Wednesday, April 16Welcome to Vandebhaarath

Andhrapradesh

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చంపేస్తామ‌ని బెదిరింపు కాల్..
Andhrapradesh

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను చంపేస్తామ‌ని బెదిరింపు కాల్..

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జ‌న సేన పార్టీ అధ్యక్షుడు ప‌వ‌న్‌క‌ళ్యానణ్ కు సోమవారం సాయంత్రం ఆయన కార్యాలయానికి హత్య బెదిరింపు కాల్ (Death threat) వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. అజ్ఞాత వ్యక్తి ఉపముఖ్యమంత్రిని ఉద్దేశించి అభ్యంతరకరమైన పదజాలంతో సందేశాలు కూడా పంపాడు. ఘటన జరిగిన వెంటనే కార్యాల‌య‌ సిబ్బంది వెంట‌నే పోలీసు అధికారులకు సమాచారం అందించారు.(more…)...
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ .. కొత్తగా కేంద్రీయ, నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..
Andhrapradesh, National

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ .. కొత్తగా కేంద్రీయ, నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..

Navodaya Vidyalaya | తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాలు( Kendriya Vidyalaya), నవోదయ విద్యాలయాలు(Navodaya Vidyalaya) ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఈమేర‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వివరించారు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాల మంజూరులో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట వేసింది. తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో 8 కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించనుంది. తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాలు తెలంగాణకు కొత్తగా 7 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది. నిజామాబాద్‌, జగిత్యాల, కొత్తగూడెం, మేడ్చల్‌, మహబూబ్‌నగర్‌, సంగారెడ్డ...
విశాఖ, విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టులపై కదలిక..
Andhrapradesh

విశాఖ, విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టులపై కదలిక..

Visakha Metro Rail | ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని ప్ర‌ధాన న‌గ‌రాలైన‌ విశాఖ, విజయవాడలో మెట్రో రైలు ప్రాజెక్టులపై కీల‌క అప్ డేట్‌.. వచ్చింది. మెట్రో లైన్‌ నిర్మాణానికి సంబంధించిన మొద‌టి దశ డీపీఆర్‌లను చంద్ర‌బాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. విశాఖలో మొద‌టి విడ‌తో 46.23 కి.మీల మేర మూడు కారిడార్లు నిర్మించాలని భావిస్తోంది.మొద‌టి కారిడార్ : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నుంచి కొమ్మాది వరకు (34.4కి.మీ) రెండో కారిడార్ : గురుద్వార్‌ నుంచి పాత పోస్ట్‌ఆఫీస్‌ వరకు (5.08కి.మీ) మూడో కారిడార్ :తాటిచెట్ల పాలెం నుంచి చినవాల్తేరు వరకు (6.75కి.మీ)కాగా Visakha Metro Rail తొలి విడత ప్రాజెక్టుకు సుమారు రూ. 11,498 కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌ని ఏపీ స‌ర్కారు అంచనా వేస్తోంది. విశాఖలోని తొలి ద‌శ ప్రాజెక్టు నిర్మాణం పూర్త‌యిన తర్వాత మెట్రో రైల్‌ ప్రాజెక్టు రెండో విడత కింద కొమ్మాది నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్ వ...
ISKCON పూజారి చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్టుపై స్పందించిన పవన్ కళ్యాణ్..
Andhrapradesh, Trending News

ISKCON పూజారి చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్టుపై స్పందించిన పవన్ కళ్యాణ్..

Bangladesh Violence | బంగ్లాదేశ్ లో హిందువులపై హింస, ఇస్కాన్‌ పూజారి చిన్మోయ్ కృష్ణ దాస్ (Chinmoy Krishna Das) అరెస్టు చేసిన ఘటనపై ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. చిన్మోయ్ అరెస్టును ఖండించారు. హిందువులందరూ ఐక్యంగా ఉండాల‌ని పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలను ఆపేందుకు చర్యలు తీసుకోవాలని బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్ర‌ధాని ముహమ్మద్ యూనస్‌ను కోరారు.ఇస్కాన్ బంగ్లాదేశ్ పూజారి చిన్మోయ్ కృష్ణ దాస్‌ను బంగ్లాదేశ్ పోలీసులు నిర్బంధించడాన్ని మనం అందరం కలిసి ఖండిద్దాం. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని (ప్రభుత్వం) హిందువులపై అఘాయిత్యాలను ఆపాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం, అని కళ్యాణ్ ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. బంగ్లాదేశ్ ఏర్పాటులో భారత సైన్యం చేసిన త్యాగాలను ఆయన గుర్తు చేసుకున్నారు.బంగ్లాదేశ్ ఏర్పాటు కోసం భా...
TTD:  తిరుమలలో హిందూయేతర ఉద్యోగులకు షాక్‌..
Andhrapradesh

TTD: తిరుమలలో హిందూయేతర ఉద్యోగులకు షాక్‌..

TTD Non-Hindu Employees | ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన హిందూ దేవాలయంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో హిందూయేతర ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ లేదా ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలనే తీర్మానాన్ని ఆమోదించింది.ఈ నిర్ణ‌యంతో ఎంత‌ హిందూయేతర సిబ్బందిపై ప్ర‌భావం ప‌డుతుందో తెలియ‌దు..అయితే 7,000 మంది శాశ్వత ఉద్యోగులలో 300 మందిపై ప్రభావం చూపే అవకాశం ఉందని స‌మాచారం. మ‌రోవైపు TTD లో సుమారు 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ప‌నిచేస్తున్నారు. వీరిలో కూడా కొందరు ప్రభావితం కావచ్చు. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్స్ చట్టం, TTD చట్టానికి అనుగుణంగా ఉందని ప‌లువురు టీటీడి ఉద్యోగులు చెబుతున్నారు. ఓ యూనియన్‌కు చెందిన ప్రతినిధి మాట్లాడుతూ, "ఈ నిర్ణయాన్ని సంపూర్ణంగా అమలు చేయాల‌ని కోరారు. అక్టోబర్ 31న అధికారం చేపట్టిన TTD ఛైర్మన్ నాయుడు (TTD Chairman B.R. Naidu )  దేవాలయాన్ని నడిపేంద...
Rains | ఏపీ, తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు
Andhrapradesh, Telangana

Rains | ఏపీ, తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు

బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్రరూపం దాల్చుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వెంట ఈ వాయుగుండం కేంద్రీకృతమై  ఉందని తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తో పాటు ,తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు పలు జిల్లాల్లో నేడు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. నేడు రాష్ట్రంలో పగటి పూట వాతావరణం పొడిగా ఉంటుందని.. సాయంత్రానికి వాతావరణం చల్లబడి పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఇక అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నేడు, రేపు కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయన్నారు. అల్పపీడనం క్రమంగా పశ్చిమ దిశగా కదులుతూ నైరుతి దానిని ఆనుకుని పశ్చిమ మధ్య బ...
AP Budget 2024 | ఏపీ బడ్జెట్..  శాఖల వారీగా కేటాయింపులు ఇవి :
Andhrapradesh

AP Budget 2024 | ఏపీ బడ్జెట్.. శాఖల వారీగా కేటాయింపులు ఇవి :

Andhra Pradesh Budget 2024-25: ఏపీ ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2024-25 సంవత్సరానికి గానూ రూ.2.94 లక్షల కోట్ల ప్రతిపాదనతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలుపగా.. సోమవారం ఉదయం ప్రారంభమైందిన అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ స్వరూపం ఇదీ..వార్షిక బడ్జెట్ : రూ. 2.94. లక్షల కోట్లు వ్యవసాయ బడ్జెట్ : రూ. 43,402.33 కోట్లు రెవెన్యూ వ్యయం అంచనా : రూ.2.34 లక్షల కోట్లు. మూలధన వ్యయం అంచనా రూ.32,712 కోట్లు. రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు. ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు. జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు అంచనా 4.19 శాతం. జీఎస్‌డీపీలో ద్రవ్య లోటు అంచనా 2.12 శాతం.శాఖల వారీగా పూర్తి కేటాయింపులివే..రూ. 2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్. రూ. 4,3...
TTD Chairman Members | టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు.. పాలక మండలి సభ్యుల వివరాలు ఇవీ..
Andhrapradesh

TTD Chairman Members | టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు.. పాలక మండలి సభ్యుల వివరాలు ఇవీ..

TTD Chairman Members  | తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలక మండలి నూతన ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియమితులయ్యారు. 24 మంది సభ్యులతో  టీటీడీ పాలకమండలి కొలువుదీరనుంది.ఈ మేరకు టీటీటీ బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. టీటీడీ బోర్డు సభ్యులు వీరే..జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట ఎమ్మెల్యే) వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి (కోవూరు ఎమ్మెల్యే) ఎం.ఎస్‌ రాజు (మడకశిర ఎమ్మెల్యే) పనబాక లక్ష్మి (కేంద్ర మాజీ మంత్రి) జాస్తి పూర్ణ సాంబశివరావు నన్నూరి నర్సిరెడ్డి (తెలంగాణ) బూంగునూరు మహేందర్‌ రెడ్డి (తెలంగాణ) శ్రీసదాశివరావు నన్నపనేని కృష్ణమూర్తి ( తమిళనాడు) కోటేశ్వరరావు మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌ జంగా కృష్ణమూర్తి దర్శన్‌. ఆర్‌.ఎన్‌ (కర్ణాటక) జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్‌ (కర్ణాటక) శాంతారామ్‌ పి.రామ్మూర్తి (తమిళనాడు) జానకీ దేవి తమ్మిశెట్టి అనుగోలు రంగశ్రీ (తెలంగాణ) బ...
Amaravati Railway line | అమరావతి రైల్వే లైన్‌కు ప‌చ్చ‌జెండా.. కేంద్ర మంత్రివర్గం ఆమోదం
Andhrapradesh

Amaravati Railway line | అమరావతి రైల్వే లైన్‌కు ప‌చ్చ‌జెండా.. కేంద్ర మంత్రివర్గం ఆమోదం

Amaravati Railway line : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, బీహార్‌ రాష్ట్రాల్లోని పలు కీలక ప్రాంతాలను కలుపుతూ మొత్తం రూ.6,798 కోట్లతో రెండు రైలు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. బీహార్‌లోని నార్కతియాగంజ్-రక్సాల్-సీతామర్హి-దర్భంగా రైల్వే లైన్ డ‌బ్లింగ్‌, సీతామర్హి-ముజఫర్‌పూర్ సెక్షన్లలో 256 కి.మీ మేర డబ్లింగ్ తోపాటు అమరావతి మీదుగా ఎర్రుపాలెం-నంబూరు మధ్య కొత్త లైన్‌ను నిర్మించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. కీలక ప్రాంతాల్లో కొత్తగా రైలు కనెక్టివిటీ ఈ రెండు ప్రాజెక్టులు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోని కీలక ప్రాంతాలకు రైల్వే క‌నెక్టివిటీని అందిస్తాయి. ముఖ్యంగా నర్కతియాగంజ్-రక్సాల్-సీతామర్హి-దర్భంగా రైల్వేలైన్‌, సీతామర్హి-ముజఫర్‌పూర్ రైల్వే లైన్ల‌ డ‌బ్లింగ్ పూర్తియితే నేపాల్, ఈశాన్య భారతదేశ సరిహద్దు ...
MMTS Trains |  ర‌ద్ద‌యిన ఎంఎంటీఎస్ రైళ్ల పున‌రుద్ధ‌రణ‌
Andhrapradesh, Telangana

MMTS Trains | ర‌ద్ద‌యిన ఎంఎంటీఎస్ రైళ్ల పున‌రుద్ధ‌రణ‌

హైదరాబాద్ : గతంలో రద్దు చేసిన కొన్ని MMTS సర్వీసులు ఇప్పుడు అక్టోబరు 23, నవంబర్ 31 మధ్య యథావిధిగా నడుస్తాయి. పునరుద్ధరించిన‌రైలు సర్వీసులు ఇవీ..మేడ్చల్ - లింగంపల్లి (47222), లింగంపల్లి - మేడ్చల్ (47225), మేడ్చల్ - సికింద్రాబాద్ (47228) మరియు సికింద్రాబాద్ - మేడ్చల్ (47229).వెయిటింగ్ లిస్ట్ ప్ర‌యాణికుల కోసం అద‌న‌పు కోచ్ లు.. అక్టోబర్ 23 నుంచి నవంబర్ 23 వరకు వివిధ గమ్యస్థానాలకు ప్రయాణించే వెయిట్‌లిస్ట్‌లో ఉన్న ప్రయాణీకుల కోసం దక్షిణ మధ్య రైల్వే (SCR) రైళ్లకు అదనపు జనరల్ కోచ్‌లను జోడించింది. తాత్కాలిక అదనపు కోచ్‌లు ఉన్న రైళ్ల జాబితా ఇదీ..విజయవాడ - గుంటూరు (ట్రైన్ నెం-07783), గుంటూరు - విజయవాడ (ట్రైన్ నెం-07788), నడికుడి - మాచర్ల (ట్రైన్ నెం-07579), మాచర్ల - నడికుడే (ట్రైన్ నెం-07580), గుంటూరు-మాచర్ల (ట్రైన్ నెం-07779) మాచర్ల-గుంటూరు (ట్రైన్ నెం-0...