వలసవాద ముద్రలను విముక్తి క‌లిగించేందుకు కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకుంది. . పోర్ట్ బ్లెయిర్ అండమాన్ నికోబార్ దీవులకు ఎంట్రీ పాయింట్‌.. ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బ్రిటిష్ కలోనియల్ నేవీ అధికారి అయిన కెప్టెన్ ఆర్చిబాల్డ్ బ్లెయిర్ పేరు మీదుగా ఈ నగరానికి పేరు పెట్టారు. హోం మంత్రి అమిత్ షా Xపై ఒక పోస్ట్‌లో తాజా నిర్ణయాన్ని ప్రకటించారు "మునుపటి పేరుకు వలసవాద వారసత్వం ఉన్నప్పటికీ, శ్రీ విజయ పురం మన స్వాతంత్ర్య పోరాటంలో సాధించిన విజయానికి అండ‌మాన్ నికోబార్ దీవుల విశిష్ట పాత్రకు ప్రతీక అని పేర్కొన్నారు.పోర్ట్ బ్లెయిర్ అండమాన్ నికోబార్ దీవులకు ప్రవేశ స్థానం. ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బ్రిటిష్ కలోనియల్ నేవీ అధికారి అయిన కెప్టెన్ ఆర్చిబాల్డ్ బ్లెయిర్ పేరు మీదుగా ఈ నగర...
Kolkata rape-murder case live : ప్రజల కోసం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా.. మమతా బెనర్జీ

Kolkata rape-murder case live : ప్రజల కోసం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా.. మమతా బెనర్జీ

తాజా వార్తలు
Kolkata rape-murder case live updates | లైవ్ టెలికాస్ట్ చేయ‌డానికి వెస్ట్ బెంగాల్ ప్ర‌భుత్వం అంగీక‌రిచ‌క‌పోవ‌డంతో జూనియ‌ర్ డాక్ట‌ర్లు సమావేశానికి హాజరు కాలేదు. దీంతో జూనియర్ వైద్యులు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ కేసుపై చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయలేమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (CM Mamata Banerjee) అన్నారు. సుప్రీంకోర్టు అనుమతితో ప్రభుత్వం రికార్డు చేసిన ఫుటేజీని నిరసన తెలిపిన వైద్యులతో పంచుకోవచ్చని బెనర్జీ అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. విధుల్లో చేరాల‌ని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను ధిక్కరిస్తూ, జూనియర్ డాక్టర్లు కోల్‌కతాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం స్వాస్థ్య భవన్ వెలుపల సిట్ నిరసనలు కొనసాగిస్తున్నారు.ఆరోగ్య శాఖ సహాయ మంత్రి చంద్రిమా భట్టాచార్య మాట్లాడుతూ ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని, అయితే "రాజకీయ శక్తులు" నిరసనలను ప్రభావితం ...
Sitaram Yechury |  చెన్నైలో జన్మించి..  హైదరాబాద్ లో ఎదిగి.. ఢిల్లీలో విద్యాభ్యాసం.. సీతారాం ఏచూరి ప్రస్థానం ఇదే..!

Sitaram Yechury | చెన్నైలో జన్మించి.. హైదరాబాద్ లో ఎదిగి.. ఢిల్లీలో విద్యాభ్యాసం.. సీతారాం ఏచూరి ప్రస్థానం ఇదే..!

తాజా వార్తలు
Sitaram Yechury :  సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) తుదిశ్వాస విడిచారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్‌తో ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఆయ‌న‌ కన్నుమూశారు. ఆయన ఆర్థిక, సామాజికవేత్తగా, కాలమిస్ట్‌గా ఏచూరికి ఎంతో గుర్తింపు ఉంది. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా 1992 నుంచి కొనసాగుతున్నారు.సీతారాం ఏచూరి చెన్నై లో 12 ఆగస్టు 1952న జన్మించారు. ఆయన తండ్రి సోమేశ్వర సోమయాజుల ఏచూరి ఏపీ స్టేట్‌ రోడ్‌ కార్పొరేషన్‌లో ఇంజినీర్‌గా పని చేసేవారు. తల్లి కల్పకం సైతం ప్రభుత్వ అధికారిగా ప‌నిచేశారు. దీంతో ఆయన బాల్యం మొత్తం హైదరాబాద్‌లోనే గడిచింది.హైద‌రాబాద్‌ ఆల్‌ సెయింట్‌ హైస్కూల్‌లో మెట్రిక్యులేషన్‌ పూర్తిచేసిన అనంతరం దిల్లీకి వెళ్లారు. అక్క‌డ ప్రెసిడెంట్‌ ఎస్టేట్‌ స్కూల్‌లో చేరారు.1970లో సీబీఎస్‌సీ హయ్యర్‌ సెకండరీ పరీక్షలో ఆల్‌ ఇండియా టాప్ ర...
Ayushman Bharat | కేంద్రం గుడ్ న్యూస్‌.. ఆయుష్మాన్ భారత్ కింద 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ₹ 5 లక్షల హెల్త్ క‌వ‌రేజ్‌..

Ayushman Bharat | కేంద్రం గుడ్ న్యూస్‌.. ఆయుష్మాన్ భారత్ కింద 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ₹ 5 లక్షల హెల్త్ క‌వ‌రేజ్‌..

తాజా వార్తలు
Ayushman Bharat scheme | కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (AB PM-JAY) కింద 70 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వృద్ధులందరికీ వారి ఆదాయంతో సంబంధం లేకుండా రూ. 5 లక్షల ఆరోగ్య కవరేజీని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా 4.5 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం తెలిపారు. "70 ఏళ్లు. అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లందరూ వారి సామాజిక-ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా AB PM-JAY ప్రయోజనాలను పొందేందుకు అర్హులు" అని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఉచిత ఆరోగ్య బీమాను ఎలా పొందాలి? 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు ఆరోగ్య సంరక్షణ కవరేజీ కోసం ఆయుష్మ...
Toll Tax | 20 కి.మీ వరకు ప్రైవేట్ వాహనాలకు టోల్ ట్యాక్స్ లేదు.. కేంద్రం గుడ్ న్యూస్..

Toll Tax | 20 కి.మీ వరకు ప్రైవేట్ వాహనాలకు టోల్ ట్యాక్స్ లేదు.. కేంద్రం గుడ్ న్యూస్..

తాజా వార్తలు
Toll Tax | రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ మంగళవారం జాతీయ రహదారుల రుసుము (రేట్లు ) నియమాలను సవరించింది. జీపీఎస్ ఆధారిత వ్యవస్థల ద్వారా ఎలక్ట్రానిక్ టోల్ వసూలును చేయాల‌ని నిర్ణ‌యించిందిరోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మంగళవారం జాతీయ రహదారుల రుసుము నియమాలను స‌వ‌రించింది. ఇది ప్రైవేట్ వాహన యజమానులకు మేలు చేకూరుస్తుంది. జాతీయ రహదారుల రుసుము ( Determination of Rates and Collection ) సవరణ నియమాలు - 2024 ప్రకారం, ఫంక్షనల్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (GNSS)ని కలిగి ఉన్న ప్రైవేట్ వాహన యజమానులు కొత్త టోల్ విధానం ద్వారా ప్రయోజనం పొందుతారు.కొత్త నోటిఫికేషన్ ప్రకారం, ప్రైవేట్ వాహన యజమానులు తమ వాహనాలు GNSS కలిగి ఉంటే, హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలలో రోజుకు 20 కిలోమీటర్ల వరకు ప్రయాణించడానికి ఎటువంటి Toll Tax ఛార్జీలు ఉండ‌వు. 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరాలకు, వారు ప్రయాణించిన దూరం ఆధారంగా...
Pragati Shiksha Yojana | బీజేపీ మేనిఫెస్టో.. జమ్మూ కశ్మీర్ మ‌హిళ‌ల‌కు వ‌రాల జ‌ల్లు..

Pragati Shiksha Yojana | బీజేపీ మేనిఫెస్టో.. జమ్మూ కశ్మీర్ మ‌హిళ‌ల‌కు వ‌రాల జ‌ల్లు..

National, తాజా వార్తలు
Jammu Kashmir Assembly Elections 2024 | జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (BJP) మేనిఫెస్టోను కేంద్ర హోం మంత్రి అమిత్ షా జమ్మూలో శుక్ర‌వారం విడుదల చేశారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి, భద్రత, ఆర్థిక ప్ర‌గ‌తిని పెంపొందించ‌డానికి పార్టీ అమ‌లు చేయ‌నున్న‌ ప్రణాళికలను ఈ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ కు ప్ర‌శాంత వాతావ‌ర‌ణం తీసుకురావడానికి బిజెపి చిత్త‌శుద్ధితో ప‌నిచేస్తోంద‌ని అమిత్ షా (Amit shah) అన్నారు. 2024 జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ మ్యానిఫెస్టోను ఆవిష్కరించిన సందర్భంగా షా జమ్మూ కాశ్మీర్‌పై బీజేపీ దీర్ఘకాల వైఖరిని నొక్కి చెప్పారు. పండిట్ ప్రేమ్ నాథ్ డోగ్రా, శ్యామా ప్రసాద్ ముఖర్జీ ప్రయత్నాలను ప్రస్తావిస్తూ, బిజెపికి ఈ ప్రాంతం చారిత్రక ప్రాముఖ్యతను వివ‌రించారు."స్వాతంత్ర్యం నుంచి, జమ్మూ కాశ్మీర్ సమస్య అత్యంత కీల‌క‌మైన అంశంగా త‌మ పార్టీ భావిస్తోంది...
Howrah-CSMT Express : ప‌లు రైళ్లు రద్దు.. మరికొన్ని రైళ్లు దారి మ‌ళ్లింపు పూర్తి జాబితా ఇదే..

Howrah-CSMT Express : ప‌లు రైళ్లు రద్దు.. మరికొన్ని రైళ్లు దారి మ‌ళ్లింపు పూర్తి జాబితా ఇదే..

తాజా వార్తలు
Howrah-CSMT Express  | జార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్ సమీపంలో మంగళవారం (జూలై 30) తెల్లవారుజామున హౌరా-CSMT ఎక్స్‌ప్రెస్ 18 కోచ్‌లు పట్టాలు తప్పడంతో అనేక రైళ్లు మళ్లించాల్సి వ‌చ్చింది. ఈ ప్ర‌మాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, అనేక మంది ప్రయాణికులు గాయపడ్డారు. హౌరా నుంచి ముంబైకి వెళ్తున్న ఈ రైలు ఆగ్నేయ రైల్వే పరిధిలోని రాజ్‌ఖర్సావాన్, బడాబాంబో స్టేషన్ల మధ్య తెల్లవారుజామున 3.45 గంటలకు పట్టాలు తప్పింది. రద్దు అయిన‌ రైళ్ల జాబితా:22861 హౌరా-కాంతబాజీ ఎక్స్‌ప్రెస్ 08015/18019 ఖరగ్‌పూర్-ధన్‌బాద్ ఎక్స్‌ప్రెస్ 12021/12022 హౌరా-బార్బిల్ ఎక్స్‌ప్రెస్షార్ట్ టర్మినేట్ చేసిన రైళ్లు..18114 బిలాస్‌పూర్-టాటా ఎక్స్‌ప్రెస్ రూర్కెలాలో దారిమ‌ళ్లింపు 18190 ఎర్నాకులం-టాటా ఎక్స్‌ప్రెస్‌ను చక్రధర్‌పూర్ వ‌ర‌కు ప‌రిమితం చేశారు. 18011 హౌరా-చక్రధర్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌ను ఆగ్రా వ‌ర‌కు ప‌రిమితం.హెల...
భారతదేశం శాంతి స్థాపన కోసం రోడ్‌మ్యాప్‌ని కలిగి ఉంది : ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్

భారతదేశం శాంతి స్థాపన కోసం రోడ్‌మ్యాప్‌ని కలిగి ఉంది : ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్

National, తాజా వార్తలు
జార్ఖండ్: కోవిడ్ -19 మహమ్మారి తర్వాత, భారతదేశం శాంతి స్థాప‌న‌కు ప‌టిష్ట‌మైన‌ రోడ్‌మ్యాప్‌ని కలిగి ఉందని, దీనిని ప్రపంచం కూడా న‌మ్ముతోంద‌ని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ (RSS Chief Mohan Bhagwat) స్ప‌ష్టం చేశారు. 'సనాతన ధర్మం' మానవజాతి సంక్షేమాన్ని విశ్వసిస్తుందని ఆయన పేర్కొన్నారు. వికాస్‌ భారతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గ్రామస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు."సనాతన సంస్కృతి, ధర్మం రాజభవనాల నుంచి వచ్చింది కాదు. ఆశ్రమాలు, అడవుల నుండి వచ్చింది, మారుతున్న కాలంతో, మన బట్టలు మారవచ్చు, కానీ మన స్వభావం ఎప్పటికీ మారదు" అని RSS అధినేత అన్నారు. మారుతున్న కాలంలో మన పని, సేవలను కొనసాగించాలంటే కొత్త కొత్త పద్ధతులను అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని, స్వభావాన్ని చెక్కుచెదరకుండా ఉంచుకునేరు అభివృద్ధి చెందుతార‌ని తెలిపారు.సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ అవిశ్రాంతంగా కృషి చే...
Dibrugarh Express accident : 13 రైళ్లు దారి మళ్లింపు.. మ‌రికొన్ని రద్దు.. పూర్తి జాబితా ఇదే..

Dibrugarh Express accident : 13 రైళ్లు దారి మళ్లింపు.. మ‌రికొన్ని రద్దు.. పూర్తి జాబితా ఇదే..

Trending News, తాజా వార్తలు
Dibrugarh Express accident  | ఉత్తరప్రదేశ్‌లోని గోండాలో గురువారం దిబ్రూఘర్ ఎక్స్‌ప్రెస్‌లోని 10 నుండి 12 కోచ్‌లు పట్టాలు తప్పడంతో కనీసం 13 రైళ్లు ప్రభావితమయ్యాయి. లక్నో గోండా గోరఖ్‌పూర్ మార్గంలోని అనేక రైళ్లను దారి మళ్లించి నడుపుతున్నారు. మరికొన్ని రైళ్లను రద్దు చేశారు. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.  ఈ ప్రమాదంలో 20 మంది గాయపడ్డారని ఉత్తరప్రదేశ్ రిలీఫ్ కమిషనర్ జిఎస్ నవీన్ కుమార్ తెలిపారు. 40 మంది సభ్యులతో కూడిన వైద్య బృందం మరియు 15 అంబులెన్స్‌లు సంఘటనా స్థలంలో ఉన్నాయని, మరిన్ని వైద్య బృందాలు అంబులెన్స్‌లను అక్కడికి తరలిస్తున్నట్లు చెప్పారు. రైల్వే సీనియర్ అధికారులు, స్థానిక పరిపాలన అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్నం 2:35 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు.కాగా రైలుప్ర‌మాదంలో మృతుల కుటుంబాలకు ₹ 10 లక్షల ఎక్స్‌...