Posted in

ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం 2024: తేదీ, చరిత్ర, ప్రాముఖ్యత, ఎలా జరుపుకోవాలి

World Physiotherapy Day
World Physiotherapy Day
Spread the love

World Physiotherapy Day 2024 | రోగుల సంరక్షణలో ఫిజియోథెరపిస్టులు చేసే సేవలను గుర్తించేందుకు ప్రతి సంవత్సంర సెప్టెంబర్ 8న ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఫిజియోథెరపిస్టుల సేవలను గౌరవించేందుకు ఆరోగ్య సంరక్షణలో ఫిజియోథెరపీ ప్రాముఖ్యతను తెలుసుకునేందుకు సెప్టెంబర్ 8న ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని మొదటిసారిగా 1996లో ప్రారంభించారు. దీనిని గతంలో వరల్డ్ కాన్ఫెడరేషన్ ఫర్ ఫిజికల్ థెరపీ (WCPT)గా పిలిచేవారు. సెప్టెంబర్ 8, 1951లో WCPT ని స్థాపించారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫిజియోథెరపీ సంఘాలను ఒకచోట చేర్చడం లక్ష్యంగా ఏటా ఫిజియోథెరపీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాల్లో ఫిజియోథెరపీ నిపుణులు, రోగులు, వైద్య సంస్థలు చురుగ్గా పాల్గొనడం వల్ల ఇది ప్రపంచ ఉద్యమంగా మారింది. ఫిజియోథెరపిస్ట్‌లు తమ పనిని ప్రోత్సహించడానికి, ఫిజియోథెరపీపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ వేడుక‌లు ఉప‌యోగ‌పడుతున్నాయి.

ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం ప్రాముఖ్యత

World Physiotherapy Day  significance : ఫిజియోథెరపీ కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులను మాత్రమే కాకుండా  అనేక దీర్ఘకాలిక వైకల్యంతో బాథపడుతున్నవారు.. దీని ద్వారా వైకల్యాన్ని జయించినవారు ఎందరో ఉన్నారు.  శస్త్రచికిత్స లేదా గాయాల తర్వాత రోగుల‌ను సాధార‌ణ స్థితికి తీసుకు వ‌చ్చేందుకు ఈ ఫిజియోథెర‌పీ ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న వ్యక్తులకు ఫిజియోథెరపీ ఒక వరంగా నిలుస్తుంది.

ఫిజియోథెరపీ ప్రపంచం నిరంతరం అభివృద్ధి చెందుతోంది. సాంప్రదాయ సాంకేతికతల నుంచి అత్యాధునిక సాంకేతికతల వరకు, ముక్తకంఠంతో మార్పును స్వీకరించారు. ఈ కొత్త వైద్యవిద్య పద్ధతులు రోగులకు వారి ప్రత్యేక అవసరాలకు అత్యుత్తమ చికిత్సను సంరక్షణను అందజేస్తుంది.

ప్రపంచ ఫిజియోథెరపీ డే 2024ని ఎలా జరుపుకోవాలి

  • ఫిజియోథెరపీ క్లినిక్‌లు, ఆసుపత్రులు, సంస్థలు ఆరోగ్యాన్ని ప‌రిరక్షించేందుకు ఫిజియోథెరపీ ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించడానికి వర్క్‌షాప్‌లు, సెమినార్‌లు లేదా ఆన్‌లైన్ వెబ్‌నార్లను నిర్వహించవచ్చు.
  • ఫిజియోథెరపీ కేంద్రాలు నివారణ ఫిజియోథెరపీ ప్రయోజనాల గురించి అవగాహన కల్పించడానికి ఉచిత క‌న్సెల్టెష‌న్లు, వైద్య‌శిబిరాలు నిర్వ‌హించ‌వ‌చ్చు.
  • ఫిజియోథెర‌పీ ద్వారా విజ‌య‌వంతంగా ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకున్న రోగుల‌కు సంబంధించిన ఇంట‌ర్వ్యూలు, వీడియోల‌ను సోష‌ల మీడియా ద్వారా లేదా ఈవెంట్ల ద్వారా ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌వ‌చ్చు.
  • మెరుగైన శారీరక ఆరోగ్యంపై ప్రజలకు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఉచిత వ్యాయామ తరగతులు, యోగా సెషన్‌లు లేదా స్ట్రెచింగ్ వర్క్‌షాప్‌లు వంటి ఈవెంట్‌లను నిర్వహించండి.
  • సోషల్ మీడియాలో వీడియోల‌కు #WorldPhysiotherapyDay2024
    #PhysiotherapyForLife వంటి హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించడం మర్చిపోవద్దు.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.
Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *