Bulldozer Action | మైనర్ బాలికపై రేప్ కేసులో నిందితుడి బేకరీని కూల్చేసిన ప్రభుత్వం.. Video
Bulldozer Action | మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ నేత మొయీద్ ఖాన్‌పై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుల్డోజర్ చర్య చేపట్టింది. ఆయోధ్యలో నిందితుడి బేకరీని జేసీబీలతో నేలమట్టం చేయించింది. అయితే విచారణలో అతడు స్థలాన్ని కబ్జా చేసి బేకరి నిర్వహిస్తున్నట్లు తేలింది. దీంతో యూపీ సర్కారు ఆ బేకరీని కూల్చివేయాలని ఆదేశించగా అధికారులు వెంటనే అమలు చేశారు.
ఈ ఘటనపై యూపీ మంత్రి, నిషాద్ పార్టీ అధ్యక్షుడు సంజయ్ నిషాద్ స్పందించారు. అయోధ్యలో తాము గెలిచామని అఖిలేష్ యాదవ్ గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ మొయీద్ ఖాన్ వంటి నేరగాళ్ల సాయంతో వాళ్లు గెలిచారని విమర్శించారు. ఇలాంటి కరడుగట్టిన నేరగాళ్లను పార్టీ నుంచి బహిష్కరించడానికి బదులుగా సమాజ్‌వాది పార్టీ వారిని కాపాడుకుంటోందని అన్నారు. క్రిమినల్స్‌కి వ్యతిరేకంగా సమాజ్‌వాదీ పార్టీ కనీసం ఒక్క మాట కూడా మాట్లాడదని, నిషాద్ విమర్శించారు.
మైనర్ బాలికపై అత్యాచారం కేసుకు సంబంధించి తాను అసెంబ్లీలో లేవనెత్తానని, నిందితుడికి కచ్చితంగా ఉరిశిక్ష పడుతుందని ఆయన అన్నారు. నిందితుడిపై చర్యలు చేపట్టినందుకు సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మైనర్ బాలికపై అత్యాచారం అంశాన్ని ప్రస్తావిస్తూ ఆయన విలపించారు.
నిందితులకు డీఎన్ ఏ పరీక్ష చేయించాలి : అఖిలేష్ యాదవ్
నిందితులకు డీఎన్‌ఏ పరీక్షలు చేయించడం ద్వారానే న్యాయం జరుగుతుందని, కేవలం ఆరోపణలు చేయడం, రాజకీయాలు చేయడం వల్ల న్యాయం జరగదు అని అఖిలేష్ యాదవ్ అన్నారు. దోషులు ఎవరైతే వారికి చట్ట ప్రకారం పూర్తి శిక్ష పడాలి, కానీ డీఎన్‌ఏ పరీక్ష తర్వాత ఆ ఆరోపణలు అవాస్తవమని తేలితే.. ప్రమేయం ఉన్న ప్రభుత్వ అధికారులను కూడా వదిలిపెట్టకూడదు’ అని అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. అయోధ్య అత్యాచారం కేసులో తన మౌనాన్ని వీడిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ శనివారం అసలు దోషి ఎవరో తెలియాలంటే డీఎన్‌ఏ పరీక్షలు చేయాల్సిందేనని అన్నారు.
యూపీ ప్రభుత్వ చర్యను సమర్థించిన మాయావతి
అయోధ్య అత్యాచారం కేసుపై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ, నిందితులకు డిఎన్‌ఎ పరీక్ష నిర్వహించి, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) అధినేత్రి మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌పి హయాంలో ఇలాంటి పరీక్షలు ఎన్ని నిర్వహించారని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌లో నేరాలను పరిష్కరించడానికి మహిళల భద్రత కోసం రాజకీయలకు అతీతంగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆమె నొక్కి చెప్పారు. ‘‘అయోధ్య సామూహిక అత్యాచారం కేసులో నిందితులపై యూపీ ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలు (Bulldozer Action ) సమంజసమే…” అని మాయావతి అన్నారు.
#WATCH | Uttar Pradesh | Demolition underway at the bakery of SP leader Moeed Khan, the main accused in the gang rape of a minor girl, in Ayodhya. pic.twitter.com/msA23T12sc
— ANI (@ANI) August 3, 2024
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్, ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.