Bank holidays in October 2023 : 12 రోజుల పాటు బ్యాంకులకు సెలువులు.. రాష్ట్రాల వారీగా జాబితా చూడండి

Bank holidays in October 2023 :  12 రోజుల పాటు బ్యాంకులకు సెలువులు.. రాష్ట్రాల వారీగా జాబితా చూడండి

Bank holidays in October 2023 :  అక్టోబరు నెలలో బ్యాంకులు కొన్ని రోజులు మూతపడనున్నాయి. వచ్చే నెలలో ఏదైనా ముఖ్యమైన బ్యాంకు పనులు మొదలుపెట్టే ముందు ఒకసారి ఈ సెలవుల జాబితాను పరిశీలించండి. అక్టోబరులో బ్యాంకులకు రికార్డు స్థాయిలో సెలవులు రానున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మార్గదర్శకాల ప్రకారం, రాష్ట్రాన్ని బట్టి అన్ని జాతీయ సెలవులు, కొన్ని ప్రాంతీయ సెలవు దినాలలో బ్యాంకులకు మూసివేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాంతీయ సెలవులను నిర్ణయిస్తాయి. ఈ జాబితా ప్రకారం, అక్టోబర్ 2023లో 12 రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయి.మీకు బ్యాంకుకు సంబంధించిన ఏదైనా పని ఉంటే, దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి.

READ MORE  visa free countries 2024లో భారతీయులు వీసా లేకుండా ఈ దేశాలకు హాయిగా వెళ్లవచ్చు

అక్టోబర్‌లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకు సెలవుల లిస్ట్
అక్టోబర్ 2 (సోమవారం)- గాంధీ జయంతి – జాతీయ సెలవు
అక్టోబర్ 12 (ఆదివారం)- నరక చతుర్దశి
అక్టోబర్ 14 (శనివారం)- మహాలయ- కోల్‌కతాలో బ్యాంకులు మూసివేయనున్నారు.
అక్టోబర్ 15 (ఆదివారం)- మహారాజా అగ్రసేన్ జయంతి (పంజాబ్, హర్యానా, యుపి, రాజస్థాన్)
అక్టోబర్ 18 (బుధవారం)- కటి బిహు- అసోంలో బ్యాంకులకు సెలవు
అక్టోబర్ 19 (గురువారం)- సంవత్సరాది పండుగ- గుజరాత్
అక్టోబర్ 21 (శనివారం) -దుర్గా పూజ (మహా సప్తమి)- త్రిపుర, అస్సాం, మణిపూర్, బెంగాల్‌లలో బ్యాంకులు మూసి ఉంటాయి..
అక్టోబర్ 22 (ఆదివారం)- మహా అష్టమి, బతుకమ్మపండుగ
అక్టోబర్ 23 (సోమవారం)- దసరా (మహానవమి)/ఆయుధ పూజ/దుర్గాపూజ/విజయ దశమి- త్రిపుర, కర్ణాటక, ఒరిస్సా, తమిళ నాడు, అస్సాం, ఆంధ్రప్రదేశ్, కాన్పూర్, కేరళ, జార్కాహండ్, బీహార్‌లలో బ్యాంకులు మూసి ఉంటాయి.
అక్టోబర్ 24 (మంగళవారం)- దసరా/దసరా (విజయ దశమి)/దుర్గాపూజ- ఆంధ్రప్రదేశ్, మణిపూర్ మినహా అన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేసి ఉంటాయి.
అక్టోబర్ 28 (శనివారం)- లక్ష్మీ పూజ- బెంగాల్‌లో బ్యాంకులు మూసివేసి ఉంటాయి.
అక్టోబర్ 31 (మంగళవారం)- సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం- గుజరాత్‌లో బ్యాంకులు మూత పడనున్నాయి.

READ MORE  Special trains : సికింద్రాబాద్ నుంచి దానాపూర్‌ మధ్య అన్ రిజ‌ర్వ్‌డ్ కోచ్ ల‌తో 24 ప్రత్యేక రైళ్లు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *