SC/ST/OBC రిజర్వేషన్లపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు..
Amit Shah | లక్నో: లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రస్తుతం రిజర్వేషన్లపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. ఎస్సీ, బీసీ, ఓబీసీ రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్‌లో బీజేపీ అభ్యర్థి రాజ్‌వీర్‌సింగ్‌కు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో అమిత్ షా, కాంగ్రెస్‌ను ‘అబద్ధాల ఫ్యాక్టరీ’ అని అభివర్ణించారు. సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)-కాంగ్రెస్ కూటమిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. రిజర్వేషన్లపై అమిత్ షా మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ (బిజెపి) రిజర్వేషన్లను అమలు చేస్తుందన్నారు. బీజేపీకి 400 సీట్లు వస్తే రిజర్వేషన్‌ను తొలగిస్తామని రాహుల్‌గాంధీ (Rahul Gandhi) చెప్పారు. రెండు పర్యాయాలు మాకు పూర్తి మెజారిటీ ఉందని, కానీ నరేంద్ర మోడీ (PM Modi) రిజర్వేషన్‌కు మద్దతు తెలిపారని గుర్తుచేశారు. రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేయదని, ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలకు రిజర్వేషన్లను ఎవరికీ బదిలీ చేయదని అమిత్ షా స్పష్టం చేశారు.
రామమందిర నిర్మాణ అంశాన్ని(Ayodhya Ram Temple) కూడా అమిత్ షా (Amit Shah ) లేవనెత్తారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్ వెనుకబడిన తరగతుల శ్రేయోభిలాషి అని కొనియాడారు. కళ్యాణ్ సింగ్ తన జీవితాన్ని వెనుకబడిన తరగతుల సంక్షేమం, రామ మందిర మోక్షానికి అంకితం చేశారని షా పేర్కొన్నారు. 1992లో ములాయం సింగ్ యాదవ్ అయోధ్యలో కరసేవకులపై కాల్పులు జరపాలని పోలీసులను ఆదేశించారని ఆరోపించారు. అయితే నరేంద్ర మోదీ జనవరి 22 న ఆలయ శంకుస్థాపనను పూర్తి చేశారని అన్నారు. ఆలయ శంకుస్థాపనకు సోనియా గాంధీ, రాహుల్, మల్లికార్జున్ ఖర్గే, అఖిలేష్, డింపుల్ యాదవ్‌లకు ఆహ్వానం అందిందని, అయితే వారెవరూ అయోధ్యకు వెళ్లలేదని అమిత్ షా తెలిపారు. ‘కాంగ్రెస్, రాహుల్ ‘బాబా’, అఖిలేష్ యాదవ్ పార్టీ 70 ఏళ్లకు పైగా పరిష్కరించని రామాలయ సమస్యను బీజేపీ పరిష్కరించిందన్నారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
One thought on “SC/ST/OBC రిజర్వేషన్లపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు..”