BA Animation | బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో బీఏ యానిమేషన్ అడ్మిషన్లు ప్రారంభం
BA Animation admissions | హైదరాబాద్ : మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ చేవెళ్లలోని బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహిస్తున్న బీఏ యానిమేషన్ (BA Animation ), వీఎఫ్‌ఎక్స్ (VFX) ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్లను ప్రకటించింది. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరానికి బీఏ యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి అర్హులని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శి బీ సైదులు తెలిపారు.అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు https://mjptbcwreis.telangana.gov.in/ వెబ్‌సైట్ నుండి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు . పూర్తి చేసినదరఖాస్తు ఫారమ్‌ను mjpanimation45@gmail.com ఇమెయిల్ చిరునామాకు పంపాలి. ఇమెయిల్ చేసిన దర...