Ram Mandir specialities | ఔరా అనిపించే ప్రత్యేకతలు.. అయోధ్య రామాలయం గురించి విశేషాలు ఇవే..
Ayodhya Ram Mandir | యావత్ భారతదేశం అమిత ఆసక్తితో ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామాలయం (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమవుతోంది. జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. పది రోజుల పాటు నిర్వహించనున్న ప్రతిష్ఠాపనోత్సవాలు జనవరి 16వ తేదీన ప్రారంభమవుతాయి. ఆలయ గర్భగుడిలో రాముడి విగ్రహ ప్రతిష్ఠను 22న మధ్యాహ్నం 12.45-1.00 గంటల మధ్య నిర్వహించనున్నట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఆలయ నిర్మాణం, విశేషాల గురించి తెలుసుకునేందుకు ప్రతీ ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఇంటర్నెట్ లో వెతుకుతున్నారు. ఈ క్రమంలో అయోధ్యలోని భవ్య రామ మందిర ప్రత్యేకతలు గురించి ఒకసారి చూడండి..
ఆలయ ప్రత్యేకతలు (Ram Mandir specialities)
- భారత సంస్కృతి, వారసత్వాలకు నిలువెత్తు ప్రతిరూపం అయోధ్య రామ మందిరం. ఈ రామమందిరం సంప్రదాయ నాగర్ శైలి(traditional Nagara style)లో నిర్మించారు.
- ఆలయాన్ని 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో నిర్మితమైంది.
- మందిరాన్ని మొత్తం మూడు అంతస్తుల్లో నిర్మించారు. ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తులో ఉంటుంది.
- ఈ రామాలయంలో మొత్తం 392 స్తంభాలు, 44 గేట్లు ఉన్నాయి.
- ప్రధాన గర్భగుడిలో శ్రీరాముడి ఐదేళ్ల బాలరాముడి గా (శ్రీరామ్ లల్లా విగ్రహం) దర్శనమివ్వనున్నాడు. మొదటి అంతస్తులో శ్రీరామ్ దర్బార్ ఉంటుంది..
- ఆలయంలో మొత్తం 5 మండపాలు ఉంటాయి. నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థనా మండపం, కీర్తన మండపాలు ఉన్నాయి.
- రామాలయంలోని మొత్తం గోడలు, స్తంభాలపై అనేక రకాల దేవతామూర్తులను చెక్కారు. రామాయణ ఘట్టాలను చిత్రీకరించారు.
- రామాలయంలోకి తూర్పు వైపు నుంచి ప్రవేశం ఉంటుంది.
ఇక్కడ సింగ్ ద్వార్ మీదుగా 32 మెట్లు ఎక్కి లోపలికి ప్రవేశించాల్సి ఉంటుంది. - దేవాలయానికి వచ్చే దివ్యాంగులుచ వృద్ధుల కోసం సౌకర్యార్థం ఆలయంలో ప్రత్యేకంగా ర్యాంపులు, లిఫ్టులు ఏర్పాటు చేశారు.
- ఆలయం చుట్టూ 732 మీటర్ల పొడవు, 14 అడుగుల వెడల్పుతో దీర్ఘచతురస్కాకారంలో ప్రహరీ నిర్మించారు.
- నాలుగు మూలల్లో నాలుగు దేవాలయాలను నిర్మించారు. వీటిల్లో సూర్యభగవానుడు, దేవి భగవతి, గణపతి, శివుడి ఆలయాలు ఉన్నాయి. ఉత్తర భుజంలో అన్నపూర్ణ దేవాలయం, దక్షిణం వైపు ఆంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయి.
- మందిరం సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి (సీతా కూపం) ఉంది..
శ్రీరామ జన్మభూమి మందిరం కాంప్లెక్స్‌లో మహర్షి వాల్మీకి, - మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర.. మహర్షి అగస్త్య, నిషాద్ రాజ్, శబరి మాత, అహల్య దేవిల మందిరాలను చూడొచ్చు.
కాంప్లెక్స్ నైరుతి భాగంలో కుబేర్ తిలపై వున్న పురాతన శివాలయాన్ని పునరుద్ధరించారు. జఠాయువును ప్రతిమతో పునర్నిర్మించారు. - ఇనుమును వాడకుండా ప్రత్యేక శిలలతో ఆలయాన్ని అత్యంత సుందరంగా నిర్మించారు.మందిర నిర్మాణంలో నేల, గోడలు, మెట్లు, పైకప్పు.. ఇలా అంతటా రాతినే వినియోగించారు. ఎక్కడా ఇనుము, స్టీల్, సిమెంట్, కాంక్రీటును వాడలేదు. యూపీ, గుజరాత్, రాజస్థాన్ నుంచి ప్రత్యేక శిలలను తెప్పించారు.
- మందిర్ పునాది 14-మీటర్ల మందపాటి రోలర్-కాంపాక్ట్ కాంక్రీట్ (RCC)తో నిర్మించారు. ఈ కాంక్రీట్ కృత్రిమ శిలా రూపాన్ని ఇస్తుంది.
- భూమిలోని తేమతో ఆలయానికి భవిష్యత్తులో ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండేందుకు 21 అడుగుల ఎత్తులో గ్రానైట్‌తో పునాదిని నిర్మించారు.
- ఆలయానికి సమీపంలోని కరసేవక్‌పురంలో 30 ఏళ్ల కిందటే రాతిని చెక్కే పనులను ప్రారంభించారు. గత 30 సంవత్సరాలుగా
- దేశం నలు మూలల నుంచి సేకరించిన రెండు లక్షల ఇటుకలను ఆలయ పీఠం కోసం వాడారు.
- బయటి వనరులపై ఆధారపడకుండా ఆలయం కాంప్లెక్స్‌లో మురుగునీటి శుద్ధ కర్మాగారం, నీటి శుద్ధి కర్మాగారం, అగ్ని మాపకాల నుంచి భద్రత కోసం నీటి సరఫరా, స్వతంత్ర విద్యుత్తు కేంద్రాలను నిర్మించారు.
- 25,000 మంది పట్టే సామర్థ్యంతో యాత్రికుల సౌకర్య కేంద్రం నిర్మిస్తున్నారు.. ఇందులో యాత్రికులకు వైద్య సౌకర్యం, లాకర్ సదుపాయాలు ఉంటాయి.
- కాంప్లెక్స్‌లో స్నాన గదులు, వాష్‌రూమ్‌లు, వాష్ బేసిన్లు, ఓపెన్ ట్యాప్ లు తదితర వాటితో ప్రత్యేక బ్లాక్ కూడా ఉంటుంది.
- మందిర్ ను పూర్తిగా భారత సంప్రదాయ, స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి నిర్మిస్తున్నారు. 70 ఎకరాల విస్తీర్ణంలో 70% పచ్చగా ఉండేలా పర్యావరణ-నీటి సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తూ దీనిని నిర్మిస్తున్నారు.
- శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పర్యవేక్షణలో ఈ ఆలయ నిర్మాణం కొనసాగుతుంది.
ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద హిందూ ఆలయంగా నిలవనుంది. ప్రస్తుతం కంబోడియా అంకోర్‌వాట్‌లోని దేవాలయ సముదాయం ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయంగా రికార్డులకెక్కింది. ఆ తర్వాత స్థానంలో తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉన్న రంగనాథస్వామి ఆలయం ఉంది. - ప్రధాన ఆలయాన్ని L &T కంపెనీ నిర్మించగా, ఉప ఆలయాలు, ఇతర నిర్మాణాలను TATA కన్సల్టెన్సీ ఇంజినీర్స్ లిమిటెడ్ నిర్మిస్తున్నది.
- రిక్టర్ స్కేల్‌పై 10 తీవ్రతతో భారీ భూకంపాలు వచ్చినా, మరే విధమైన ప్రకృతి విపత్తులు వచ్చినా కనీసం 2,500 సంవత్సరాల పాటు ఆలయం తట్టుకొనేలా డిజైన్ చేశారు.
- ఆయోధ్య రామాలయ ప్రాంగణంలో 27 నక్షత్రాలకు సూచికగా 27 మొక్కలను గతంలో నాటారు.. భక్తులు తమ జన్మ నక్షత్రాన్ని, రాశిని అనుసరించి ఆయా చెట్ల కింద కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేసుకోవడం కోసమే ఈ వాటికను ఏర్పాటు చేశారు.
- వసుధైక కుటుంబం అన్న భారతీయ భావనను ప్రతిబింబించేలా.. ప్రపంచ వ్యాప్తంగా ఏడు ఖండాల్లోని 115 దేశాల్లో నదులు, సముద్రాల నుంచి తీసుకొచ్చిన జలాన్ని , 2,587 ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మట్టి ని రామాలయ నిర్మాణంలో వినియోగించారు..
- ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం గర్భగుడిలోని మూల విరాట్‌పై సూర్య కిరణాలు పడినట్లుగా.. రామ మందిరంలోని బాల రాముడి విగ్రహం మీద శ్రీరామనవమి రోజు సూర్యకిరణాలు ప్రసరించేలా అయోధ్య ఆలయ నిర్మాణాన్ని చేపట్టడం విశేషం.
- ఇక ఆలయ నిర్మాణానికి రూ. 1,400 కోట్ల నుంచి రూ.1,800 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా..
ఈ ఆలయానికి 2020 జూలై 8న శంకుస్థాపన చేశారు.
మందిరం నిర్మాణం 2026 కి పూర్తవుతుందని భావిస్తున్నారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..