Sunday, April 12, 2026
Andhrapradesh

AP Budget 2024 | ఏపీ బడ్జెట్.. శాఖల వారీగా కేటాయింపులు ఇవి :

Spread the love

Andhra Pradesh Budget 2024-25: ఏపీ ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2024-25 సంవత్సరానికి గానూ రూ.2.94 లక్షల కోట్ల ప్రతిపాదనతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలుపగా.. సోమవారం ఉదయం ప్రారంభమైందిన అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

రాష్ట్ర బడ్జెట్ స్వరూపం ఇదీ..

  • వార్షిక బడ్జెట్ : రూ. 2.94. లక్షల కోట్లు
  • వ్యవసాయ బడ్జెట్ : రూ. 43,402.33 కోట్లు
  • రెవెన్యూ వ్యయం అంచనా : రూ.2.34 లక్షల కోట్లు.
  • మూలధన వ్యయం అంచనా రూ.32,712 కోట్లు.
  • రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు.
  • ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు.
  • జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు అంచనా 4.19 శాతం.
    జీఎస్‌డీపీలో ద్రవ్య లోటు అంచనా 2.12 శాతం.

శాఖల వారీగా పూర్తి కేటాయింపులివే..

  • రూ. 2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్.
  • రూ. 4,3402.33 కోట్లు వ్యవసాయ బడ్జెట్
  • సంక్షేమం రూ.4,376 కోట్లు
  • మహిళ, శిశు సంక్షేమం రూ. 4,285కోట్లు
  • మానవ వనరుల అభివృద్ధి రూ. 1,215కోట్లు
  • పాఠశాల విద్య రూ. 29,909కోట్లు
  • ఉన్నత విద్యకు 2,326 కోట్లు
  • ఆరోగ్య రంగానికి రూ. 18,421కోట్లు
  • పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ధి రూ. 16,739 కోట్లు
  • పట్టణాభివృద్ధి రూ. 11,490 కోట్లు
  • గృహ నిర్మాణం రూ. 4,012 కోట్లు
  • జలవనరులు రూ. 16,705 కోట్లు
  • పరిశ్రమలు వాణిజ్యం రూ. 3,127కోట్లు
  • ఇంధన రంగం రూ. 8,207 కోట్లు
  • ఆర్అండ్‌బీ రూ. 9,554 కోట్లు
  • యువజన, పర్యాటక, సాంస్కృతిక 322కోట్లు
  • పోలీస్ శాఖకు రూ. 8,495 కోట్లు
  • పర్యావరణ, అటవీ రూ. 687 కోట్లు

 

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

Kiran Podishetty

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *