Saturday, August 30Thank you for visiting

Andhrapradesh

Amaravati Railway line | అమరావతి రైల్వే లైన్‌కు ప‌చ్చ‌జెండా.. కేంద్ర మంత్రివర్గం ఆమోదం

Amaravati Railway line | అమరావతి రైల్వే లైన్‌కు ప‌చ్చ‌జెండా.. కేంద్ర మంత్రివర్గం ఆమోదం

Andhrapradesh
Amaravati Railway line : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, బీహార్‌ రాష్ట్రాల్లోని పలు కీలక ప్రాంతాలను కలుపుతూ మొత్తం రూ.6,798 కోట్లతో రెండు రైలు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. బీహార్‌లోని నార్కతియాగంజ్-రక్సాల్-సీతామర్హి-దర్భంగా రైల్వే లైన్ డ‌బ్లింగ్‌, సీతామర్హి-ముజఫర్‌పూర్ సెక్షన్లలో 256 కి.మీ మేర డబ్లింగ్ తోపాటు అమరావతి మీదుగా ఎర్రుపాలెం-నంబూరు మధ్య కొత్త లైన్‌ను నిర్మించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. కీలక ప్రాంతాల్లో కొత్తగా రైలు కనెక్టివిటీ ఈ రెండు ప్రాజెక్టులు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోని కీలక ప్రాంతాలకు రైల్వే క‌నెక్టివిటీని అందిస్తాయి. ముఖ్యంగా నర్కతియాగంజ్-రక్సాల్-సీతామర్హి-దర్భంగా రైల్వేలైన్‌, సీతామర్హి-ముజఫర్‌పూర్ రైల్వే లైన్ల‌ డ‌బ్లింగ్ పూర్తియితే నేపాల్, ఈశాన్య భారతదేశ సరిహద్దు ...
MMTS Trains |  ర‌ద్ద‌యిన ఎంఎంటీఎస్ రైళ్ల పున‌రుద్ధ‌రణ‌

MMTS Trains | ర‌ద్ద‌యిన ఎంఎంటీఎస్ రైళ్ల పున‌రుద్ధ‌రణ‌

Andhrapradesh, Telangana
హైదరాబాద్ : గతంలో రద్దు చేసిన కొన్ని MMTS సర్వీసులు ఇప్పుడు అక్టోబరు 23, నవంబర్ 31 మధ్య యథావిధిగా నడుస్తాయి. పునరుద్ధరించిన‌రైలు సర్వీసులు ఇవీ..మేడ్చల్ - లింగంపల్లి (47222), లింగంపల్లి - మేడ్చల్ (47225), మేడ్చల్ - సికింద్రాబాద్ (47228) మరియు సికింద్రాబాద్ - మేడ్చల్ (47229).వెయిటింగ్ లిస్ట్ ప్ర‌యాణికుల కోసం అద‌న‌పు కోచ్ లు.. అక్టోబర్ 23 నుంచి నవంబర్ 23 వరకు వివిధ గమ్యస్థానాలకు ప్రయాణించే వెయిట్‌లిస్ట్‌లో ఉన్న ప్రయాణీకుల కోసం దక్షిణ మధ్య రైల్వే (SCR) రైళ్లకు అదనపు జనరల్ కోచ్‌లను జోడించింది. తాత్కాలిక అదనపు కోచ్‌లు ఉన్న రైళ్ల జాబితా ఇదీ..విజయవాడ - గుంటూరు (ట్రైన్ నెం-07783), గుంటూరు - విజయవాడ (ట్రైన్ నెం-07788), నడికుడి - మాచర్ల (ట్రైన్ నెం-07579), మాచర్ల - నడికుడే (ట్రైన్ నెం-07580), గుంటూరు-మాచర్ల (ట్రైన్ నెం-07779) మాచర్ల-గుంటూరు (ట్రైన్ నెం-0...
Rain Alert | రాష్ట్రానికి నాలుగు రోజులు వ‌ర్షాలు !

Rain Alert | రాష్ట్రానికి నాలుగు రోజులు వ‌ర్షాలు !

Andhrapradesh, Telangana
Hyderabad Rain Alert | రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. ఉత్తర తమిళనాడు తీరప్రాంతాన్ని ఆనుకొని ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతుందని తెలిపింది. .మరో ఆవర్తనం అండమాన్‌ సముద్రంలో సముద్ర మట్టానికి రూ.5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉందని పేర్కొంది. సోమవారం నాటికి అల్పపీడనంగా బలపడే చాన్స్ ఉందని.. ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తూ 23న వాయు గుండంగా తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని తెలిపింది.ఇక ఆదివారం ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్‌, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే చాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. , సోమ, మంగళవారాల్లోనూ పలు జిల్లా...
AP Cyclone Alert | ముంచుకొస్తున్న ముప్పు.. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం

AP Cyclone Alert | ముంచుకొస్తున్న ముప్పు.. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం

Andhrapradesh
AP Cyclone Alert | ఏపీకి మళ్లీ వర్షాల ముప్పు ముంచుకొస్తోంది. దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చి మ వాయువ్య దిశగా పయనిస్తూ బ‌ల‌ప‌డి తీవ్రరూపం దాల్చి వాయుగుండంగా మారింది. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడుకు తూర్పు–ఆగ్నేయంగా 490 కిలోమీట‌ర్లు, పుదుచ్చేరికి తూర్పు–ఆగ్నేయంగా 500 కిలోమీట‌ర్లు నెల్లూరుకు ఆగ్నేయంగా 590 కి.మీ.దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. ఇది ఈ నెల 17న తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పశ్చిమ–వాయువ్య దిశగా ప‌య‌నించి ఉత్తర తమిళనాడు–దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరాలను పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశముంద‌ని వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. దీని కార‌ణంగా నెల్లూరు, ప్రకాశం, తిరుపతి జిల్లాల్లో రానున్న మూడు రోజులు ఈ మూడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ...
TCS in Vizag : విశాఖలో టీసీఎస్ ద్వారా యువతకు 10 వేల ఉద్యోగాలు

TCS in Vizag : విశాఖలో టీసీఎస్ ద్వారా యువతకు 10 వేల ఉద్యోగాలు

Andhrapradesh
TCS to open its office in Visakhapatnam | విశాఖ సాగ‌ర‌తీరంలో టాటా క‌న్సల్టెన్సీ స‌ర్వీస్ ( TCS in Vizag) 10వేల మంది యువ‌త‌కు మెరుగైన జీత‌భ‌త్యాలతో ఉద్యోగాలు ల‌భించ‌నున్నాయి. యువ‌నేత నారా లోకేష్ (Nara Lokesh) గ‌తంలో ఇచ్చిన మాట ప్ర‌కారం.. ఏపీకి ప్రఖ్యాత ఐటీ కంపెనీలు ర‌ప్పించి యువ‌త‌కు ఉద్యోగాలిప్పిస్తాన‌ని ఇచ్చిన మాట నెర‌వేర్చే దిశ‌గా య‌త్నాలను ముమ్మ‌రం చేశారు. ఈమేర‌కు తాజాగా టాటా గ్రూపు చైర్మన్‌, సంస్థ ప్ర‌తినిధుల‌ను ఒప్పించి విశాఖ‌కు టీసీఎస్ ని తీసుకొచ్చారు. ముంబై మ‌హాన‌గ‌రంలోని టాటా స‌న్స్ ఆఫీస్ బాంబే హౌస్ లో టాటా స‌న్స్ చైర్మన్ ఎం.చంద్రశేఖ‌ర‌న్‌తో మంగ‌ళ‌వారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఐటీ, ఎల‌క్ట్రానిక్స్, మాన‌వ‌వ‌న‌రుల శాఖ మంత్రి నారా లోకేష్ స‌మావేశ‌మ‌య్యారు. ఈ భేటీలో సీఎంవో అడిష‌నల్ సెక్రట‌రీ కార్తికేయ మిశ్రా, టాటా గ్రూప్ అధికారులు హాజ‌ర‌య్యారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం క‌ల్పిస్తున్న సౌక‌ర్యాలు,...
Rains | రాష్ట్రంలో మూడురోజులు వర్షాలు.. 15 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌

Rains | రాష్ట్రంలో మూడురోజులు వర్షాలు.. 15 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌

Andhrapradesh
Rains | వరుణుడు మరోసారి తెలుగు రాష్ట్రాలను ప‌ల‌క‌రించ‌నున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైద‌రాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. నైరుతి బంగ్లాదేశ్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతం, బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్‌కు చేరువగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం వెస్ట్‌ బెంగాల్‌తో పాటుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో  (AP, TG Rains) మరో 4 రోజుల పాటు ఉంటుందని అంచనా వేసింది. రానున్న 4 రోజులు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని, రాయలసీమ ప్రాంతంలో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో రాయలసీమ జిల్లాలకు ఐఎండీ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.ఇక తెలంగాణ రాష్ట్రంలో లో రానున్న మూడు రోజుల పాటు తేలిక...
పండుగ వేళ ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్.. తిరుపతి వెళ్లే ప‌లు రైళ్ల‌కు అద‌న‌పు కోచ్ లు

పండుగ వేళ ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్.. తిరుపతి వెళ్లే ప‌లు రైళ్ల‌కు అద‌న‌పు కోచ్ లు

Andhrapradesh
South Central Railway | ప్ర‌యాణ‌కుల‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ సీజ‌న్ ను దృష్టిలో పెట్టుకొని ప‌లు కీల‌క మార్గాల్లో ప్ర‌యాణించే రైళ్ల‌కు అద‌న‌పు కోచ్ ల‌ను జోడించ‌నున్న ట్లు ప్ర‌క‌టించింది. దక్షిణ మధ్య రైల్వే చెన్నై-తిరుపతి మార్గం (Tirupati Trians) లో పలు రైళ్లకు అద‌నంగా కోచ్ ల‌ను జ‌త‌చేసింది. ఇది అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 16, 2024 వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. పండుగ వేళ ప్ర‌యాణికుల కు తాజా నిర్ణ‌యం కాస్త ఉప‌శ‌మ‌నం క‌లిగించ‌నుంది. ఈ రైళ్ల‌కు ఆద‌న‌పు కోచ్ లుTirupati Trians : రైలు నం. 16057: డాక్టర్ MGR చెన్నై సెంట్రల్ - తిరుపతి సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌లో ఒక జనరల్ సెకండ్ క్లాస్ కోచ్, ఒక చైర్ కార్ జోడించనున్నారు. ఇది అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 15, 2024 వరకు అమలులో ఉంటుంది. రైలు నెం. 16058: తిరుపతి - డాక్ట‌ర్‌ MGR చెన్నై సెంట్రల్ సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌లో ఇవే తేదీలల...
Subsidary Groceries | రేషన్ కార్డుదారులకు తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర

Subsidary Groceries | రేషన్ కార్డుదారులకు తక్కువ ధరకే కందిపప్పు, చక్కెర

Andhrapradesh
Subsidary Groceries To Ration Card Holders : రేషన్ కార్డుదారులకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం తీపిక‌బురు చెప్పింది. సబ్సిడీ ధరపై కందిపప్పు, చెక్క‌ర‌ను అందించనుంది. గుంటూరు జిల్లా (Guntur District) తెనాలి పట్టణంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) సబ్సిడీపై రేష‌న్‌ కార్డుదారులకు కిలో కందిపప్పు, అరకిలో పంచదార పంపిణీ చేశారు. అక్టోబ‌ర్ నుంచి ఒక్కో కార్డుదారుడికి రూ. 67ల‌కు కిలో కందిపప్పు, రూ.17కు అరకేజీ పంచ‌దార‌ పంపిణీ చేయ‌నున్న‌ట్లు మంత్రి మ‌నోహర్‌ తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచన మేరకు పేద‌ల‌కు సబ్సిడీ ధ‌ర‌కు కందిప‌ప్పు చెక్క‌ర అందిస్తున్నామ‌ని చెప్పారు. కాగా, బ‌య‌ట మార్కెట్‌లో కందిపప్పు క్వాలిటీని బట్టి ప్ర‌స్తుతం రూ.160, రూ.170 ఉండగా.. కిలో చెక్కెర‌ ధర రూ.45కి పైగా ఉంది.1 KG కందిపప్పు రూ.67 1/2 KG పంచదార రూ.17. నేటి నుంచి 1.48 కోట్...
Flood Relief Funds | తెలుగు రాష్ట్రాలకు వరద సాయం ప్రకటించిన కేంద్రం..

Flood Relief Funds | తెలుగు రాష్ట్రాలకు వరద సాయం ప్రకటించిన కేంద్రం..

Andhrapradesh
Flood Relief Funds | న్యూఢిల్లీ: దేశంలో వరద ప్రభావిత 14 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తక్షణ సహాయక నిధులను మంగళవారం విడుదల చేసింది. ఈమేరకు రూ.5,858 కోట్ల నిధులను విడుదల చేసినట్లు కేంద్ర హోం శాఖ (MHA)  అధికార ప్రకటనలో పేర్కొంది.  రాష్ట్ర విపత్తు సహాయనిధి (SDRF) కి కేంద్ర వాటాగా జాతీయ విపత్తు సహాయ నిధి (NDRF) నుంచి ఈ నిధులను విడుదల చేస్తున్నట్టు పేర్కొంది. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి వరద సహాయ నిధిగా రూ.416.80 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌కు రూ.1,036 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.ఇక మహారాష్ట్రకు రూ.1,491 కోట్లు, అస్సాంకు రూ.716 కోట్లు, బీహార్‌కు రూ.655.60 కోట్లు, హిమాచల్ ప్రదేశ్‌కు రూ.189.20 కోట్లు, కేరళకు రూ.145.60 కోట్లు, మణిపూర్‌కు రూ.50 కోట్లు,మిజోరాంకు రూ.21.60 కోట్లు, నాగాలాండ్‌కు రూ.19.20 కోట్లు, సిక్కింకు రూ.23.60 కోట్లు, త్రిపురకు రూ.25 కోట్లు, గుజరాత్‌కు రూ.600 కోట్లు, పశ్చిమబెం...
AP Free Gas Cylinder Scheme | ఉచిత గ్యాస్ సిలండ‌ర్లపై ఏపీ స‌ర్కారు క‌స‌ర‌త్తు..

AP Free Gas Cylinder Scheme | ఉచిత గ్యాస్ సిలండ‌ర్లపై ఏపీ స‌ర్కారు క‌స‌ర‌త్తు..

Andhrapradesh
AP Free Gas Cylinder Scheme : ఉచిత గ్యాస్ సిలిండర్ల‌ను అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు మొద‌లుపెట్టింది. దీపావళి నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించడంతో వెంట‌నే పౌరసరఫరాల శాఖ రంగంలోకి దిగింది. రాష్ట్రంలో 1.55 కోట్ల గృహ వినియోగ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో తెల్లకార్డు ఆధారంగా తీసుకొంటే 1.47 కోట్ల కుటుంబాలకు ఉచిత సిలిండ‌ర్ ను అందించాల్సి ఉంటుంది. వీరందరికీ ఏడాదికి 3 సిలిండర్లను ఉచితంగా ఇవ్వడానికి సుమారు రూ.3,640 కోట్ల వ‌ర‌కు ఖర్చవుతుంది. దీపం, ఉజ్వల, ఇతర రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద గ్యాస్‌ కనెక్షన్లు తీసుకున్న 75 లక్షల మందికి ఈ పథకాన్ని వ‌ర్తింప‌జేస్తే.. ఏడాదికి 1,763 కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు.. అయితే ఈ ప‌థ‌కాన్ని ఇతర రాష్ట్రాల్లో ఎలా అమలు చేస్తున్నారనే వివరాలతో పౌరసరఫరాల శాఖ నివేదికను రూపొందించి ప్ర‌భుత్వానికి సమ‌ర్పించ...