
Ayushman Bharat scheme in Delhi : ఢిల్లీలోని నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మరికొన్ని రోజుల్లో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఇక్కడ అమలు చేయాలని నిర్ణయించింది. ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన ( AB – PMJAY ) అమలు కోసం ఢిల్లీ ప్రభుత్వం మార్చి 18న జాతీయ ఆరోగ్య అథారిటీతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేయనుందని అధికారిక వర్గాలు ఇటీవలే వెల్లడించాయి.
Ayushman Bharat : మార్చి 18 ఒప్పందం
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేసిన 35వ రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంగా ఢిల్లీ (Delhi ) అవతరిస్తుంది. కాగా ఈ పథకాన్ని స్వీకరించని ఏకైక రాష్ట్రం పశ్చిమ బెంగాల్. మార్చి 18న కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి నడ్డా సమక్షంలో ఈ అవగాహన ఒప్పందంపై సంతకం చేయనున్నామని, ఐదు కుటుంబాలకు AB-PMJAY కార్డులు అందజేయనున్నామని, తద్వారా వారు ఈ పథకం లబ్ధిదారులుగా మారతారని అధికార వర్గాలు తెలిపాయి.
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పేదలకు ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తామని బిజెపి వాగ్దానం చేసింది. గత ఆప్ ప్రభుత్వం తన సొంత పథకాన్ని రూపొందించుకుని AB-PMJAYని అమలు చేయడానికి నిరాకరించింది. ఫిబ్రవరి 5న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించి, 26 సంవత్సరాల తర్వాత రాజధాని నగరంలో తిరిగి అధికారంలోకి వచ్చింది.
55 కోట్ల మందికి ప్రయోజనం
ఇదిలా ఉండగా భారతదేశ జనాభాలో ఆర్థికంగా బలహీనంగా ఉన్న 40 శాతం మంది దిగువన ఉన్న 12.37 కోట్ల కుటుంబాలకు చెందిన దాదాపు 55 కోట్ల మంది లబ్ధిదారులు ఈ పథకం కింద ప్రయోజనం పొందుతున్నారు. ఆసుపత్రిలో చేరేందుకు AB-PMJAY సంవత్సరానికి ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థికసాయం అందిస్తుంది. అక్టోబర్ 29, 2024న, కేంద్ర ప్రభుత్వం AB-PMJAYని విస్తరించి, 70 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న అన్ని సీనియర్ సిటిజన్లకు, వారి సామాజిక-ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా వర్తింపజేసింది. దీంతో వారికి కూడా సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స ప్రయోజనాలను అందించింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.