National

Rozgar Mela | దేశవ్యాప్తంగా 51,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు

Spread the love

16వ రోజ్‌గార్ మేళాలో ప్రధాని మోదీ చేతులమీదుగా నియామక పత్రాల పంపిణీ

Rozgar Mela : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Mod) జూలై 12న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థలలో కొత్తగా నియమితులైన 51,000 కి పైగా య‌వ‌త‌కు నియామక లేఖలను పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా నియామకం పొందిన వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారని PMO శుక్రవారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

16వ రోజ్‌గార్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాలలో జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలలో నియామకాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎంపికైన కొత్త ఉద్యోగులు రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పోస్టల్ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, ఇతర విభాగాలు, మంత్రిత్వ శాఖలలో చేరనున్నట్లు ప్రకటనలో తెలిపింది.

ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రధానమంత్రి నిబద్ధతను నెరవేర్చే దిశగా రోజ్‌గార్ మేళా ఒక అడుగు. యువత సాధికారత సాధించడానికి మరియు దేశ నిర్మాణంలో పాల్గొనడానికి అర్థవంతమైన అవకాశాలను అందించడంలో రోజ్‌గార్ మేళా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అధికారిక గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా రోజ్‌గార్ మేళాల ద్వారా ఇప్పటివరకు 10 లక్షలకు పైగా నియామక లేఖలు జారీ చేసింది. నియామకులైన వారిని దేశవ్యాప్తంగా ఎంపిక చేశారు. మిషన్ మోడ్‌లో మరిన్ని ఉపాధి అవకాశాలను సృష్టించాలనే తన నిబద్ధతలో భాగంగా, అక్టోబర్ 22, 2022న ప్రధానమంత్రి మోదీ రోజ్‌గార్ మేళాను ప్రారంభించారు. ఈ చొరవ వివిధ ప్రభుత్వ శాఖలు మరియు సంస్థలలో నియామక ప్రక్రియను వేగవంతం చేయడంలో సహాయపడింది.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

Kiran Podishetty

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *