Saturday, August 30Thank you for visiting

Andhrapradesh

RTC Special Buses : సంక్రాతికి ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంఫై సర్కారు క్లారిటీ..

RTC Special Buses : సంక్రాతికి ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంఫై సర్కారు క్లారిటీ..

Andhrapradesh, Telangana
సంక్రాంతికి 4484 ప్రత్యేక బస్సులు.. RTC Special Buses: మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో వారి ప్రయాణికుల సంఖ్య  భారీగా పెరిగింది. ఈ క్రమంలోనే పండుగ వేళ టీఎస్ఆర్టీసీ.. ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ (Sankranthi festival) ను పురస్కరించుకొని  ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (TSRTC) ప్రకటించింది. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 7 నుంచి జనవరి 15 వరకు 4484 ప్రత్యేక బస్సులను నడపనున్నారు.ఆన్ లైన్ టికెట్లు (online tickets ) బుక్ చేసుకోవచ్చని కూడా తెలిపింది. అయితే ఈ ప్రత్యేక బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ( RTC Special Buses ) ఉంటుందా?  అని మీకు అనుమానం వచ్చి ఉండొచ్చు. దీనిపై ఆర్టీసీ క్లారిటీ ఇచ్చింది.. సంక్రాంతి పండుగకి నడిచే ప్రత్యేక బస్సుల్లో కూడా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ...
Tirupati Laddu : అయోధ్య రాముడి కోసం తిరుమల శ్రీనివాసుడి ప్రసాదాలు.. లక్ష లడ్డూలు సరఫరా..

Tirupati Laddu : అయోధ్య రాముడి కోసం తిరుమల శ్రీనివాసుడి ప్రసాదాలు.. లక్ష లడ్డూలు సరఫరా..

Andhrapradesh
Tirupati Laddu : అయోధ్య బాలరాముడి కోసం తిరుమల వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాలు వెళుతున్నాయి. ధార్మిక కార్యక్రమాల్లో ముందుండే టీటీడీ.. అయోధ్య రామాలయం కోసం తన వంతు సహకారాన్ని అందిస్తోంది. జనవరి 22న జరిగే అయోధ్య రామ మందిర ప్రతిష్ఠాపనోత్సవం సందర్భంగా.. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుపతి లడ్డూలను భక్తులకు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, పలువురు వీవీఐపీలు హాజరవుతున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. శుక్రవారం తిరుమలలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. జనవరి 22న అయోధ్యకు లక్ష శ్రీవారి లడ్డులు (Tirupati Laddu) పంపిస్తున్నామని తెలిపారు. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ, రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఈ లడ్డూలను ప్రసాదంగా ఇస్తారు. ఒక్కో లడ్డూ బరువు 25 గ్రాములు ఉంటుంది. అయోధ్యలో జరిగే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ప్రారం...
Corona Cases | కరోనా టెర్రర్.. ఒక్కరోజే ఐదు మరణాలు

Corona Cases | కరోనా టెర్రర్.. ఒక్కరోజే ఐదు మరణాలు

Andhrapradesh, Telangana
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య (Corona Cases) రోజురోజుకు భారీగా పెరుగుతోంది.తాజాగా 800 కు చేరువలో కొత్త కేసులు నమోదయ్యాయి.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన గణంకాల ప్రకారం.. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల్లో 798 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి భారత్ లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,091కి చేరింది. ఇక గురువారం ఒక్కరోజే ఐదు గురు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇందులో కేరళలో ఇద్దరు, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరిలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో ఇప్పటివరకు మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,33,351కి చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తికి జేఎన్‌.1 కొత్త వేరియంటే కారణమని తెలుస్తోంది.. తెలంగాణలోనూ కరోనా సమాచారంపై దాపరికం.. తెలంగాణలో కరోనా మహమ్మారి చాప కింద నీరులా వ్యాపిప్తోంది ఇప్పటివరకూ గ్రేటర్ పరిధిలోనే ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇప...
IRCTC Shirdi Tour | విజయవాడ నుంచి షిర్డీ టూర్.. తక్కువ ధరలోనే 4 రోజుల ప్యాకేజీ, బుకింగ్ చేసుకోండి ఇలా..

IRCTC Shirdi Tour | విజయవాడ నుంచి షిర్డీ టూర్.. తక్కువ ధరలోనే 4 రోజుల ప్యాకేజీ, బుకింగ్ చేసుకోండి ఇలా..

Andhrapradesh
IRCTC Shirdi Tour From Vijayawada: పర్యాటక ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ప్రధానంగా అధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్లే వారి కోసం అతితక్కువ ధరలోనే ఆకర్షణీయమైన ప్యాకేజీలను తీసుకొస్తోంది. తాజాగా షిరిడీ సాయిబాబా భక్తుల కోసం శుభవార్త చెప్పింది. విజయవాడ నుంచి షిర్డీ వెళ్లేందుకు రైలు టూర్ ప్యాకేజీ ప్రకటించింది. 'SAI SANNIDHI EX - VIJAYAWADA' పేరుతో ఈ టూర్ ప్యాకేజీని నిర్వహిస్తోంది. మొత్తం 3 రాత్రులు, 4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రతీ మంగళవారం ఈ టూర్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ఈ టూర్ నవంబర్ 1 నుంచి అందుబాటులో ఉంది. ఈ టూర్ ప్యాకేజీలో షిరిడీలో సాయిబాబా దర్శనంతో పాటు శనిశగ్నాపూర్ కూడా కవర్ అవుతుంది. టూర్ షెడ్యూల్ : Day 1: మొదటి రోజు విజయవాడలో ప్రారంభమవుతుంది. రాత్రి 10.15 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్‌లో సాయినగర్ షిరిడీ ఎక్స...
Sabarimala Special Trains | అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్, శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు

Sabarimala Special Trains | అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్, శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు

Andhrapradesh, Telangana
హైదరాబాద్: అయ్యప్ప భక్తులకు దక్షిణమధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల  పుణ్యక్షేత్రానికి (Sabarimala) ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. శబరిమలకు మొత్తం 22 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. సికింద్రాబాద్‌- కొల్లం, కొల్లం-సికింద్రాబాద్, కాచిగూడ-కొల్లం, కాకినాడ టౌన్‌ -కొట్టాయం, నర్సాపుర్-కొట్టాయం మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్‌ ఏసీ, సెకండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీతో పాటు స్లీపర్‌, సెకండ్‌ క్లాస్‌ కోచ్ లు అందుబాటులో ఉన్నాయని రైల్వే అధికారులు వెల్లడించారు. Sabarimala ప్రత్యేక రైళ్ల వివరాలు సికింద్రాబాద్-కొల్లం-సికింద్రాబాద్ (07129,07130) ప్రత్యేక రైళ్లు - నవంబరు 26, డిసెంబరు 3న, తిరుగుప్రయాణం - నవంబరు 28, డిసెంబర్ 5న ఉంటుంది. నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గు...
ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. భారీగా దసరా సెలవులు

ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. భారీగా దసరా సెలవులు

Andhrapradesh, Telangana
AP TS Dasara Holidays తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించారు. ఏపీలో 11 రోజులు, తెలంగాణ లో 13 రోజులు దసరా హాలిడేస్ అని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.AP TS Dasara Holidays : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్కూళ్లకు ప్రభుత్వాలు దసరా సెలవులు ప్రకటించాయి. తెలంగాణలో ఈ ఏడాది 13 రోజులు దసరా సెలవులు ప్రకటించారు. అక్టోబర్ 13 నుంచి 25 వరకు దసరా సెలవులుగా రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అక్టోబరు 26న తిరిగి స్కూళ్ల పునఃప్రారంభం కానున్నాయని విద్యాశాఖ అధికాలు వెల్లడించారు.. తెలంగాణలో దసరా, బతుకమ్మ పండుగలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈనేపథ్యంలోనే పాఠశాలలు, కాలేజీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే సెలవులు ప్రక‌టించింది. అక్టోబరులో సాధారణంగా సెలవులు ఎక్కువగా ఉంటాయి. 13 రోజులు సెలవులు తెలంగాణలో బతుకమ్మ, దసరా ( విజయదశమి) పండుగలకు సెలవులు మొత్తం 13 రోజులు ఉన్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్...
Inner Ringroad Case : గురి.. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో ఏ14గా నారాలోకేష్

Inner Ringroad Case : గురి.. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో ఏ14గా నారాలోకేష్

Andhrapradesh
Inner Ringroad Case: తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్ మార్పు వ్యవహారంలో లోకేష్ ప్రమేయం ఉందనే ఆరోపణలతో ఏపీ సిఐడి నిందితుడిగా చేర్చడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. Nara lokesh In Inner Ringroad Case: ఆంధ్రప్రదేశ్ అమరావతి (Amravathi) ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14 గా నారా లోకేశ్ (Nara Lokesh))  పేరును చేర్చింది. ఈమేరకు నారా లోకేశ్ పేరును చేరుస్తూ ఏసీబీ కోర్టులో మెమో దాఖలైంది. ఈ కేసులో మాజీ మంత్రి నారాయణ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తమ వ్యక్తిగత ఆస్తుల విలువను పెంచుకోడానికి ఇన్నర్‌ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్లను మార్చారని సిఐడి(CID) ఆరోపణలు చేస్తోంది.సింగపూర్‌ కన్సల్టెన్సీకి మాస్టర్‌ ప్లాన్ తయారు చేసే బాధ్యతలను అప్పగించి, అందులో నిబంధనలను తమకు అనుగుణంగా మార్చుకున్నారని సీఐడీ అభియో...
Pawan Kalyan : అనుమంచిపల్లిలో పవన్ కళ్యాణ్ అరెస్ట్ !

Pawan Kalyan : అనుమంచిపల్లిలో పవన్ కళ్యాణ్ అరెస్ట్ !

Andhrapradesh
 Pawan Kalyan : విజయవాడ-హైదరాబాద్ రహదారిపై హైటెన్షన్ నెలకొంది. అనుమంచిపల్లిలో జనసేనాని పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ను..  ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ని అడ్డుకునేం దుకు జగ్గయ్యపేట సమీపంలోని గరికపాడు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో ఆగ్రహించిన జనసైనికులు వాటిని తొలగించారు. దీంతో వారిపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనతో విజయవాడ-హైదరాబాద్ పై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.ఇదిలా ఉంటే.. అనుమంచిపల్లి సమీపంలో మరోసారి పవన్ కళ్యాణ్ వాహనాన్ని ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ తోపాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వాహనంలో తీసుకు వెళ్తున్నారు. అయితే వారిని...
చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురి మృతి..

చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురి మృతి..

Andhrapradesh, Crime
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. చెన్నై-తిరుపతి వెళ్లే జాతీయ రహదారిపై వడమాలపేట చెక్ పోస్టు వద్ద దగ్గర రోడ్డు మార్జిన్లను మార్కింగ్‌ చేస్తున్న వాహనాన్ని అతివేగంగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చెక్ పోస్టు సమీపంలో కొత్తగా నిర్మించిన జాతీయ రహదారిపై మార్కింగ్‌ చేసేందుకు జాతీయ రహదారుల నిర్మాణ సంస్థకు చెందిన మార్కింగ్ వాహనం నిలిపి వుంచారు. రోడ్డు మార్జిన్లను గుర్తించే తెలుపు రంగు వేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. హైవే నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికులు తమ వాహనాన్ని రోడ్డు పక్కన ఉంచి పనులు చేసుకుంటున్నారు. అతివేగంతో వచ్చిన లారీ ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో ఆ వాహనం రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఇదే రోడ్డుపై వస్తున్న కారు వేగాన్ని అదుపు చేయలేక లారీని ఢీకొట్టడంతో కారులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు మృతిచెందారు. ప్రమాదా...
గోవింద నామాన్ని కోటి సార్లు రాస్తే వీఐపీ దర్శనం… టీటీడీ పాలక మండలి నిర్ణయాలు ఇవీ..

గోవింద నామాన్ని కోటి సార్లు రాస్తే వీఐపీ దర్శనం… టీటీడీ పాలక మండలి నిర్ణయాలు ఇవీ..

Andhrapradesh
TTD Trust Board Meeting : యువ‌తీయువకుల్లో హైంద‌వ స‌నాత‌న ధ‌ర్మ వ్యాప్తి కోసం శ్రీ‌వారి ఆల‌యం నుంచి తొలి అడుగు వేస్తున్నామ‌ని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. ఇందులోభాగంగా రామ‌కోటి త‌ర‌హాలో గోవింద కోటి రాసిన 25 ఏళ్ల లోపు యవతకు వారి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఒక‌సారి తిరుమ‌ల స్వామి వారి బ్రే క్ ద‌ర్శ‌నం క‌ల్పిస్తామ‌ని వెల్ల‌డించారు. 10 ల‌క్ష‌లా 1,116 సార్లు గోవింద నామాలు రాసిన‌వారికి ద‌ర్శ‌న భాగ్యం క‌ల్పిస్తామ‌ని తెలిపారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో మంగ‌ళ‌ వారం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి మొదటి స‌మావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా సమావేశలో తీసుకున్న కీలక నిర్ణ‌యాల‌ను ఛైర్మ‌న్ మీడియాకు వెల్లడించారు.– స‌నాత‌న ధ‌ర్మం, మాన‌వీయ, నైతిక విలువ‌లపై అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఎల్‌కేజీ నుంచి పీజీ వ‌ర‌కు విద్యార్థుల‌కు సుల‌భంగా అర్థ‌మ‌య్యేలా 20పేజీల్లో భ‌గ‌వ‌ద్గీత సారాంశాన్న...