భూకంప హెచ్చరికలను ఇక స్మార్ట్‌ఫోన్‌లలోనే చూడొచ్చు.. అతి త్వరలో అందుబాటులోకి తీసుకురానున్న గూగుల్
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్.. స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు సరికొత్త ఫీచర్ ను తీసుకొస్తోంది..
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలోని సెన్సార్లను ఉపయోగించి భూకంపాల తీవ్రతను ముందుగానే గుర్తించి prajalaku భూకంప హెచ్చరికలను జారీ చేసే సేవలను భారతదేశంలో విడుదల చేయనున్నట్లు గూగుల్.. బుధవారం తెలిపింది.
నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA), నేషనల్ సిస్మోలజీ సెంటర్ (NSC)తో సంప్రదించి Google భారతదేశంలో “”Android Earthquake Alerts System” ని ప్రవేశపెట్టింది.
“ఈరోజు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (NDMA), నేషనల్ సిస్మోలజీ సెంటర్ (NSC)తో సంప్రదించి, మేము భారతదేశంలో Android భూకంప హెచ్చరికల వ్యవస్థను తీసుకురాబోతున్నాం. ఈ ప్రయోగం ద్వారా, మేము Android వినియోగదారులకు భూకంపాలు సంభవించే ముందు ఆటోమేటిక్ గా.. హెచ్చరికలను అందించడానికి ప్రయత్నిస్తున్నాము.” అని గూగుల్ ఒక బ్లాగ్‌లో పేర్కొంది.
ఈ అలర్ట్ సర్వీస్.Android 5 తదుపరి ఆపరేటింగ్ సిస్టమ్ లకు అందుబాటులో ఉంటుంది.
Android Earthquake Alerts System” వచ్చే వారంలో భారతదేశంలోని ఆండ్రాయిడ్ 5+ వినియోగదారులందరికీ అందుబాటులోకి రాబోతోంది” అని బ్లాగ్ పేర్కొంది.
ఈ సిస్టమ్.. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఉండే చిన్న యాక్సిలరోమీటర్ ద్వారా పనిచేస్తుంది. ఇవి మినీ సీస్మోమీటర్‌లుగా పనిచేస్తాయి.
“ఫోన్‌ను ప్లగిన్ చేసి, ఛార్జింగ్ చేసినప్పుడు, అది భూకంపం మొదలయ్యే విషయాన్ని గుర్తించగలదు. చాలా ఫోన్‌లు ఒకే సమయంలో భూకంపం లాంటి ప్రకంపనలను గుర్తిస్తే, భూకంపం సంభవించవచ్చని అంచనా వేయడానికి మా సర్వర్ ఈ సమాచారాన్ని ఉపయోగించవచ్చు. ఈ సమాచారాన్ని విశ్లేషణ చేసి.. భూకంప కేంద్రం, తీవ్రత వంటివి గుర్తిస్తుంది.. అప్పుడు, మా సర్వర్ సమీపంలోని ఫోన్‌లకు హెచ్చరికలను పంపగలదు” అని గూగుల్.. పేర్కొంది.
ఇంటర్నెట్ సిగ్నల్స్ కాంతి వేగంతో ప్రయాణిస్తాయని, భూమిలో భూకంపం వ్యాప్తి చెందడం కంటే చాలా వేగంగా ప్రయాణిస్తుందని, కాబట్టి తీవ్రమైన ప్రకంపనాలను.. చాలా సెకన్ల ముందే గుర్తించి..హెచ్చరికలను ఫోన్‌లకు అందిస్తాయని గూగుల్ తెలిపింది.
“భారతదేశంలో, Google search, మ Maps లో వరదలు, తుఫానుల వంటి ప్రకృతి వైపరీత్యాల గురించి సహాయకర భద్రతా సమాచారాన్ని వినియోగదారులకు అందించడానికి మేము NDMAతో సన్నిహితంగా పని చేస్తున్నాము. NSCతో పాటు NDMAతో మా అనుబంధాన్ని మరింతగా పెంచుకోవడానికి “Android Earthquake Alerts System” ని తీసుకువస్తున్నందుకు మేము గర్విస్తున్నాము, ” అని బ్లాగ్ పేర్కొంది.