
Bangladeshi Immigrants Deported : గుజరాత్ లో సుమారు 250 మంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రత్యేక విమానంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా తరలించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్‌తో పాటు పలు నగరాల్లో బంగ్లాదేశ్ అక్రమ వలసదారులు వేల సంఖ్యలో అక్రమంగా నివసిస్తున్నారు. వీరిని గుర్తించడానికి స్థానిక పోలీసులతో కలిసి అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. వందలాది మంది బంగ్లాదేశ్ జాతీయులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరందరూ నకిలీ ఆధార్, పాన్ కార్డులను అక్రమపద్ధతితో తయారు చేయించుకున్నారని తెలిపారు.
కాగా, జూలై 3న సుమారు 250 మంది బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను గట్టి భద్రత మధ్య వడోదర ఎయిర్‌ఫోర్స్ బేస్‌కు వారిని తీసుకెళ్లారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢాకా ఎయిర్‌పోర్ట్‌కు తరలించారు. అయితే బంగ్లాదేశ్ ఇల్లీగల్ ఎమిగ్రెంట్స్ చేతులను తాళ్లతో కట్టి విమానం ఎక్కించిన ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించాయి. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయుల చేతులు, కాళ్లు కట్టేసి ప్రత్యేక విమానాల్లో భారత్‌కు పంపిన విషయం తెలిసిందే..
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.