Electric blanket | చలిని దూరం చేసే ఎలక్ట్రిక్ దుప్పట్లు.. అందమైన రంగులు, అందుబాటు ధరల్లోనే..
Electric blanket | శీతాకాలం దేశంలోని పలు ప్రాంతాల్లో రోజురోజుకు చలితీవ్ర పెరుగుతోంది. చలి కారణంగా ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. చలి నుంచి రక్షణ పొందేందుకు చాలా మంది సాధారణంగా దుప్పట్లు, స్వెట్టర్లు ఉపయోగిస్తారు. కొందరు హోమ్ హీటర్లను కూడా వినియోగిస్తారు. అయితే, ఎముకలు కొరికే చలి నుంచి మిమ్మల్ని కాపాడే ప్రత్యేకమైన ప్రోడక్ట్ గురించి మేము మీకు చెప్పబోతున్నాం.. ఇది మిమ్మల్ని చలి నుంచి రక్షిస్తుంది. అదే ఎలక్ట్రిక్ బ్లాంకెట్.. ఈ ఎలక్ట్రిక్ దుప్పటి ఆన్ లైన్ లో గానీ ఆఫ్ లైన్ లో గానీ సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ దుప్పట్లు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి.
ఈ దుప్పట్ల ప్రత్యేకత ఏమిటంటే.. అవి మీరు మంచంపై పడుకోగానే చాలా తొందరగా వెచ్చదనాన్ని అందిస్తాయి. ఎంత చలినైనా అధిగమించవచ్చు. తీవ్రమైన చలిలో కూడా మీకు ఇది ఎంతో ఉపశమనం ఇస్తుంది.
కరెంట్ షాక్ కొడుతుందా..?
ఈ ఎలక్ట్రిక్ బ్లాంకెట్ అని చెప్పగానే చాలా మంది మనసులో సందేహం కలగొచ్చు.. ఈ దుప్పటి వల్ల కరెంట్ షాక్ లాంటి సమస్యలు ఉండవా.. అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. వాస్తవానికి, ఇది షాక్ ప్రూఫ్ ప్రొడక్ట్. Amazon India లో ఈ ఎలక్ట్రిక్ బ్లాంకెట్‌ను విక్రయిస్తున్న విక్రేత ఈ వివరాలను వెల్లడించారు.
ఎలక్ట్రిక్ దుప్పటిని ఉపయోగించడానికి దానిని ప్లగ్ కు కనెక్ట్ చేయాలి. దీని తర్వాత దానిలో మనకు కావల్సినంత ఉష్ణోగ్రత ను సెట్ చేయాలి. ఆ తర్వాత అది తన పనిని తాను చేయడం ప్రారంభిస్తుంది. ఇందులో కావాల్సిన టెంపరేచర్ ను సెట్ చేసుకోవచ్చు.
అమేజాన్ వంటి ఈ- కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో అనేక వెరైటీల్లో ఎలక్ట్రిక్ బ్లాంకెట్లు అందుబాటులో ఉన్నాయి. ఆన్ లైన్ షాపింగ్ అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్ లు మాత్రమే కాకుండా అనేక ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ఎలక్ట్రిక్ బ్లాంకెట్లు అమ్మకానికి ఉన్నాయి. మీరు వాటిని స్థానిక మార్కెట్ నుంచి కూడా కొనుగోలు చేయొచ్చు.
ఇక ఈ ఎలక్ట్రిక్ దుప్పట్లు డిజైన్, ఫీచర్లను బట్టి వివిధ ధరల్లో లభిస్తున్నాయి. దీని ధరలు రూ. 900 నుంచి ప్రారంభమవుతాయి. ఎలక్ట్రిక్ దుప్పట్లు అనేక రకాల పేర్లతో అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రిక్ బెడ్ వార్మర్, ఎలక్ట్రిక్ అండర్ బ్లాంకెట్ పేరుతో వీటిని సెర్చ్ చేసి కొనుగోలు చేయవచ్చు.
దీనిని ఉతకవచ్చా..?
Electric blanket కి సంబంధించి రెండో ప్రశ్న.. దీనిని ఉతకవచ్చా.? సాధారణంగా ఇది హీటింగ్ ఎలిమెంట్లను కలిగి ఉంటుంది. ఇది నీళ్లలో తడిస్తే వెంటనే పాడవుతుంది. అయితే, చాలా కంపెనీలు తమ హీటింగ్ ఎలిమెంట్.. వాటర్ ప్రూఫ్ అని పేర్కొంటున్నాయి. ఇది దుప్పటిని సురక్షితంగా ఉంచుతుంది.
సాధారణ బ్లాంకెట్లలో రెసిస్టెన్స్ వైర్ వేడెక్కడం ద్వారా విద్యుత్ శక్తి, ఉష్ణశక్తి గా మారుతుంది. అయితే ఈ బ్లాంక్లెట్లలో పొరలు పొరలుగా కాటన్ ఉండి, దాని మధ్యలో పీవీసీ పైపు ఉంటుంది. ఈ పైపు ద్వారా ఉష్ణశక్తి దుప్పటిలోని అన్ని వైపులకు ప్రసరిస్తుంది.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..