Tuesday, April 8Welcome to Vandebhaarath

ఆర్టీసీ-ప్రభుత్వ విలీనానికి తెలంగాణ గవర్నర్ బ్రేక్

Spread the love

 

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ)ని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనానికి బ్రేక్ పడింది. విలీనానికి అన్ని చట్టపరమైన సమస్యలను పరిశీలించిన తర్వాతే బిల్లుపై సంతకం గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేయడంతో దానికి ఆమోదముద్ర పడలేదు. దీనికి మరికొంత సమయం అవసరమని గవర్నర్ పేర్కొన్నారు.
పర్యవసానంగా, ఆదివారంతో ముగియనున్న శాసనసభ వర్షాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలన్న బీఆర్‌ఎస్ ప్రభుత్వ యోచనలు బెడిసికొట్టాయి.

కేవలం రెండు రోజులే మిగిలి ఉన్నందున, ఎన్నికలకు ముందు చివరి సెషన్‌లో టిఎస్‌ఆర్‌టిసి విలీన బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు దాదాపు లేనట్టే.. ఈ అంశంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శనివారం సభలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

READ MORE  New Beer | మద్యం ప్రియులకు కిక్కు ఇచ్చేందుకు కొత్త ‘బీర్లు’..

ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని భావించినా.. దానికి గవర్నర్ ఆమోదం లభించాల్సి ఉంది. తర్వాత తేదీలోగానీ, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోగానీ గవర్నర్ ఆమోదం తెలిపితే బిల్లును ఆమోదించేందుకు ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని చేయాల్సి ఉంటుంది.
శుక్రవారం రాజ్‌భవన్ మీడియాకు ఒ ప్రకటన విడుదల చేసింది. అందులో “అసెంబ్లీ ఆగస్టు 3న సమావేశం కానుంది. “టిఎస్‌ఆర్‌టిసి విలీనం బిల్లు 2023 ముసాయిదా బిల్లును ఆగస్టు 2న హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో స్వీకరించారు. దాదాపు మధ్యాహ్నం 3.30 గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు అనుమతి కోసం మాత్రమే అభ్యర్థించారు. అభ్యర్థనపై నిర్ణయం తీసుకోవడానికి దాన్ని పరిశీలించడానికి.. న్యాయపరమైన సూచనలు పొందడానికి మరికొంత సమయం అవసరం.” అని పేర్కన్నారు.

టిఎస్‌ఆర్‌టిసి బిల్లు ఆర్థిక బిల్లు కేటగిరీ కిందకు వస్తుంది కాబట్టి దీనిని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలంటే గవర్నర్ ఆమోదం తప్పనిసరి. ప్రస్తుతానికి, రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యపై సందిగ్ధం నెలకొంది.
ఇదిలా ఉంటే ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంటారా.. లేక కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు వేచి చూడాల్సిందేనా అని ఆర్టీసీ ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

READ MORE  రేపటి నుంచి చేప ప్రసాదం పంపిణీ

గత సెప్టెంబరులో శాసనసభ ఆమోదించిన నాలుగు బిల్లులను ఆమె తిరస్కరించడంతో రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ మధ్య విభేదాలు తలెత్తాయి. మార్చిలో గవర్నర్‌పై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2022-23 రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు వీలుగా గవర్నర్‌ను ఆదేశించాలని కోరుతూ జనవరిలో హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు జోక్యంతో ఆమె అంగీకరించింది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన తర్వాత డాక్టర్ సౌందరరాజన్ కొన్ని బిల్లులను క్లియర్ చేశారు.. కొన్నింటిని వెనక్కి పంపారు.

కోర్టును ఆశ్రయించే అవకాశం

శుక్రవారం నాటి నాటకీయ పరిణామాల తర్వాత టిఎస్‌ఆర్‌టిసి విలీన అంశంపై ముఖ్యమంత్రి వివిధ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.

READ MORE  Hyderabad Ai City | హైదరాబాద్ శివారు ప్రాంతాలకు మహర్దశ.. కొత్తగా ఏఐ సిటీ నిర్మాణం..

ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని భావించినా.. దానికి గవర్నర్ ఆమోదం లభించాల్సి ఉంది. తర్వాత తేదీలోగానీ, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోగానీ గవర్నర్ ఆమోదం తెలిపితే బిల్లును ఆమోదించేందుకు ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చు.

రాష్ట్ర ప్రభుత్వంలో టీఎస్‌ఆర్‌టీసీ విలీనానికి రాష్ట్ర కేబినెట్ జూలై 31న ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. విలీనం తర్వాత దాదాపు 43,372 మంది ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం కానున్నారు. విలీనంతో తమకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నది కార్పొరేషన్‌ ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *