Jharkhand : 30 ఏళ్ల తర్వాత మౌన వ్రతం వీడనున్న మహిళ.. కారణం ఎందుకో తెలుసా..
ధన్ బాద్: జార్ఖఖండ్ (Jharkhand) కు చెందిన 85 ఏళ్ల సరస్వతీదేవి అగర్వాల్ (Saraswati Devi) కల ఇన్నాళ్లకు నెరవేరబోతోంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఆమె తన మౌనవ్రతాన్ని వీడనున్నారు. అయోధ్యలో రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన రోజే తాను మౌన వ్రతాన్ని వీడతానని 1992లో ఆమె ప్రతిజ్ఞ చేశారు. ఇప్పుడు జనవరి 22న జరగనున్న ప్రాణప్రతిష్ఠ కోసం ఆమెకు కూడా ఆహ్వానం అందింది. ఇప్పుడు ఆమె చిరకాల కల తీరబోతోంది. జార్ఖండ్ లోని ధన్ బాద్ కు చెందిన సరస్వతీదేవి.. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజే మౌనదీక్షలోకి వెళ్లిపోయింది. అయోధ్యలో రామాలయం నిర్మించిన రోజోనే తన మౌన వ్రతాన్ని వీడతానని ఆమె ఆ రోజున ప్రతిజ్ఞ చేశారు.
ఈ క్రమంలోనే ఆమె ‘మౌని మాత’గా గుర్తింపు పొందారు. అయితే సరస్వతీ దేవి తమ కుటుంబ సభ్యులతో కేవలం సంకేతాలతో కమ్యూనికేట్ అయ్యేది. కొన్ని సందర్భాల్లో ఆమె పేపర్ పై రాసి రాసి ఇచ్చేది. అయితే 2020 వరకు ఆమె ప్రతీ రోజు కేవలం గంట మాత్రమే మాట్లాడాది. 24 గంటల్లో కేవలం మధ్యాహ్నం ఒక గంట మాత్రమే .. ఇంట్లో వారితో మాట్లాడేది. 2020లో ప్రధాని నరేంద్ర మోదీ.. అయోధ్య ఆలయ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన నాటి నుంచి ఆమె రోజంతా మౌనంగా ఉండడం ప్రారంభించారు.
న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి
సోమవారమే ఆమె అయోధ్యకు ట్రైన్ లో వెళ్లినట్లు ఆమె కుమారుడు 55 ఏళ్ల హరేరామ్ అగర్వాల్ పేర్కొన్నారు. జనవరి 22న ఆమె తన మౌనవ్రతాన్ని వీడుతారని చెప్పారు. మహంత్ నృత్య గోపాల్ దాస్ సేవకులు తన తల్లికి ఆహ్వానం పలికినట్లు హరేరామ్ అగర్వాల్ చెప్పారు. 1986 లో భర్త దేవకీనందన్ అగర్వాల్ మరణించిన తర్వాత సరస్వతీ దేవి తన జీవితాన్ని పూర్తిగా రాముడికే అంకితం చేసింది. ఎక్కువ సమయాన్ని ఆమె యాత్రలకే కేటాయించినట్లు హరేరామ్ తెలిపారు. ప్రస్తుతం రెండో కుమారుడు నంద్ లాల్ అగర్వాల్ వద్ద సరస్వతి ఉంటోంది.
ప్రతీ రోజు రామాయణ, భగవద్గీత పారాణయం
2001 లో మధ్యప్రదేశ్ లోని చిత్రకూట(chitrakoot) లో సుమారు ఏడు నెలల పాటు సరస్వతీ దేవి దీక్ష చేసినట్లు ఆమె కోడలు ఇన్నూ అగర్వాల్ వెల్లడించారు. సరస్వతీదేవి తెల్లవారుజామున 4 గంటలకే నిద్ర లేస్తుంది. సుమారు ఆరు గంటల పాటు ధ్యానం చేస్తుంది.. సంధ్యా హారతి తర్వాత రామాయణం, భగవద్గీత వంటి పుస్తకాలను పఠిస్తుంది. ఆమె రోజు కేవలం ఒక్కసారే భోజనం చేస్తుందని.. ఇక ఉదయం సాయంత్రం వేళల్లో గ్లాసు పాలు తాగుతుందని ఇన్నూ అగర్వాల్ తెలిపారు. అన్నం, పప్పు, రోటీలతో కూడిన వెజ్ డైట్ ను ఆమె తీసుకుంటుందని వివరించారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..