Thursday, January 22Thank you for visiting

Bihar Assembly | బీహార్‌లో కొలువుదీరిన మంత్రివ‌ర్గం.. మంత్రుల జాబితా ఇదే..

Spread the love

Bihar Assembly : బీహార్ ముఖ్యమంత్రిగా రికార్డు స్థాయిలో 10వ సారి ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు, నితీష్ కుమార్ శుక్రవారం శాఖలను కేటాయించారు. ఇందులో భాగంగా నితిష్‌ కుమార్ జనరల్ అడ్మినిస్ట్రేషన్, క్యాబినెట్ సెక్రటేరియట్ విజిలెన్స్ విభాగాలను తన వద్ద ఉంచుకోగా, ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి హోం శాఖను అప్పగించారు. ఉప ముఖ్యమంత్రి కూడా అయిన విజయ్ కుమార్ సిన్హాకు గనులు- భూగర్భ శాస్త్ర శాఖ, రెవెన్యూ, భూ సంస్కరణల శాఖను కేటాయించారు.

మరోవైపు, బిజెపి బీహార్ యూనిట్ చీఫ్ దిలీప్ జైస్వాల్‌కు పరిశ్రమల మంత్రిగా, పార్టీ నాయకుడు మంగళ్ పాండేకు ఆరోగ్య, న్యాయ మంత్రిత్వ శాఖలు ఇచ్చారు. నితిన్ నబిన్ పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, రోడ్డు నిర్మాణ శాఖలను తన వద్దే ఉంచుకోగా, రామ్ కృపాల్ యాదవ్‌కు వ్యవసాయం దక్కింది. సంజయ్ సింగ్ టైగర్, నారాయణ్ ప్రసాద్‌లకు వరుసగా కార్మిక వనరులు, విపత్తు నిర్వహణ శాఖలు దక్కాయి.

జనతాదళ్ యునైటెడ్ (జెడియు) నాయకుడు విజయ్ కుమార్ చౌదరికి జలవనరులు, పార్లమెంటరీ వ్యవహారాలు, సమాచార, ప్రజా సంబంధాల శాఖలు అప్పగించారు. జెడియుకు చెందిన బిజేంద్ర ప్రసాద్ యాదవ్ కు ఆర్థిక, ఇంధన, ప్రణాళిక, అభివృద్ధి శాఖలు అప్పగించారు. శ్రావణ్ కుమార్ కు గ్రామీణాభివృద్ధి శాఖ, సునీల్ కుమార్ కు విద్య, శాస్త్ర సాంకేతిక శాఖలు అప్పగించారు. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) కు చెందిన ఇద్దరు మంత్రులకు చెరకు పరిశ్రమలు, ప్రజారోగ్య ఇంజనీరింగ్ శాఖలు కేటాయించబడ్డాయి.

బీహార్ కేబినెట్: మంత్రులు & పోర్ట్‌ఫోలియోలు (2025)

పేరుపార్టీపోర్ట్‌ఫోలియోలు
నీతీశ్ కుమార్JDUముఖ్యమంత్రి, జనరల్ అడ్మినిస్ట్రేషన్, క్యాబినెట్ సెక్రటేరియట్, విజిలెన్స్, ఎన్నికలు, కేటాయించని ఇతర శాఖలు
విజయ్ కుమార్ సిన్హాBJPఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ & భూ సంస్కరణలు, గనులు & భూగర్భ శాస్త్రం
సామ్రాట్ చౌదరిBJPఉప ముఖ్యమంత్రి, హోంమంత్రిత్వ శాఖ
మంగళ్ పాండేBJPఆరోగ్యం, చట్టం
దిలీప్ జైస్వాల్BJPపరిశ్రమలు
నితిన్ నబిన్BJPపట్టణాభివృద్ధి & గృహనిర్మాణం, రోడ్డు నిర్మాణం
రామ్ కృపాల్ యాదవ్BJPవ్యవసాయం
సంజయ్ సింగ్ టైగర్BJPకార్మిక వనరులు
అరుణ్ శంకర్ ప్రసాద్BJPపర్యాటకం, కళ & సంస్కృతి, యువజన శాఖ
సురేంద్ర మెహతాBJPజంతు & మత్స్య వనరులు
నారాయణ ప్రసాద్BJPవిపత్తు నిర్వహణ
రామ్ నిషాద్BJPBC/ EBC సంక్షేమం
లఖేంద్ర కుమార్ రౌషన్BJPSC/ST సంక్షేమం
శ్రేయసి సింగ్BJPIT & క్రీడలు
ప్రమోద్ చంద్రవంశీBJPసహకార శాఖ, పర్యావరణం, అటవీ
సంతోష్ కుమార్ సుమన్HAMచిన్న నీటి వనరులు
దీపక్ ప్రకాష్RLMపంచాయతీ రాజ్
విజయ్ కుమార్ చౌదరిJDUజల వనరులు, పార్లమెంటరీ వ్యవహారాలు, సమాచారం & ప్రజాసంబంధాలు, భవన నిర్మాణం
బిజేంద్ర ప్రసాద్ యాదవ్JDUఆర్థికం, ఇంధనం, ప్రణాళిక & అభివృద్ధి, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు
శ్రావణ్ కుమార్JDUగ్రామీణ అభివృద్ధి, రవాణా
అశోక్ చౌదరిJDUగ్రామీణ పనులు
లేషి సింగ్JDUఆహారం & వినియోగదారుల రక్షణ
మదన్ సాహ్నిJDUసామాజిక సంక్షేమం
సునీల్ కుమార్JDUవిద్య, సైన్స్ & టెక్నాలజీ
మహ్మద్ జామా ఖాన్JDUమైనారిటీ సంక్షేమం
సంజయ్ కుమార్ పాశ్వాన్LJP (RV)చెరకు పరిశ్రమలు
సంజయ్ కుమార్ సింగ్LJP (RV)పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *