పేజర్లు అంటే ఏమిటి? అవి ఎలా పనిచేస్తాయి.. ?
1 min read

పేజర్లు అంటే ఏమిటి? అవి ఎలా పనిచేస్తాయి.. ?

Spread the love

Pager | బీరుట్: లెబనాన్‌లో టెర్రర్ గ్రూప్ హిజ్బుల్లాను లక్ష్యంగా చేసుకుని ఒకేసారి పేజర్లు పేలిపోవడంతో   తొమ్మిది మంది మరణించగా, 2,800 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో లెబనాన్‌లోని తమ రాయబారి మొజ్తాబా అమానీ కూడా గాయపడ్డారని ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. లెబనాన్‌లో స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు (సాయంత్రం 6 గంటలకు IST) పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది చనిపోయారని, దాదాపు 2,800 మంది గాయపడ్డారని లెబనీస్ ఆరోగ్య మంత్రి ఫిరాస్ అబియాడ్ ధృవీకరించారు.

పేజర్లు అంటే ఏమిటి?

పేజర్ లేదా ‘బీపర్’ అనేది రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ద్వారా సంక్షిప్త సందేశాలను స్వీకరించే చిన్న, పోర్టబుల్ కమ్యూనికేషన్ పరికరం. సెల్ ఫోన్లు అందుబాటులోకి రాకముందు పేజర్లను విస్తృతంగా ఉప‌యోగించేవారు ముఖ్యంగా వైద్యులు, పాత్రికేయులు, సాంకేతిక నిపుణులు, యూత్ కోసం అప్ప‌ట్లో ఇది అత్యంత‌ కీలకమైన కమ్యూనికేషన్ సాధనంగా ఉండేది. దీని సాయంతో మారుమూల ప్రాంతాలలో కూడా ముఖ్యమైన, అత్య‌వ‌స‌ర‌మైన‌ సందేశాలను పంపుకోవ‌చ్చు.

Pager : ఎలా పని చేస్తాయి?

పేజర్ రేడియో తరంగాల ద్వారా సందేశం పంపించిన‌ప్పుడు ఈ పరికరం ప్రత్యేకమైన బీప్ సౌండ్ తో వినియోగదారుని అల‌ర్ట్ చేస్తుంది. ఆయా సందేశాలు తెసుకొని దానికి ప్రతిస్పందించడానికి వినియోగదారు సమీపంలోని పబ్లిక్ లేదా ల్యాండ్‌లైన్ ఫోన్ ను ఆశ్ర‌యించేవారు.. అయితే టెక్నాల‌జీ అభివృద్ధి చెందడంతో పేజర్లు మ‌రుగున‌ప‌డిపోయాయి.  అయితే, 1990ల నాటికి, మొబైల్ ఫోన్ల రాక‌తో పేజ‌ర్లు దాదాపుగా అంత‌రించిపోయాయి. 1990ల చివరి నాటికి, బీపర్ (పేజ‌ర్లు) లు ఎక్కువగా ప్రజల నుంచి అదృశ్యమయ్యాయి.

హిజ్బుల్లా సభ్యులు ఇప్పటికీ పేజర్‌లను ఎందుకు ఉపయోగిస్తున్నారు

ఇరాన్-మద్దతుగల హిజ్బుల్లాను లక్ష్యంగా చేసుకున్న ఇటీవలి సైబర్‌టాక్, చాలా మంది వాడుకలో లేని పేజర్‌లను ఇప్పటికీ సమూహంలో ఉపయోగిస్తున్నారని వెల్లడించింది. హిజ్బుల్లా స‌భ్య‌లు ఇజ్రాయెలీ లొకేషన్-ట్రాకింగ్ నుండి తప్పించుకోవడానికి తక్కువ-టెక్ కమ్యూనికేషన్ సాధనంగా పేజర్లను ఉపయోగించారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.
Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *