Elections 2024 | లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం..
Surat Lok Sabha | 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. సూరత్ లోక్‌సభ (Surat Lok sabha) నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ముఖేశ్ దలాళ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పోలింగ్ అధికారి ప్రకటించారు. ముఖేశ్ కుమార్ చంద్రకాంత్ దలాళ్ బీజేపీ నుంచి బరిలో నిలిచారు. అయితే సూరత్ లోక్ సభ స్థానం నుంచి ఆయన విజయం సాధించారని ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్, ఎలక్షన్ ఆఫీసర్ సౌరభ్ పార్ది తెలిపారు. ఈమేరకు దలాళ్‌కు ధ్రువీకరణ ప్రత్రాన్ని కూడా అందజేశారు.
కాగా సూరత్ లోక్ సభ స్థానం నుంచి నామినేషన్ వేసిన అభ్యర్థులదరూ పోటీ నుంచి తప్పుకున్నట్లు గుజరాత్ పార్టీ చీఫ్ సీఆర్ పాటిల్ తెలిపారు. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు మంగళవారమే చివరి తేదీ. సూరత్ స్థానం నుంచి ఎనిమిది మంది ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ క్రమంలో ఏడుగురు ఇండిపెండెంట్లు ఉన్నారు. ఇందులో బీఎస్పీకి చెందిన ప్యారేలాల్ భారతి కూడా తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నిలేశ్ కుంభాని పత్రాలను జిల్లా రిటర్నింగ్ అధికారి సౌరభ్ పర్గి తిరస్కరించారు. ఆయన చేసిన సంతకాల్లో తేడాలు ఉన్నాయన్న కారణంగా నిలేశ్ అఫడివిట్‌ను ఎన్నికల అధికారి కొట్టిపారేశారు. కాంగ్రెస్ పార్టీ సబ్‌స్టిట్యూట్‌గా నామినేషన్ వేసిన సురేశ్ పదసాలా పత్రాలను కూడా చెల్లనివని ప్రకటించారు. ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు దాఖలు చేసిన నాలుగు నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించారు. అఫడవిట్లు దాఖలు చేసిన అభ్యర్థులు వాటిల్లో వారు స్వయంగా సంతకాలు చేయలేదని తెలిపారు. అయితే ఈ విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు కాంగ్రెస్ తరపు న్యాయవాది బాబు మంగూకియా విలేకరులకు తెలిపారు.
2024 సార్వత్రిక ఎన్నికల మూడో దశలో గుజరాత్‌లోని ఇతర స్థానాలకు మే 7న ఓటింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..