Friday, April 11Welcome to Vandebhaarath

BA Animation | బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో బీఏ యానిమేషన్ అడ్మిషన్లు ప్రారంభం

Spread the love

BA Animation admissions  | హైదరాబాద్ : మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ చేవెళ్లలోని బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహిస్తున్న బీఏ యానిమేషన్ (BA Animation ), వీఎఫ్‌ఎక్స్ (VFX) ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్లను ప్రకటించింది. ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరానికి బీఏ యానిమేషన్‌, వీఎఫ్‌ఎక్స్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి అర్హులని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బీ సైదులు తెలిపారు.

అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు https://mjptbcwreis.telangana.gov.in/ వెబ్‌సైట్ నుండి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు . పూర్తి చేసిన‌దరఖాస్తు ఫారమ్‌ను mjpanimation45@gmail.com ఇమెయిల్ చిరునామాకు పంపాలి. ఇమెయిల్ చేసిన దరఖాస్తు హార్డ్ కాపీని MJPTBCWR స్కూల్ మియాపూర్ (జి), మోడల్ కాలనీ, చేవెళ్ల, రంగారెడ్డి అనే చిరునామాకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది ఆగస్టు 17. మరిన్ని వివరాలకు 9032644463, 9063242329 నంబర్లకు కాల్ చేయండి.

READ MORE  Telangana prisons : 2024లో తెలంగాణ జైళ్లకు పెరిగిన ఖైదీల సంఖ్య..

TGCHE DOST ప్రత్యేక దశ అడ్మిషన్ షెడ్యూల్‌

తెలంగాణ ఉన్నత విద్యా మండలి శనివారం దోస్త్ – 2024 ప్రత్యేక దశ అడ్మిషన్ షెడ్యూల్‌ను సవరించింది. రూ.400 రుసుముతో రిజిస్ట్రేషన్‌ను ఇప్పుడు ఆగస్టు 5 వరకు చేసుకోవచ్చు. ఆగస్టు 5 వరకు వెబ్ ఆప్షన్‌లను ఉపయోగించుకోవచ్చు. ఆగస్టు 7న సీట్లు కేటాయిస్తారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టు చేసి ఆగస్టు 9న కేటాయించిన కళాశాలలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.


Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

READ MORE  HYD Metro | హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ నుంచి ఎల్ అండ్ టీ ఔట్ ? ఉచిత బస్సు ప్రయాణమే కారణమా?

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *