Hyderabad Skills University | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయబోతున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (Young India Skills University)కి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కిల్స్ యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి మెగా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి మెఘా కంపెనీ (Megha Company) తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల నుంచి రూ.200 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో యూనివర్సిటీ ప్రాంగణంలో అన్ని భవనాలను నిర్మించే బాధ్యతలను మెఘాకంపెనీ తీసుకుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అన్ని అత్యాధునిక సౌకర్యాలు ఉండేలా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణం చేపట్టనున్నారు. ఈమేరకు సచివాలయంలో శనివారం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తో మెఘా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి నేతృత్వంలో కంపెనీ ప్రతినిధుల బృందం సమావేశమైంది. విశ్వవిద్యాలయ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.
కాగా అంతర్జాతీయ ప్రమాణాలతో స్కిల్స్ యూనివర్సిటీ క్యాంపస్ ను నిర్మిస్తామని మెఘా కంపెనీ వెల్లడించింది. హైదరాబాద్ శివారులోని కందుకూరు మండలం మీర్ ఖాన్ పేట సమీపంలో 57 ఎకరాల విస్తీర్ణంలో స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేసిన విషయం తెలిసిందే.. అధునాతన బోధనతోపాటు విద్యార్థులకు సకల సౌకర్యాలతో క్యాంపస ను అందుబాటులోకి తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, ఈ క్యాంపస్ నిర్మాణానికి ముందుకు వొచ్చిన మెఘా కంపెనీకి సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఇప్పటికే ఆర్కిటెక్ట్ నిపుణులతో రూపొందించిన యూనివర్సిటీ భవన నమూనాలను, డిజైన్లను పరిశీలించారు. వారం రోజుల్లోగా భవన డిజైన్లను ఫైనల్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. వొచ్చే నెల నవంబర్ 8 నుంచి యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..