Friday, April 11Welcome to Vandebhaarath

లక్నో నుంచి అయోధ్యకు 6 రోజుల పాదయాత్ర చేసిన ముస్లింలు.. రాముడికి ప్రత్యేక పూజలు

Spread the love

అయోధ్య : లక్నో నుంచి ఆరు రోజుల పాదయాత్రను ముగించుకుని 350 మంది ముస్లిం భక్తులు (Muslim devotees) అయోధ్యకు చేరుకుని రామాలయంలో దర్శనం చేసుకున్నారు. ముస్లిం రాష్ట్రీయ మంచ్ (Muslim Rashtriya Manch – MRM) నేతృత్వంలో  ఈ బృందం జనవరి 25 న లక్నో నుండి తమ ప్రయాణాన్ని ప్రారంభించిందని MRM మీడియా ఇన్‌ఛార్జ్ షాహిద్ సయీద్ బుధవారం తెలిపారు.

350 మంది ముస్లిం భక్తులతో కూడిన ‘జై శ్రీరాం’ అంటూ నినాదాలు చేస్తూ తీవ్రమైన చలికి కూడా లెక్కచేయకుండా దాదాపు 150 కిలోమీటర్ల మేర కాలినడకన వెళ్లి మంగళవారం అయోధ్య (Ayodhya) కు చేరుకున్నట్లు ఆయన తెలిపారు. వారు రాత్రి విశ్రాంతి కోసం ప్రతి 25 కిలోమీటర్లకు ఆగి, మరుసటి ఉదయం తమ ప్రయాణాన్ని కొనసాగించారని వివరించారు.

READ MORE  Ayodhya Deepotsav 2024 | దేదీప్యమానంగా అయోధ్య .. 28 లక్షల దీపాల‌తో గిన్నిస్ రికార్డ్..

ఆరు రోజుల తర్వాత, అరిగిపోయిన పాదరక్షలు, అలసిపోయిన కాళ్లతో భక్తులు అయోధ్యకు చేరుకుని కొత్తగా ప్రతిష్టించిన రామ్ లల్లా విగ్రహానికి మొక్కులు చెల్లించుకున్నారని సయీద్ తెలిపారు.

“భక్తులు ఇమామ్-ఎ-హింద్ రామ్ యొక్క ఈ గౌరవప్రదమైన దర్శనాన్ని తమ మన్సులు ఎన్నటికీ చెరగని జ్ఞాపకంగా భావించారు,” అని ఆయన అన్నారు, ముస్లిం ఆరాధకుల ఈ చర్య ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వం సామరస్య సందేశాన్ని అందించిందన్నారు.

దర్శనానంతరం, MRM కన్వీనర్ రాజా రయీస్..  బృందానికి నాయకత్వం వహించిన ప్రాంతీయ సమన్వయకర్త షేర్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. భగవంతుడు అందరికీ పూర్వీకుడని అన్నారు.  మతం, కులం, మతం కంటే దేశం.. మానవత్వం, ప్రేమకు ప్రాధాన్యతనిస్తుందని రయీస్, ఖాన్ పేర్కొన్నారు. ఏ మతమూ ఇతరులను విమర్శించడం, ఎగతాళి చేయడం లేదా అసహ్యించుకోవడం బోధించదని వారు స్పష్టం చేశారు.

READ MORE  Himachal Pradesh | సిమ్లాలో భారీ నిరసన.. అక్రమంగా నిర్మించిన మసీదును కూల్చివేయాలని డిమాండ్‌

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *