Western Railway : లోకల్ రైళ్లకు ఆకర్షణీయమైన డైనమిక్ డిజిటల్ డిస్ల్పే బోర్డులు..
Western Railway : పశ్చిమ రైల్వే (WR) “ముంబై ప్రయాణిల కోసం “లోకల్ రైలు కోచ్‌ల సైడ్ ప్యానెల్‌లపై అత్యాధునికమైన డైనమిక్ డిజిటల్ డిస్‌ప్లే బోర్డు (Panorama Digital Display Board) లను ఏర్పాటు చేసింది. ఈ వినూత్న డిస్ల్పేలతో ప్రయాణికులకు లోకల్ రైలు గమ్యస్థానాల వివరాలు స్పష్టంగా, వెంటనే గుర్తించేలా చేస్తుంది. ఇది ముంబై సబర్బన్ నెట్‌వర్క్‌లో మరింత సౌకర్యవంతంగా మార్చేసిందని WR యొక్క కొత్త చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వినీత్ అభిషేక్ ఒక ప్రకటనలో తెలిపారు.
రైళ్ల రాకపోకలకు సంబంధించిన కీలకమైన సమాచారం అందించడానికి ఒక రేక్‌పై ఎనిమిది డిజిటల్ డిస్‌ప్లేలు, ప్రతి వైపు నాలుగు అమర్చబడి ఉన్నాయని ఆయన చెప్పారు. డిజిటల్ డిస్‌ప్లేలు రైలు గమ్యస్థానాల వివరాలు ఇంగ్లీష్, హిందీ, మరాఠీలో చూపుతాయని, మూడు సెకన్ల వ్యవధిలో మారిపోతాయని తెలిపారు.
వీటిపై ప్రయాణీకుల నుంచి సానుకూల స్పందన లభించిందని, సమీప భవిష్యత్తులో ఇతర రేక్‌లలో డిస్‌ప్లే బోర్డులను ఇన్‌స్టాల్ చేయడానికి Western Railway ప్లాన్ చేస్తుందని వీనిత్ అభిషేక్ తెలిపారు. ఇదిలా ఉండగా పశ్చిమ రైల్వే ప్రతిరోజూ 1,300 కంటే ఎక్కువ సబర్బన్ రైల్వే సర్వీసులను నిర్వహిస్తోంది. దక్షిణ ముంబైలోని చర్చ్‌గేట్, మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని దహను మధ్య విస్తరించిన ఈ నెట్‌వర్క్‌లో సుమారు 30 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.
- డిజిటల్ డిస్ప్లేలు పూర్తి HD TFT (థిన్ ఫిల్మ్ ట్రాన్సిస్టర్) తో రూపొందించారు.
- ఎండ, వాన నుంచి రక్షించేందుకు డిస్ప్లేలకు కఠినమైన గ్లాస్ రక్షణగా ఉంటుంది.
- ప్రజలు స్క్రీన్‌లపై వివరాలను స్పష్టంగా కనిపించేలా సరైన బ్రైట్ నెస్, & వ్యూయింగ్ యాంగిల్స్ ను కలిగి ఉంటాయి.
- డిస్ప్లే స్క్రీన్‌ల కాంట్రాస్ట్ సెన్సార్ల ద్వారా ఆటోమెటిక్ గా నియంత్రించబడుతుంది, తద్వారా టెక్స్ట్ 5 మీటర్ల దూరం నుండి కూడా స్పష్టంగా కనిపిస్తుంది
- డిస్ప్లేలు 5 మిమీ మందం గల పాలికార్బోనేట్ షీట్‌తో రక్షించబడ్డాయి
- రైలు కదులుతున్నపుడు వైబ్రేషన్ కారణంగా డిస్‌ప్లే పడిపోకుండా నిరోధించడానికి స్ప్లిట్ పిన్ అమరికతో లాక్ చేశారు.
Catching Commuter’s Eye…!
WR has successfully installed Panorama Digital Display on sides panels of motor coaches of a Mumbai Suburban Local.
The display panels are dynamic & will provide passengers with clear, immediate & accurate train service details, such as destination,… pic.twitter.com/rrUTpHj9w1
— Western Railway (@WesternRly) June 12, 2024
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్రను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..