AP Yuva Nestham | వెంటనే ఇవన్నీ రెడీ చేసుకోండి , ఏపీ లో నిరుద్యోగ భృతి.
AP Yuva Nestham | ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం నిరుద్యోగ భృతి అందిస్తుందని నిరుద్యోగులు అంతా ఎదురుచూస్తున్నారు. ఐతే వీరి కోసమే ప్రభుత్వం తాజాగా ఒక స్టెప్ వేసింది. ఐతే నిరుద్యోగ భృతి పొందడానికి ఏపీలో నిరుద్యోగులంతా ఏం చేయాలి.. దానికి ఎలా అప్లై చేయాలో చూద్దాం.
ఏపీలో నిరుద్యోగుల కోసం యువ నేస్తం స్కీం ను ఏర్పాటు చేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగానే నెలకు 3000 రూ.లు వారికి అందిస్తుంది. ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చిన దాని ప్రకారంగా ఇది అమలు చేసేలా చూస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో నిరుద్యోగులు తమకు కవాల్సిన బుక్స్ ఇంకా రిక్రూట్ మెంట్ పరీక్షలను రాసే ఛాన్స్ ఉంటుంది. నిరుద్యోగులు తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఉండేలా ప్రభుత్వం ఈ బృతి అందిస్తుంది.
నిరుద్యోగ భృతి కోసం ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి..
నిరుద్యోగ భృతి అమలు చేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొత్త అధికార పోర్టల్ ( http://www.yuvanestham.ap.gov.in) ను మొదలు పెట్టింది. లో నిరుద్యోగ బృథి కోసం అప్లై చేసుకోవచ్చు. ఐతే ఈ పోర్టల్ ఇంకా సిద్ధం కాలేదు. త్వరలో ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.
ఈ నిరుద్యోగ భృతి విషయమై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలను కూడా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఐతే ఆగష్టులోనే మహిళలకు ఉచిత్ర బస్సు ప్రయాణం, యువతకు నిరుద్యోగ భృతి అందించేందుకు ప్రభుత్వ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేస్తుంది.
నిరుద్యోగ భృతికి అర్హులు వీరే.. ..
ఒక అంచనా ప్రకారం ఈ నిరుద్యోగ భృతి 22 నుంచి 35 వయసు మధ్య యువత కోసమే యువనేస్తం అమలు చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఐతే వీరికి నేరుగా బ్యాంక్ లో 3 వేల రూపాయలు ప్రభుత్వం జమ చేస్తుంది. ఈమధ్యనే మహారాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతితో పాటు నైపుణ్య శిక్షణ కూడా అందిస్తుంది. ఏపీ లో కూడా అలానే చేయాలని ప్రభుత్వం దృష్టి సారిస్తుంది.
AP Yuva Nestham కోసం ఈ పత్రాలు అవసరం..
ఆధార్ కార్డ్, వయస్సు సర్టిఫికెట్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, విద్యార్హత సర్టిఫికెట్లు, కుటుంబ్న ఆదాయ ధృవీకరణ పత్రం, రేషన్ కార్డ్, బ్యాంక్ పాస్ బుక్, నివాస ధృవీకరణ పాత్రం తో పాటు మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి కూడా దగ్గర ఉంచుకుని సంబందిత పత్రాలు స్కాన్ చేసి ఆన్ లైన్ లో అప్లై చేయాలి.
యూత్ గ్రాంట్ కోసం ఎలా అప్లై చేయాలంటే..?
ప్రభుత్వం ఈ పథకం గురించి అధికారికంగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. ఆ తర్వాత అభ్యర్ధులు ఈ https://yuvanestham.ap.gov.in పోర్టల్ కి వెళ్లి.. అందులో రిజిస్ట్రేషన్ చేసుకుని పేరు, అడ్రస్, వివరాలు, మొబైల్ నంబర్, ఆధార్ వివరాలు ఇస్తే.. ఆ తర్వాత రిఫరెన్స్ ఐడి నంబర్ వస్తుంది. దాన్ని దగ్గర ఉంచుకుని ఆ తర్వాత వెరిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..