Posted in

Bank Holidays | బ్యాంకు పనులు పూర్తిచేసుకోండి.. ఫిబ్రవరిలో సగం రోజులు బ్యాంకులు బంద్‌..!

Bank Holidays December 2024
Bank Holidays in october 2024
Spread the love

Bank Holidays | ప్రతినెలా బ్యాంకుల సెలవులకు సంబంధించిన జాబితాను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇటీవలే విడుదల చేసింది. ప్రస్తుతం ఎక్కువగా బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే అన్ని పనులను స్మార్ట్ ఫోన్లోనే పూర్తి చేసుకుంటున్నారు. అయితే, కొన్ని రకాల ఆర్థిక సంబంధిత పనుల కోసం బ్యాంకులకు తప్పనిసరిగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో బ్యాంకులకు వెళ్లే ముందు ఏయే రోజుల్లో బ్యాంకులు పని చేస్తాయి ? ఎప్పుడు సెలవులుంటాయే విషయాలను ముందే తెలుసుకోవడం ఇక్కడ చాలా కీలకం. సాధారణ సెలవులు, పండుగ సెలవులతో కలిసి ఫిబ్రవరిలో బ్యాంకులకు మొత్తం 14 రోజులు సెలవులు ఉంటాయి.

Bank Holidays in february 2025 : బ్యాంకులు మూసి ఉన్నా మొబైల్, ఇంటర్‌నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ సేవలు 24 గంటలు పని చేస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వీటితో డబ్బులు పంపుకోవచ్చు. ఇక నగదును డ్రాచేసుకునేందుకు కూడా ఏటీఎంలు అందుబాటులో ఉంటాయి. పలు బ్యాంకులు క్యాష్‌ డిపాజిట్‌ మిషన్లను సైతం నగరాల్లో ఏర్పాటు చేశాయి. వీటిలో డబ్బులను తమ ఖాతాల్లో జమ చేసుకోవచ్చు.

ఫిబ్రవరిలో బ్యాంకుల సెలవులు ఇవే..

  • ఫిబ్రవరి 2 : ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు .
  • ఫిబ్రవరి 3 : సరస్వతి పూజ సందర్భంగా అగర్తలలో బ్యాంకుల మూసివేత
  • ఫిబ్రవరి 8 : రెండో శనివారం సందర్భంగా వుహాలీడే
  • ఫిబ్రవరి 9 : ఆదివారం సందర్భంగా సెలవు
  • ఫిబ్రవరి 11 : థై పోసమ్​ సందర్భంగా చెన్నైలో బంద్
  • ఫిబ్రవరి 12 : శ్రీరవిదాస్​ జయంతి నేపథ్యంలో షిమ్లాలో హాలీడే
  • ఫిబ్రవరి 15 : లుయ్ గై ని పండుగ సందర్భంగా ఇంఫాల్‌లో సెలవు.
  • ఫిబ్రవరి 16 : ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకుల సెలవు
  • ఫిబ్రవరి 19 : ఛత్రపతి శివాజీ మహరాజ్​ జయంతి.. ముంబయి, నాగ్‌పూర్‌లో బ్యాంకులకు హాలీడే.
  • ఫిబ్రవరి 20 : స్టేట్​హుడ్​ డే సందర్భంగా అరుణాచల్‌ప్రదేశ్‌ ఈటానగర్‌లో సెలవు.
  • ఫిబ్రవరి 22 : నాలుగో శనివారం బ్యాంక్​లకు హాలీడే.
  • ఫిబ్రవరి 23 : ఆదివారం బ్యాంకుల బంద్
  • ఫిబ్రవరి 26 : మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో సెలవులు.
  • ఫిబ్రవరి 28 : లోసర్​ సందర్భంగా గ్యాంగ్​టక్​లోని బ్యాంక్​లకు సెలవు

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Whatsapp

శ్రీరామ్‌.. వందేభారత్ లో న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం,అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 15 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *