Blood Cancer : బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడు.. నయమవుతుందని గంగా నదిలో ముంచడంతో మృతి
Blood Cancer | డెహ్రాడూన్ : ఈ టెక్ యుగంలో ప్రపంచమంతా ముందుకు దూసుకుపోతున్నా కూడా కొందరు ఇంకా అనాగరికమైన చర్యలకు పాల్పడుతున్నారు. బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఓ చిన్నారిని తమ మూఢనమ్మకానికి బలి చేసింది ఓ కుటుంబం. గంగా నదిలో ముంచితే క్యాన్సర్ నయమవుతుందని నమ్మి ఓ మహిళ.. బాలుడిని నీటిలో కొంతసేపు ఉంచింది. ఆ తర్వాత బాలుడు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని హరిద్వార్‌లో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్తే... ఢిల్లీకి చెందిన ఓ ఐదేళ్ల బాలుడు బ్లడ్ క్యాన్సర్ బారిన పడ్డాడు.. దీంతో ఢిల్లీలోని పెద్ద పెద్ద ఆస్పత్రుల్లో బాలుడికి వైద్యం అందించినా కూడా క్యాన్సర్ ముదిరిందని కానీ నయం కాలేదు. బాలుడిని ప్రాణాలతో కాపాడటం కష్టమని చెప్పి డాక్టర్లు చేతులేత్తెశారు.. దీంతో చివరకు ఆ చిన్నారి తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.అయితే గంగా నదిలో ...