ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. భారీగా దసరా సెలవులు

ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. భారీగా దసరా సెలవులు

AP TS Dasara Holidays తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించారు. ఏపీలో 11 రోజులు, తెలంగాణ లో 13 రోజులు దసరా హాలిడేస్ అని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

AP TS Dasara Holidays : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్కూళ్లకు ప్రభుత్వాలు దసరా సెలవులు ప్రకటించాయి. తెలంగాణలో ఈ ఏడాది 13 రోజులు దసరా సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 13 నుంచి 25 వరకు దసరా సెలవులుగా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అక్టోబరు 26న తిరిగి స్కూళ్ల పునఃప్రారంభం కానున్నాయని విద్యాశాఖ అధికాలు వెల్లడించారు.. తెలంగాణలో దసరా, బతుకమ్మ పండుగలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈనేపథ్యంలోనే పాఠశాలలు, కాలేజీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే సెలవులు ప్రక‌టించింది. అక్టోబరులో సాధారణంగా సెలవులు ఎక్కువగా ఉంటాయి.

READ MORE  వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఆటో ఢీకొని ఆరుగురు మృతి

13 రోజులు సెలవులు

తెలంగాణలో బతుకమ్మ, దసరా ( విజయదశమి) పండుగలకు సెలవులు మొత్తం 13 రోజులు ఉన్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ స్కూళ్ల అకడమిక్ క్యాలెండరులో దసరా సెలవులను విద్యాశాఖ ప్రకటించింది. తెలంగాణలో దసరా సెలవులు గతేడాది 14 రోజులు ఉండగా, ఈ సంవత్సరం మాత్రం 13 రోజులే ఇచ్చారు. ఈ ఏడాది అక్టోబరు 13 నుంచి అక్టోబరు 25 వరకు బతుకమ్మ, దసరా సెలవులు ప్రకటించారు. తిరిగి అక్టోబరు 26న స్కూళ్లు తిరిగి తెరుచుకోనున్నాయి. తెలంగాణ ప్రజలు అక్టోబర్ 24న దసరా పండగ. అక్టోబర్ 22న దుర్గాష్టమి అదే రోజు బతుకమ్మ పండుగ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలకు ప్రభుత్వం ముందుగానే సెలవులు ప్రకటించింది..

READ MORE  రేపటి నుంచి చేప ప్రసాదం పంపిణీ

ఏపీలో దసరా సెలవులు

ఏపీ ప్రభుత్వం సైతం పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించింది. అక్టోబ‌ర్ 14 నుంచి 24 వరకు స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించింది. దసరా సెలవుల తర్వాత అక్టోబరు 25న తిరిగి తరగతులు ప్రారంభమవుతాయని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.. ఈనెల 3 నుంచి 6 వరకు పాఠశాల విద్యాశాఖ ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.. రాష్ట్రంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఎఫ్ఏ-2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఉమ్మడి ప్రశ్నాపత్రం ఆధారంగా పాత విధానం లోనే పరీక్ష లు నిర్వహించనున్నారు.. పరీక్షకు గంట ముందుగానే స్కూళ్ల ప్రధాన ఉపాధ్యాయులకు పేపర్ల పంపాలని ఎంఈవోలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఉదయం, మధ్యాహ్నం పరీక్షలు నిర్వహిస్తారు. 6,7,8వ తరగతుల విద్యార్థుల మధ్యాహ్నం పరీక్షలు నిర్వహించగా, 9, 10వ తరగతుల విద్యార్థులకు రోజుకు రెండు పరీక్షలు ఉదయం  నిర్వహిస్తారు. అక్టోబర్ 10 లోపు మూల్యాంకనం పూర్తి చేసి విద్యార్థులకు తెలుపుతారు.

READ MORE  Corona Cases | కరోనా టెర్రర్.. ఒక్కరోజే ఐదు మరణాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *