
Warangal News | వరంగల్ నగరంలోని ప్రసిద్ధ భద్రకాళి ఆలయం (Bhadrakali Temple)లో ఈరోజు అమ్మవారు శాకంబరి దేవి (Shakambari )గా భక్తులకు దర్శనమిచ్చారు. సుమారు 10 టన్నుల కూరగాయలతో ప్రత్యేకంగా అమ్మవారిని అలంకరించారు. శాకంబరి అవతారంలో ఉన్న అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.
కాగా శాకంబరీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భద్రకాళి అమ్మవారు 15 రోజుల పాటు రోజూ రెండు అవతారాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు .ఇందుకోసం ఉదయం, సాయంత్ర వేళల్లో అర్చకులు అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేసి, పూజలు చేస్తున్నారు.
13న వాసవీ కన్యాక పరమేశ్వరి ఆలయంలో శాకంబరీ పూజలు
Shakambari Utsavalu 2025 : వరంగల్ 16వ డివిజన్ కీర్తినగర్ (keerthi nagar) లోని ఈనెల 13న ఆదివారం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజల నిర్వహించనున్నారు. ఆ రోజు అమ్మవారిని శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. అమ్మవారి ఉత్సవ మూర్తికి ఉదయం 07:00 గంటలకు భక్తులచే పంచామృత అభిషేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 11:00గంటలకు సామూహికంగా మహిళలతో కుంకుమార్చనలు చేయనున్నారు. అనంతరం మంత్రపుష్ప నీరాజనం హారతి తీర్థప్రసాద వితరణ భక్తులకు ఇవ్వడం జరుగుతుందని ఆలయ కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయంతం చేయాలని వారు కోరారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.