Weekly Horoscope : 12 రాశుల వారికి గ్రహ ఫలాలు..

Weekly Horoscope : 12 రాశుల వారికి గ్రహ ఫలాలు..

Horoscope : అక్టోబర్ 22 నుంచి 28వ తేదీ వరకు  మేష రాశి మొదలు.. మీన రాశి వరకు 12 రాశులవారికి  ఆదివారం నుంచి గ్రహ ఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేష రాశి

ఈ వారంలో నివాసంలో మార్పులు చేర్పులు చేయవలసి వస్తుంది. వ్యాపార నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంత కన్ ఫ్యూజన్ కు గురవుతారు. సేవా కార్యక్రమాలలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. సంకల్పించిన పనుల యందు నిరుత్సాహం ఎదురవుతుంది, ఆత్మీ యుల ఎడబాటు మీ మానసిక ఆందోళనకు కారణమవుతాయి. బంధుమిత్రులతో వైరం అంత మంచిది కాదు. అనవసరమైన విషయాల పట్ల విపరీతమైన భయాందోళన కలుగుతాయి. వృత్తి వ్యాపారపరమైన అభివృద్ధి కోసం వేసే అడుగులు మనోధైర్యంతో తీసుకోవాలి. విద్యా ర్థులు పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు, చేతికి అందకుండా ఆలస్యమై ఇబ్బంది పెడుతున్న ధనం చేతికి అందుతుంది. మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

వృషభ రాశి

ఈ వారంలో వృత్తి యందు ఇబ్బందులు కలిగే అవకాశాలు కలవు. ఇతరుల విషయాల్లో తల దూర్చడం వల్ల అవమానాలను ఎదుర్కొంటారు, శత్రుత్వం లేకుండా అందరితో సఖ్యతగా మెలగాలి, తలనొప్పితో ఇబ్బంది పడే అవకాశం కలదు, విద్యార్థులు అధిక సుమ చేయడం ద్వారా సత్ఫలితాలను పొందగలుగుతారు, మీ మాట చెల్లుబాటు అవుతుంది, గృహంలో పూజా పునస్కారాలు నిర్వహించే అవకాశాలు కలవు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి, వ్యాపారస్తులకు ఇబ్బందులు ఉండును. కుటుంబపరమైన సమస్యలు ఉండే అవకాశాలు కనిపిస్తాయి. మానసిక ఉల్లాసంతో కాలాన్ని గడుపుతారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. దుర్గాదేవి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

మిధున రాశి

ఈ వారంలో ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును సంకల్పించిన పనులు పూర్తవుతాయి, సోదరీ సోదరులతో వైరానికి దూరంగా ఉండాలి, ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవాలి. ఉష్ణ సంబంధిత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కలవు. వేడి ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి, శారీరక శ్రమ గోచరిస్తుంది. వ్యాపారస్తులకు లభించే చోటనే కొంత నష్టం కలిగి అవకాశం కలదు. అజీర్ణంతో ఇబ్బంది పడతారు, కుటుంబపరమైన కలతలకు దూరంగా ఉండండి, శుభకార్యం నిర్వహించే అవకాశం కలదు. మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

READ MORE  Weekly Horoscope | వార ఫలాలు : ఈ వారం రాశి ఫలాలు.. మీ రాశి ఎలా ఉందంటే..?

కర్కాటక రాశి

ఈ వారంలో వ్యర్థ సంచారం చేయవలసి వస్తుంది. వృత్తిలో స్వల్ప అభివృద్ధి ఉంటుంది. అకారణ కలహాలు అధికమవుతాయి. విద్యార్థులు అధిక శ్రమ చేయవలసిన సమయం, తల్లితో అకారణ కలహాలకు దూరంగా ఉండి సఖ్యతతో మెలగాలి. ఈ రాశి స్త్రీలకు గర్భసంబంధ అనారోగ్య సమస్యలు ఉండును. బంధువుల వల్ల ఇబ్బందులు ఉండే అవకాశాలు కలవు. తెలిసి తెలియక చేసిన తప్పులకు అవమానములను ఎదుర్కోవలసి వస్తుంది, మీ జీవిత భాగస్వామితో సఖ్యతతో మెలగాలి. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి.

సింహరాశి

ఈ వారంలో స్థిరాస్సుల వల్ల లాభం చేకూరుతుంది. ఉద్యోగస్తులకు అధికారం నుంచి సమస్యలు ఉండును. విద్యార్థులకు యోగ కాలం పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి. సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. ఈ నిర్ణయమైనా అనుభవజ్ఞులైన వారిని సంప్రదించి సలహాలు సూచనలు తీసుకోవలసిందిగా చెప్పదగిన సూచన. సంకల్పించిన పనులు పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలు మీ మానసిక ఆందోళన కారణమవుతాయి. గృహంలో శుభకార్యం నిర్వహించే అవకాశం కలదు. మీ జీవిత భాగస్వామితో సరదాగా కాలాన్ని గడుపుతారు, పంటి నొప్పితో మరియు అజీర్ణంతో ఇబ్బంది పడే అవకాశం కలదు, బంధుమిత్రులతో వైరం అంత మంచిది కాదు, ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

కన్య రాశి

ఈ వారంలో గృహపరమైన సమస్యలు అయ్యే అవకాశాలు కలవు, సంకల్పించిన పనులు ఆలస్యం అవుతాయి, భార్యతో కలహం అంత మంచిది కాద, అధిక ధన వ్యయం చేయవలసి వస్తుంది, బంధువులతో బిందు వినోదాలకు హాజరవుతారు, ఇతరులకు ధన సహాయం చేయడం వల్ల నష్టపోయే అవకాశం కలదు , కుటుంబంలోని సభ్యులతో సఖ్యతగా మెలగాలి, నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలము, వాత సంబంధ అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడుతారు, పుణ్య కార్యాలు నిర్వహించే అవకాశం కలదు, వృత్తి వ్యాపార పరమైన అభివృద్ధి కోసం వేసే అడుగులు అనుకూలిస్తాయి, విద్యార్థులు అధిక చేయడం ద్వారా సత్ఫలితాలను చూడగలుగుతారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదని సూచన.

READ MORE  Mesha Rasi Ugadi Rasi Phalalu| క్రోధి నామ ఉగాది పంచాంగం: మేష రాశి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి..

తులారాశి

ఈ వారంలో విలాసవంతంగా ఆనందంగా కాలాన్ని గడుపుతారు, ఉదర నేత్ర సంబంధత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కలవు, సంకల్పించిన పనులు పూర్తవుతాయి, వీళ్ళ తప్పిన భోజనం ఉంటుంది, ఎవరితోనైనా స్నేహం చేసే ముందు ఆలోచించి చేయాలి, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి, తరచూ మీ అభిప్రాయాలను మార్చుకోవడం వలన ఇతరులు మీ ప్రవర్తనను వ్యతిరేకించే అవకాశం కలదు, స్త్రీలతో వైరంకు దూరంగా ఉండాలి, ముఖ్యమైన విషయాలు మర్చిపోవడం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు, ధనం పొదుపు చేసుకోవలసిందిగా చెప్పదగిన సూచన, శత్రువులని కూడా చంచలమైన మనసుతో క్షమిస్తారు, వెంకటేశ్వర స్వామి ఆరాధనలు చేయడం చెప్పదగిన సూచన.

వృశ్చిక రాశి

ఈ వారంలో బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు కలవు, ఈ రాసి స్త్రీలు అలంకారానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కలవు, ఉద్యోగస్తులకు స్థాన చలనము ఉండును, విద్యార్థులు అధిక శ్రమ చేయవలసిన సమయం, మీ దగ్గరి బంధువుల మరణ వార్త విని అవకాశాలు కలవు, ఏ పని చేయాలన్నా శరీరము సహకరించదు మరియు శారీరక శ్రమ ఉంటుంది, బంగారం వ్యాపారస్తులకు కొంత ఇబ్బంది ఉండును, సోదరి సోదరులతో సఖ్యత బలపడుతుంది, ముఖ్యమైన విషయాలు మరిచిపోకూడదు. నిర్ణయాలు తీసుకునే విషయంలో మానసిక ఆందోళనకు గురవుతారు. ఆరోగ్యపరమైన శ్రద్ధ అవసరం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలు చేయడం చెప్పదగిన సూచన .

ధనస్సు రాశి

ఈ వారంలో దైవానుగ్రహం ఉంటుంది. చెడు ఆలోచనలకు దూరంగా ఉండండి. సంకల్పించిన పనులు పూర్తవుతాయి, వ్యాపారస్తులు అధిక లాభాలను పొందగలుగుతారు. అన్ని విధాల అ­దృష్టం తోడవుతుంది. స్థిరాస్తుల వల్ల లాభం చేకూరుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. ఏ నిర్ణయమైనా ధైర్యంగా తీసుకొని అడుగులు ముందుకు వేస్తారు, దైవారాధన మీద ఎక్కువ సమయాన్ని గడుపుతారు. నూతన ఆదాయ మార్గాలనువేశిస్తారు, మిత్రులను కలుసుకొని సరదాగా కాలాన్ని గడుపుతారు. బంధుమిత్రులతో వైరం మీ మానసిక ఆందోళనకు కారణమవుతాయి. దుర్గాదేవి ఆరాధనలు చేయడం చెప్పదగిన సూచన.

READ MORE  Ugadi Panchangam | క్రోధి నామ ఉగాది పంచాంగం: మిథున రాశి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి..

మకర రాశి

ఈ వారంలో ధనాన్ని పొదుపు చేసుకోవలసిందిగా చెప్పదగిన సూచన, దుష్టులతో అకారణ కలహాలకు దూరంగా ఉండాలి, ఆరోగ్యపరమైన శ్రద్ధ అవసరం, బంధుమిత్రులను కలుసుకొని సరదాగా కాలాన్ని గడుపుతారు, నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి, వ్యాపారస్తులకు కొంత ఇబ్బందులు ఉండును, ఉద్యోగస్తులకు వృత్తిపరమైన వ్యతిరేకత ఉంటుంది, విద్యార్థులకి మంచి కాలము మరియు పోటీ పరీక్షలు యందు విజయాలు సాధిస్తారు, కుటుంబ పరమైన సౌఖ్యం ఉండును, మీకు రావాల్సిన ధనం చేతికి అందుతుంది, ఆభరణాలకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు, ఆంజనేయ స్వామి ఆరాధనలు చేయడం చెప్పదగిన సూచన.

కుంభరాశి

ఈ వారంలో ధనపరమైన ఇబ్బందులు మీ మానసిక ఆందోళనకు కారణం అవుతాయి. సంకల్పించిన పనులు ఆలస్యమైనప్పటికీ పూర్తవుతాయి. శరీరం సహకరించకపోవడం వల్ల పనులను వాయిదా వేస్తారు. స్త్రీలతో కలహాలకు దూరంగా ఉండండి. అనవసరమైన కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అసంతృప్తి భోజనం ఉంటుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. తండ్రి గారికి అనారోగ్య సూచన. అధిక ఖర్చులు మీద పడతాయి. కుటుంబపరమైన సౌఖ్యం ఉండును. పంటి నొప్పి వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

మీన రాశి

మీన రాశి వారు ఈ వారంలో ఉన్నదాంట్లో సంతృప్తి చెందుతారు. దుష్టులతో అకారణ కలహాలకు దూరంగా ఉండండి. అధిక ధన వ్యయం చేయకుండా ధనం ను పొదుపు చేసుకోవలసిందిగా చెప్పదగిన సూచన, మీ జీవిత భాగ్య స్వామితో సఖ్యతగా మెలగాలి. శత్రువులతో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారస్తులకు కొంత ఇబ్బందులు ఉండును. నడుము నొప్పితో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. మీ ప్రవర్తన ద్వారా మీ స్నేహితులు, బంధువులు మిమ్మల్ని ద్వేషించే అవకాశం కలదు. ఆలస్యమై ఇబ్బంది పెడుతున్నటువంటి ధనము చేతికందుతుంది. ఇతరుల విషయంలో తలదులుచుకోవడం వల్ల ఇబ్బంది పడతారు. నూతన వస్త్ర లాభము కలదు. వెంకటేశ్వర స్వామి ఆరాధన లు చేయడం చెప్పదగిన సూచన.


స్వర్ణకంకణధారి, జ్యోతిష్య జ్ఞాన ప్రదీపక
డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ
7730023250, 8978510978

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *