Blood Cancer : బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడు.. నయమవుతుందని గంగా నదిలో ముంచడంతో మృతి
Blood Cancer | డెహ్రాడూన్ : ఈ టెక్ యుగంలో ప్రపంచమంతా ముందుకు దూసుకుపోతున్నా కూడా కొందరు ఇంకా అనాగరికమైన చర్యలకు పాల్పడుతున్నారు. బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఓ చిన్నారిని తమ మూఢనమ్మకానికి బలి చేసింది ఓ కుటుంబం. గంగా నదిలో ముంచితే క్యాన్సర్ నయమవుతుందని నమ్మి ఓ మహిళ.. బాలుడిని నీటిలో కొంతసేపు ఉంచింది. ఆ తర్వాత బాలుడు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని హరిద్వార్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే… ఢిల్లీకి చెందిన ఓ ఐదేళ్ల బాలుడు బ్లడ్ క్యాన్సర్ బారిన పడ్డాడు.. దీంతో ఢిల్లీలోని పెద్ద పెద్ద ఆస్పత్రుల్లో బాలుడికి వైద్యం అందించినా కూడా క్యాన్సర్ ముదిరిందని కానీ నయం కాలేదు. బాలుడిని ప్రాణాలతో కాపాడటం కష్టమని చెప్పి డాక్టర్లు చేతులేత్తెశారు.. దీంతో చివరకు ఆ చిన్నారి తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.
అయితే గంగా నదిలో బాలుడిని ముంచితే క్యాన్సర్ (Blood Cancer) వ్యాధి నయమవుతుందని అతడి అత్త బలంగా నమ్మింది. దీంతో బాలుడి తో పాటు ఆ చిన్నారి తల్లిదండ్రులను వెంటబెట్టుకొని హరిద్వార్‌కు వెళ్లింది. అందరూ గంగా నది వద్దకు చేరుకున్నారు. ఒకవైపు తల్లిదండ్రులు గంగా నదికి పూజలు చేస్తుండగా మరోవైపు, ఆ చల్లని నీటిలో బాలుడిని అత్త ముంచింది. దాదాపు 15 నిమిషాల పాటు ఆ చిన్నారి నీటిలోనే ఉండిపోయాడు.
పక్కనే ఉన్నస్థానికులు గమనించి ఆమెను నిలదీశారు. బాలుడిని నీటిలో నుంచి వెంటనే పైకి తీయాలని అత్తను గట్టిగా డిమాండ్ చేశారు. కానీ ఆమె వినిపించుకోలే దు. చివరకు స్థానికులు బలవంతం చేయడంతో నీటిలో నుంచి బాలుడిని బయటకు తీసింది. అప్పటికే అపస్మారకస్థితిలో కి వెళ్లిన బాలుడు.. మేల్కొంటాడని అత్త అమాయకం గా మాట్లాడింది.
చివర కు పోలీసులు అక్కడికి చేరుకుని, బాలుడిని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. బాలుడికి చికిత్స అందించిన ఢిల్లీ హాస్పిటల్ నుంచి నివేదిక అందగానే.. చర్యలు తీసుకుంటామని తెలిపారు.
अंधविश्वास ने एक 7 साल के बच्चे की जान ले ली …!!
ब्लड कैंसर से पीड़ित बच्चे को उसकी मौसी ने चमत्कार की आस में करीब पांच मिनट तक गंगा में डुबकियां लगवा दीं ….!!
बच्चे की मौत हो गई है ….!! pic.twitter.com/kLCPcHsIY8
— Firdaus Fiza (@fizaiq) January 24, 2024
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..