Monday, August 4Thank you for visiting

Snake Crazy Viral: పామును పట్టుకొని బొమ్మలా ఆడుకున్న చిన్నారి.. అందర్నీ షాక్ గురి చేసిన వీడియో

Spread the love

snake viral video : పాములు అత్యంత ప్రమాదకరమైన. కొన్ని విషపూరితమైన సర్పాలు ( snake) కాటేస్తే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. అందుకే పాములంటేనే అందరూ భయపడిపోతారు. అయితే కొందరు పాముల సంరక్షకులు సర్పాలతో ఎలా వ్యవహరిస్తారో చూపిస్తూ అనేక వైరల్ స్నేక్ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఓ పసిపాప పాములతో ఆడుకోవడం చూసి నెటిజన్లు షాక్ గురయ్యారు. కొందరు ఆమె ధైర్యవంతురాలని కొనియాడగా, మరికొందరు ఆ బిడ్డ పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

ఆకట్టుకునే వీడియోను పిహు మీనా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇది ఒక పసిబిడ్డ పామును పట్టుకుని ఆడుకుంటున్నట్లు చూపిస్తుంది. ఆమె ముఖంలో ఏమాత్రం భయం లేదు. ఆందోళన చెందలేదు. ఈ వీడియో క్లిప్ క్షణాల్లోనే వైరల్ అయింది. చాలా మంది వ్యక్తులు తమ భయాలను ఆలోచనలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేశారు. పసిపిల్లల వద్దకు పాములను రానివ్వకూడదని పలువురు సూచించారు.

 

View this post on Instagram

 

A post shared by Pihu Meena (@pihu_meena65)

యూపీలోనూ అత్యంత అరుదైన ఘటన

అయితే పిల్లలు పాముల పట్ల ధైర్యం ప్రదర్శించడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు ఇండియా టుడే ఒక చిన్న పిల్లవాడు పామును కరిచి ఎలా చంపాడో నివేదించింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో మూడేళ్ల చిన్నారి పామును పట్టుకున్నాడు. అక్షయ్ అనే బాలుడు తన ఇంటి బయట ఆడుకుంటుండగా, చెట్ల పొదల్లో నుంచి ఒక చిన్న పాము అతని వద్దకు వచ్చింది. అది చూసి బాలుడు ఆ పామును తీసుకుని నోటిలో పెట్టుకుని కొరికేశాడు. ఆ తర్వాత, చిన్న పిల్లవాడు భయంతో అరవడం ప్రారంభించాడు.

కొద్దిసేపటికే, అక్షయ్ అమ్మమ్మ అతని నోటిలో పామును చూసి భయపడిపోయిది. అయితే చిన్నారి నోటి నుంచి పామును బయటకు తీశారు. భయాందోళనకు గురైన మహిళ, ఆమె బంధువులు అతడిని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు.

బాలుడి శరీరంలో విషం ఆనవాళ్లను కనుగొనడానికి వైద్యులు చిన్న పిల్లవాడిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వారు తరువాత అతను పూర్తిగా ఆరోగ్యంగా.. సురక్షితంగా ఉన్నట్లు ధృవీకరించారు. బాలుడికి ప్రాథమిక చికిత్స అందించిన వెంటనే డాక్టర్ అతన్ని డిశ్చార్జ్ చేశారు.


Green Mobility, Environment అప్ డేట్స్ కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు,

ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.
Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *