Weekly Horoscope | వార ఫలాలు : ఈ వారం రాశి ఫలాలు.. మీ రాశి ఎలా ఉందంటే..?

Weekly Horoscope | వార ఫలాలు : ఈ వారం రాశి ఫలాలు.. మీ రాశి ఎలా ఉందంటే..?

Weekly Horoscope Telugu : ఈ వారం ((24’th Dec – 30’th Dec)) రాశి ఫలాలు ఒక్కో రాశివారికి ఒక్కో విధంగా ఉన్నాయి. డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 30 వరకు రాశి ఫలాలు ఒకసారి తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు సుమన్ శర్మ వీటిని అందించారు.

మేష రాశి (24’th Dec – 30’th Dec)

మేష రాశి వారికి ఈ వారంలో సంగీతము మరియు సాహిత్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. మీ జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు తొలగి సఖ్యత బలపడుతుంది. పోలీస్ శాఖ వారికి పదోన్నతులు ఉండును. ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఆలస్యం అవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. గొడవల జోలికి పోవడం వలన నష్టపోయే అవకాశం కలదు. వ్యాపారస్తులకు మధ్యవర్తిత్వాల వల్ల లాభం చేయికురుతుంది. మానసికపరమైన వత్తిడిని ధైర్యంగా అధిగమించాలి. దైవారాధనలో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అజీర్ణంతో ఇబ్బంది పడే వారికి ఉపశమనం ఉంటుంది. గృహ నిర్మాణానికి సంబంధించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి యోగ కాలము. మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ వారంలో పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళనకు గురవుతారు. విద్యార్థులు అధిక శ్రమ చేయవలసిన సమయ. శత్రువుల మీద వ్యూహం రచిస్తారు. మీ జీవిత భాగస్వామితో శాంతంగా వ్యవహరించాలి. కులవృత్తి చేసే వారికి అభివృద్ధి ఉంటుంది. చెడు ఆలోచనలకు దూరంగా ఉండండి. ఇమిటేషన్ జ్యువలరీ వ్యాపారస్తులకు కొంత ఇబ్బందులు ఉండును. ఈ రాశి స్త్రీలకు గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కలవు. ఏ నిర్ణయమైనా తండ్రితో చర్చించి తీసుకుంటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బ్యాంకు రుణాలు ఆలస్యం అవుతాయి. ఆర్థికపరమైన ఎదుగుదల ఉంటుంది. వ్యర్థ ప్రయాణములు చేయవలసి వస్తుంది. దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

మిధున రాశి

మిధున రాశి వారికి ఈ వారంలో వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్త పాటించాలి. విద్యార్థులకు సత్ఫలితాలు ఉండును. సంతాన ప్రవర్తనను చూసి ఆనందిస్తారు. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. కుల సంఘాల ప్రోత్సాహంతో రాజకీయపరమైన అడుగులు వేస్తారు. రెవెన్యూ ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును. పండ్ల వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. ఎడమ చెయ్యి నొప్పితో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. విదేశీ ప్రయత్నాలు చేసే వారికి విసా మంజూరు అవుతుంది. అనవసరమైన ఆలోచనలకు దూరంగా ఉండండి. తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. నూతన ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. మీ శ్రమకి తగిన గుర్తింపు లభిస్తుంది. చండి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

READ MORE  Astrology Signs | ఈ వారంలో 12 రాశులవారికి శుభ ఫలితాలు ఇవే..

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ వారంలో పితృదేవతల ఆశీస్సులు మరియు దైవానుగ్రహం ఉంటుంది. విద్యార్థులు ఎంచుకున్న లక్ష్యాన్ని సులువుగా చేరుకోగలుగుతారు. గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే వారికి ఉపశమనం ఉంటుంది. పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వ వైద్య వృత్తిలో ఉన్న వారికి ఇబ్బందులు ఉండను. ఏ నిర్ణయమైనా మనోధైర్యంతో తీసుకుంటారు. తిను బండారాలకు సంబంధించిన వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉండను. గృహము నందు శుభకార్యాలు నిర్వహిస్తారు. మీ వ్యాపార భాగస్వామితో ఏర్పడిన సమస్యలను పరిష్కరించుకుంటారు. కడుపుకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భద్రకాళి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదని సూచన.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ వారంలో రెండు విధములుగా ధనార్జన ఉంటుంది. సోదరి సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. విద్యార్థులు శ్రమించవలసిన సమయం. స్త్రీలు వంట చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కారణం శరీరానికి గాయాలయ్య అవకాశం కలదు. ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి పదోన్నతులు ఉండును. తల్లితో తగాదాలకు దూరంగా ఉండాలి. వడ్డీ వ్యాపారస్తులకు మధ్యవర్తిత్వాల వల్ల లాభం చేకూరుతుంది. నూతన వాహన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మానసిక ఒత్తిడిని ధైర్యంగా అధిగమించాలి. అనవసరమైన ఆలోచనల జోలికి పోకూడదు. మీ జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు వచ్చును. రియల్ ఎస్టేట్ వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండును. తండ్రికి వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. ఈశ్వర ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

కన్యా రాశి

కన్య రాశి వారికి ఈ వారంలో ఒంటరిగా ఉండాలి అనే ఒక ఆలోచన విధానం ఉంటుంది. అల్లం మరియు ఉల్లిగడ్డ వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. సోదరీ సోదరతో స్థిరాస్తులకు సంబంధించిన చర్చలు కొలిక్కి వస్తాయి. స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన గృహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కళా రంగంలో ఉన్న వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. సంతాన భవిష్యత్తుకై ధనాన్ని పొదుపు చేస్తారు. అన్ని విధాల అదృష్టం తోడవుతుంది. జీవిత భాగస్వామితో తగాదాలకు దిగడం అంత మంచిది కాదు. గృహంలో దైవతా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారాన్ని విస్తరించాలనె ఆలోచన బలపడుతుంది. చర్మ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడతారు. దుర్గాదేవి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

తులా రాశి

తుల రాశి వారికి ఈ వారంలో అనవసరమైన ఖర్చులు మీద పడతాయి. విలాసవంతంగా కాలాన్ని గడుపుతారు. ఏ నిర్ణయమైనా కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకోవాలి. పేయింట్స్ వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. స్త్రీలకు హెయిర్ ఫాల్ ఒక సమస్యగా మారుతుంది. శత్రువులతో అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులకు సత్ఫలితాలు ఉండును. చిట్ ఫండ్ వ్యాపారస్తులకు పాత బాకీలు వసలవుతాయి. అలంకారానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కలవు. దేవాదాయ శాఖలో పనిచేసే వారికి పదోన్నతులు ఉండును. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. అప్పులు కొంతమేరకు తీర్చగలుగుతారు. మీ జీవిత భాగస్వామికి వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. గణపతి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

READ MORE  Weekly Horoscope: నవంబర్ 19 నుంచి 25వరకు.. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది?

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ వారంలో దైవారాధనలో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. స్త్రీల కొరకు ధన వ్యయం చేయవలసి వస్తుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. విద్యార్థులు శ్రమ చేయవలసిన సమయం. నడుము నొప్పితో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉండును. వెండి వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. కుటుంబ పరమైన సౌఖ్యం ఉంటుంది. ఆస్తి కొనుగోలు విషయమై స్నేహితులతో చర్చలు నిర్వహిస్తారు. ఆరోగ్యపరమైన శ్రద్ధ అవసరం. తీర్థయాత్రలు చేస్తారు. శత్రువుల మీద వ్యూహ రచన చేస్తారు. బ్యాంక్ లోన్ మంజూరు అవుతుంది. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి

ధనస్సు రాశి

ఈ రాశి వారికి ఈ వారంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయడం అంత మంచిది కాదు. మీ జీవిత భాగస్వామితో సఖ్యత బలపడుతుంది. అనవసరమైన ఖర్చులు చేయకూడదు. చెడు వ్యసనాల జోలికి పోకూడదు. మీ తెలివితేటలతో వ్యాపారంలో అధిక లాభాలను పొందగలుగుతారు. వారాంతంలో శారీరక శ్రమ గోచరిస్తోంది. నూతన వస్త్ర లాభం కలదు. వేడి ఆహార పదార్థాలతో జాగ్రత్తగా ఉండండి. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా సమయాన్ని గడుపుతారు. విద్యార్థులు శ్రమించడం ద్వారా సత్ఫలితాలను పొందగలుగుతారు. మీ పుత్ర సంతాన ఎదుగుదలను చూసి ఆనందిస్తారు. కాలభైరవ స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

మకర రాశి

ఈ రాశి వారికి ఈ వారంలో తండ్రి నిర్ణయాలతో ఏకీభవిస్తారు. పైరవీల ద్వారా ఉద్యోగాన్ని పొందగలుగుతారు. రెవెన్యూ శాఖ ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును. ప్రభుత్వానికి సంబంధించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. విద్యార్థులకు యోగ కాలము. హార్డ్ వేర్ ప్లైవుడ్ వ్యాపారస్తులకు ఇబ్బందులు ఉండును. బంధువులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మంచి నిద్ర లేకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని అడుగులు ముందుకు వేస్తారు. వృత్తిపరంగా ఉన్న మానసిక బత్తిడిని ధైర్యంగా అధిగమించాలి. ఆర్థికపరమైన వ్యాసులుబాటు ఉంటుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. తల్లికి ఆరోగ్యం కుదుటపడుతుంది. మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండాలి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

READ MORE  Weekly Horoscope : ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా కలిసివస్తుంది?

కుంభ రాశి

కుంభరాశి వారికి ఈ వారంలో మీ ప్రవర్తన మరియు మాటతీరు ద్వారా మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ద్వేషించే అవకాశం కలదు. పోలీస్ శాఖ వారికి పదోన్నతులు ఉండును. విద్యార్థులకు మంచి కాలము. చిట్ ఫండ్ , బుక్ స్టాల్స్ వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. ప్రతి చిన్న విషయంలోనూ మొండితనం అంత మంచిది కాదు. మీడియా వృత్తిలో ఉన్నవారికి వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. శుభకార్యాలకు హాజరవుతారు. అధికమైన ధన వ్యయము చేయవలసి వస్తుంది. పంటి నొప్పితో ఇబ్బంది పడతారు. సోమరితనంతో పనులు వాయిదా వేయకూడదు. భూమికి సంబంధించిన పనులు పూర్తవుతాయి. ఒక స్నేహితుని సహాయం ఆనందాన్ని కలిగిస్తుంది. వీరభద్ర స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

మీన రాశి

Weekly Horoscope మీన రాశి వారికి ఈ వారంలో వ్యాపార భాగస్వామితో న్యాయపరమైన సమస్యలు వచ్చే అవకాశాలు కలవు. స్థిరాస్తుల వల్ల లాభం చేకూరుతుంది. అకారణ వైరములకు దూరంగా ఉండాలి. విద్యార్థులకు మతిమరుపు ఒక సమస్యగా ఉంటుంది. వైద్య వృత్తిలో ఉన్న ఉద్యోగస్తులకి అధికారుల నుంచి సమస్యలు ఉండను. వెండి మరియు ముత్యం వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. రాజకీయంలో ఉన్నవారు శత్రువుల వ్యూహాన్ని ముందుగానే పసిగడ్తారు. స్త్రీలు అందం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. చెడు వ్యసనాల జోలికి పోకూడదు. శ్వాస కోస అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. కుటుంబ సభ్యులతో యాత్రలు చేసే అవకాశం కలదు. జమాన సంతకాలు చేయకూడదు. వ్యాయామం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. దుర్గాదేవి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

Weekly Horoscope By

స్వర్ణకంకణధారి, జ్యోతిష్య జ్ఞాన ప్రదీపక
డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ
7730023250, 8978510978


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *